9, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 165

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ననన ననన నన్ను నినిని నిన్ను.

8, డిసెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 164

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 31

ఈ ఘట్టం ఏది?
సీ.
త్రిపురాంతకుండైన దేవుని పేరేది?
పంజరమ్మున నుండు పక్షి యేది?
యమలోకమున బాధ లందువా రెవ్వరు?
దేవభాషను పూల తీగె యేది?
చూడ జటాయువు సోదరుం డెవ్వఁడు?
మెడలోని నగ కేది మేలు పేరు?
గాయమై కాయమ్ము కార్చు ద్రవ మ్మేది?
చంద్రబింబమ్ముఁ బోల్చఁ దగు నేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
ధర్మజు నధిక్షేపించి తప్పుఁ జేసి
నట్టి ఖలుని కృష్ణుఁడు చంపు ఘట్ట మగును.
ఆ ఘట్ట మేదో చెప్పండి.

7, డిసెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 163

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కృష్ణుఁ జంప నెంచి క్రీడి వెడలె.

గళ్ళ నుడి కట్టు - 65


అడ్డం
1. సంస్కృతికి సంబంధించింది (4)
3. స్వరోచి తల్లి. అల్లసానివారిని అడగండి (4)
7. మాసార్ధం, రెక్క (2)
8. పిల్లి (3)
9. సాకు, వక్రం (2)
12. కార్తిక మాసపు నక్షత్రం (3)
13. ఆనందము నందించే ఇంద్రుని వనం (3)
17. గార్ధభం చివరి అక్షరాన్ని తన్నింది (2)
18. జింక. చెడ్డ రంగస్థలమా? (3)
19. జలం బాపతు పక్షి (2)
22. సింహం (4)
23. అర్జునుడు బీభత్సుడే (4)
నిలువు
1. దీపం పట్టిన సానిని చూస్తే కృష్ణుని గురువు కనిపిస్తాడు (4)
2. అతిరిక్తమైన చేదు (2)
4. పురూరవునిలో ఆకారం (2)
5. స్థిరమైన ఉనికి. నిలబడు కడదాకా (4)
6. మరీచికలు కంపించే మరుభూమి (3)
10. గోడ (3)
11. ఎర్ర తామర. కెంపు + తమ్మి = ? (3)
14. శృంగార నాటకంలో చౌరస్తా (4)
15. జింక లేదా ఏనుగు (3)
16. మేనమామ (4)
20. కత్తి పదును లేదా అంచు (2)
21. తల్లి. అంబకు వికృతి (2)

6, డిసెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 162

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు.

5, డిసెంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 161

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?
దీనిని పంపించిన రవి గారికి ధన్యవాదాలు.
నిజానికి రవి గారు "ఇడ్లీ" అంటే దుష్కరప్రాస అవుతుందని, కవి మిత్రులకు ఇబ్బందిగా ఉంటుందనుకొని "ఇడిలీ" అన్నారు. కాని నాకు మీరంతా సమర్థులనే నమ్మకంతో "ఇడ్లీ" అన్నాను.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 160

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ!
దీనిని పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

2, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 159

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సరస యతుల పొందు సౌఖ్య మిడును.
దీనిని పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

1, డిసెంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 158

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె.
దీనిని సూచించిన విశ్రాంత తెలుగు పండితులు, నాకు కొత్త బంధువు శ్రీ వంగూరు శ్యామసుందర్ ( మాల్ గ్రామ వాస్తవ్యులు) గారికి ధన్యవాదాలు.