నాన్న! నిన్న నేను నిన్ననే నానోను నెన్నినాను నాన్న! నాను,నాను , నోనొ నోనొ ననిన, నేనిన! నేనిన! ననన ననన నన్ను నినిని నిన్ను.
( నాన్న నిన్నఅంటె నిన్ననే నేను నానో కారును ఎన్నుకొన్నాను (సెలెక్ట్) .నాన్న ఒప్పుకో, ఒప్పుకో !(నాను,నాను ) నో నో అని ఆనినను(ననిన) నేను వినను వినను (నేనిన నేనిన,) సమస్య క్రొత్తగా ఉంది. మరి పూరణ ఎలా ఉందొ?)
ఇన్ని 'న' లతో ఎలా పూరిస్తారా అనుకుంటూంటే మంద పీతాంబర్ గారు, నానోలు, నో నో లు, నేనినను అంటూ అంతా 'నా' మయం చేసేసారు. ఎప్పటిలాగే బా...బా...బ్బా... బ్బా (పోకిరీ బాబ్బాబ్బాబ్బాబ్ కాదండీ) బాగున్నాయి పూరణలన్నీ. ఇక గురువు గారి పూరణ కై ఆతృత గా ఎదురు చూస్తూ... - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
బ్లాగు మిత్రు లందరికీ నమస్కృతులు. బంధువుల గృహప్రవేశానికి "నల్లగొండ" వచ్చాను. అందు వల్ల బ్లాగు నిర్వహణలో చిన్న ఆటంకం ఏర్పడింది. నిన్న నల్లగొండలో తిరిగి తిరిగి ఒక నెట్ సెంటర్ వెతికి మిత్రుల పూరణలు చదివి ఆనందించాను. ఒక్కొక్కరి పూరణలకు నా వ్యాఖ్యలు లేఖినిలో టైప్ చేసి పోస్ట్ చేయబోయే లోగా "పవర్ కట్"! మళ్ళీ మూడు సార్లు ఆ సెంటర్ కు వెళ్ళాను. ప్రతిసారి "సిస్టం ఖాళి లేదు సార్" అన్నాడు. బంధువుల బలవంతం మీద రాత్రి ఇక్కడే ఉన్నాను. ఈ రోజు ఎప్పుడు వరంగల్ చేరుకుంటానో? వరంగల్ వెళ్ళిన తరువాత నిన్నటి పూరణలపై నా వ్యాఖ్యలు పెడతాను. ప్రస్తుతానికి ఈ రోజు సమస్యను ఇస్తున్నాను.
రాజమార్గమందు రాజబింబాస్యన
రిప్లయితొలగించండిమెలత గన్నుఁగొట్టె మెల్లకంటి
'కన్నె మెచ్చె నెవని ' కలగెను మిత్రుండు
"ననన..ననన..నన్ను..నినిని..నిన్ను "
నత్తివాడొకండు నారితో నిటుబల్కె
రిప్లయితొలగించండి"ననన ననన నన్ను నినిని నిన్ను
వివి విధియె కక కలిపె" - ముదమందె పడతి
తాను నత్తి యగుట దైవ లీలఁ
ననన నాన్న! అమ్మ నననత్తి అంటోంది
రిప్లయితొలగించండిననన ననన నన్ను నినిని నిన్ను.
ననన నాని! ననన నన్నూను నిన్నూను
అఅఅ అనని దాన్కి అదొక తుత్తి.
"నన్ను-నిన్ను" యనెడి నవ్యచిత్రమునకై,
రిప్లయితొలగించండితాగి కలిసి మెలిసి ఊగి తూగి
పాట రచన జేసి పాడిరందరిటుల
ననన ననన నన్ను నినిని నిన్ను.
నాన్న! నిన్న నేను నిన్ననే నానోను
రిప్లయితొలగించండినెన్నినాను నాన్న! నాను,నాను ,
నోనొ నోనొ ననిన, నేనిన! నేనిన!
ననన ననన నన్ను నినిని నిన్ను.
( నాన్న నిన్నఅంటె నిన్ననే నేను నానో కారును ఎన్నుకొన్నాను (సెలెక్ట్) .నాన్న ఒప్పుకో, ఒప్పుకో !(నాను,నాను )
నో నో అని ఆనినను(ననిన) నేను వినను వినను (నేనిన నేనిన,)
సమస్య క్రొత్తగా ఉంది. మరి పూరణ ఎలా ఉందొ?)
ఇన్ని 'న' లతో ఎలా పూరిస్తారా అనుకుంటూంటే మంద పీతాంబర్ గారు, నానోలు, నో నో లు, నేనినను అంటూ అంతా 'నా' మయం చేసేసారు.
రిప్లయితొలగించండిఎప్పటిలాగే బా...బా...బ్బా... బ్బా (పోకిరీ బాబ్బాబ్బాబ్బాబ్ కాదండీ) బాగున్నాయి పూరణలన్నీ.
ఇక గురువు గారి పూరణ కై ఆతృత గా ఎదురు చూస్తూ...
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
పీతంబార్ గారూ మీ పూరణ బహు చిలిపి!
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ, న,ఏకాకాక్షర పద్యము హృద్యముగా ఉంది. ఎవరో ఒకరు యిలాంటి పూరణ చేస్తారని అది బహుశా పీతాంబర్ గారే అవుతారని ముందే ఊహించాను. బాగుంది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినినిని న్నీకు కూడ ననన్నావలె నననత్తి.
రిప్లయితొలగించండిననన నాకు నువ్వు నీకు నేను.
కకక కలిపె మనల కరుణతొ దైవంబు
ననన ననన నన్ను నినిని నిన్ను.
బ్లాగు మిత్రు లందరికీ నమస్కృతులు.
రిప్లయితొలగించండిబంధువుల గృహప్రవేశానికి "నల్లగొండ" వచ్చాను. అందు వల్ల బ్లాగు నిర్వహణలో చిన్న ఆటంకం ఏర్పడింది.
నిన్న నల్లగొండలో తిరిగి తిరిగి ఒక నెట్ సెంటర్ వెతికి మిత్రుల పూరణలు చదివి ఆనందించాను. ఒక్కొక్కరి పూరణలకు నా వ్యాఖ్యలు లేఖినిలో టైప్ చేసి పోస్ట్ చేయబోయే లోగా "పవర్ కట్"! మళ్ళీ మూడు సార్లు ఆ సెంటర్ కు వెళ్ళాను. ప్రతిసారి "సిస్టం ఖాళి లేదు సార్" అన్నాడు. బంధువుల బలవంతం మీద రాత్రి ఇక్కడే ఉన్నాను. ఈ రోజు ఎప్పుడు వరంగల్ చేరుకుంటానో?
వరంగల్ వెళ్ళిన తరువాత నిన్నటి పూరణలపై నా వ్యాఖ్యలు పెడతాను.
ప్రస్తుతానికి ఈ రోజు సమస్యను ఇస్తున్నాను.
నిన్న ననన నాన్న నిన్ననె నన్ననె
రిప్లయితొలగించండిచచచ చదువు కొనక ససస షైరు
కొట్ట ; మరల జేయ కొకొకొ కొట్టెదరిక
ననన ననన నన్ను నినిని నిన్ను.