7, డిసెంబర్ 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 65


అడ్డం
1. సంస్కృతికి సంబంధించింది (4)
3. స్వరోచి తల్లి. అల్లసానివారిని అడగండి (4)
7. మాసార్ధం, రెక్క (2)
8. పిల్లి (3)
9. సాకు, వక్రం (2)
12. కార్తిక మాసపు నక్షత్రం (3)
13. ఆనందము నందించే ఇంద్రుని వనం (3)
17. గార్ధభం చివరి అక్షరాన్ని తన్నింది (2)
18. జింక. చెడ్డ రంగస్థలమా? (3)
19. జలం బాపతు పక్షి (2)
22. సింహం (4)
23. అర్జునుడు బీభత్సుడే (4)
నిలువు
1. దీపం పట్టిన సానిని చూస్తే కృష్ణుని గురువు కనిపిస్తాడు (4)
2. అతిరిక్తమైన చేదు (2)
4. పురూరవునిలో ఆకారం (2)
5. స్థిరమైన ఉనికి. నిలబడు కడదాకా (4)
6. మరీచికలు కంపించే మరుభూమి (3)
10. గోడ (3)
11. ఎర్ర తామర. కెంపు + తమ్మి = ? (3)
14. శృంగార నాటకంలో చౌరస్తా (4)
15. జింక లేదా ఏనుగు (3)
16. మేనమామ (4)
20. కత్తి పదును లేదా అంచు (2)
21. తల్లి. అంబకు వికృతి (2)

3 కామెంట్‌లు:

  1. అడ్డం:1.సాంస్కృతికం, 3.వరూధిని, 7.పక్షం, 8.బిడాలం,9.వంక, 12.కృత్తిక, 13.నాందనం,17.గాడి,18.కురంగం, 19.బాతు, 22.కంఠీరవం, 23.వివ్వచ్చుడు
    నిలువు:1.సాందీపని, 2.తిక్త(క్తం),4.రూపు,5.నిలకడ, 6.ఎడారి, 10.భిత్తిక, 11.కెందమ్మి, 14.శృంగాటకం, 15.సారంగం, 16.మాతులుడు,20.ధార, 21.అవ్వ

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    అభినందనలు. మీ సమాధానాలన్నీ సరిపోయాయి.

    రిప్లయితొలగించండి