చంద్రశేఖర్ గారూ సారీ ఫర్ ఇట్. చాలా పూరణల విషయంలో ఇలాగే అవుతూంది. ఇద్దరం భావ సారూప్యం గల వ్యక్తులమన్న మాట.దేశాల మధ్య ఉండే కాలాన్తరాలు కూడా బలమైన కారణం అనుకొంటున్నాను. కానీ మీరు వైవిధ్యమైన పూరణలు అందించడంలో దిట్టలు.
మిస్సన్నగారూ,అజ్ఞాతగారూ మీ పూరణలు చాలా బాగున్నాయి.చంద్రశేఖర్ గారూ పురాణాలు తిరగెయ్యండి. మీ పదజాలము పదవిన్యాసము వేఱు.చక్కని పూరణ అదే వస్తూంది. నా అల్పజ్ఞానముతో నేను అందించే పూరణ:
సోదరు లందరి శుభాకాంక్షలతొ బహు రమణీయమైన బహామాస్ ను తిలకించి రాగలిగాము." ఇది పుష్పక విమానమా ? భూతల స్వర్గమా ? అన్న బ్రాంతిని కలిగించె N.C.L.షిప్పు ,అచ్చటి బీచ్ లు ముక్కలు ముక్కలు గా ఉన్న చిన్న చిన్న ద్వీపాలు.అలనాటి గ్రీకు రాజుల జ్ఞాపకాల కట్టడాలు.18 క్యారెట్ల బంగారంతొ కట్ట బడిన భవనపు పై కప్పు [ సీలింగు ] ఫిష్ ఎక్వెరియం .అచ్చటి వీధులు ,కొబ్బరి, తాటి, ఈత ,మోదుగ , లాంటి మన వృక్ష రాజములు, రంగు రంగుల మందారాలు ,బొగన్ విల్లాలు మనకి స్వాగతం పలుకుతాయి ఐతె 40 కళ్ళు 80 రోజులు ఐనా అక్కడి అందాలు తిలకించ డానికి సరిపొవని పించింది.కానీ ఏదేశ మేగినా ఎందు కాలిడినా అన్నట్టు ,మన భారతీయ సౌందర్య సంపద మాత్రం తక్కువా ? ఆస్వాదించె హృదయం ఉండాలె గాని ? ? ? అందుకె వెంటనె మన తెలుగు దనం ,మన ఆత్మీయత ,మన పూరణలు గుర్తు కొచ్చె సరికి తిరుగు ముఖం పట్టాం .[ అక్కడికేదొ షిప్పు మనల్ని దింపేసి ఆగి పోయినట్టు ? ] ?????
మంచి పదునైన సమస్యని సూచించినందుకు శ్రీ శ్యామ సుందర్ గారికి ధన్యవాదాలు. కాలాభావం వల్ల గబగబా పూరించాను. అంతతృప్తిగాలేదు. రామ పట్టాభిషేక పూ ర్వసమయమున రాము డనియె భ రతుఁగని “రాజు నీవె!”, భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె భక్తి సేవా ఫలములందు బంటు రీతి!
నరసింహ మూర్తి గారి అల్ప జ్ఞానమనే జ్ఞానముతో చేసిన పూరణ, చంద్రశేఖర్ గారి అసంతృప్తి అనే తృప్తిగా చేసిన పూరణ అద్భుతంగా ఉన్నాయి. రాజేశ్వరిగారి బహమా విశేషాలు బావున్నాయి.అజ్ఞాతగారి పూరణ అమోఘం.
ఇప్పుడే భోజనం చేసి తీరికగా పూరణలన్నీ చదువుతున్నాను. మిత్రులు డా.మూర్తి గారు నా భరతుని భక్తి concept కూడా కొట్టేశారు. ఏదో మిస్సన్నగారి దగ్గర మిస్ కొట్టి 'భక్తి' పదం పెడదామంటే, గన్నవరపు వారు సన్నగా నా పదం కొట్టేశారు. సింహ శార్దూలాలనించి తప్పించుకోవటం కష్టమే(నవ్వుతూ)!
మనోహరమైన పూరణలతో బ్లాగును అలంకరిస్తూ, మీ మీ విశ్లేషణలను, చతురోక్తులను అందిస్తూ అలరిస్తున్న కవిమిత్రులందరికీ ధన్యవాదాలు. వైవిధ్యమైన పూరణ ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇంకా ఏ భావమూ తట్టలేదు. అందరి పూరణలను చదివి ఆనందించాను. రాజేశ్వరి గారి బహామాస్ పర్యటనా విశేషాలు సంతోషాన్ని కలిగించాయి. వారి పద్యంలో చివరి పాదంలో "ఎదనిండ సమస్యలు" అన్నప్పుడు గణదోషం ఉంది. దానిని "ఎదలో సమస్యలు" అంటే సరిపోతుంది.
కరడు గట్టిన క్రౌర్యపు కరకుదనము
రిప్లయితొలగించండిదాల్చె నీరూపు నిజమని తల్లి దూరి
భరతుఁ డెదిరించి, రాముని భాగ మడిగె
తనకు వనవాసమున దుఃఖ తప్తుడగుచు.
మిస్సన్న గారు నా ఐడియా కొట్టేశారు (నవ్వుతూ).
రిప్లయితొలగించండిరాళ్లు రప్పలు నీ పాలు; రాజ్యలక్ష్మి
రిప్లయితొలగించండిఅహహ నా పాలు అని యెట్టులనుభవింతు???!!!!
ఇడుములన్నియు నీకేన? యేమిటనుచు
భరతుడెదిరించి రాముని భాగమడిగె!!!
చంద్రశేఖర్ గారూ సారీ ఫర్ ఇట్. చాలా పూరణల విషయంలో ఇలాగే అవుతూంది. ఇద్దరం భావ సారూప్యం గల వ్యక్తులమన్న మాట.దేశాల మధ్య ఉండే కాలాన్తరాలు కూడా బలమైన కారణం అనుకొంటున్నాను. కానీ మీరు వైవిధ్యమైన పూరణలు అందించడంలో దిట్టలు.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ,అజ్ఞాతగారూ మీ పూరణలు చాలా బాగున్నాయి.చంద్రశేఖర్ గారూ పురాణాలు తిరగెయ్యండి. మీ పదజాలము పదవిన్యాసము వేఱు.చక్కని పూరణ అదే వస్తూంది. నా అల్పజ్ఞానముతో నేను అందించే పూరణ:
రిప్లయితొలగించండిఅమిత భక్తిని లక్ష్మణు డలరు చుండ
భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె
పాదరక్షలు గైకొని వాదులాట
మాని పూజలుఁ జేసెను వాని భక్తి!
సోదరు లందరి శుభాకాంక్షలతొ బహు రమణీయమైన బహామాస్ ను తిలకించి రాగలిగాము." ఇది పుష్పక విమానమా ? భూతల స్వర్గమా ? అన్న బ్రాంతిని కలిగించె N.C.L.షిప్పు ,అచ్చటి బీచ్ లు ముక్కలు ముక్కలు గా ఉన్న చిన్న చిన్న ద్వీపాలు.అలనాటి గ్రీకు రాజుల జ్ఞాపకాల కట్టడాలు.18 క్యారెట్ల బంగారంతొ కట్ట బడిన భవనపు పై కప్పు [ సీలింగు ] ఫిష్ ఎక్వెరియం .అచ్చటి వీధులు ,కొబ్బరి, తాటి, ఈత ,మోదుగ , లాంటి మన వృక్ష రాజములు, రంగు రంగుల మందారాలు ,బొగన్ విల్లాలు మనకి స్వాగతం పలుకుతాయి ఐతె 40 కళ్ళు 80 రోజులు ఐనా అక్కడి అందాలు తిలకించ డానికి సరిపొవని పించింది.కానీ ఏదేశ మేగినా ఎందు కాలిడినా అన్నట్టు ,మన భారతీయ సౌందర్య సంపద మాత్రం తక్కువా ? ఆస్వాదించె హృదయం ఉండాలె గాని ? ? ?
రిప్లయితొలగించండిఅందుకె వెంటనె మన తెలుగు దనం ,మన ఆత్మీయత ,మన పూరణలు గుర్తు కొచ్చె సరికి తిరుగు ముఖం పట్టాం .[ అక్కడికేదొ షిప్పు మనల్ని దింపేసి ఆగి పోయినట్టు ? ] ?????
భరతు డెదిరించి రాముని భాగ మడిగె
రిప్లయితొలగించండినెటులొ స్వార్ధ బుద్ధి యదేమి నతని కెంత ?
భరత భూమిని యెదిరించి బహమ కెడితె
దొలిచె యెదనిండ సమస్యలు తెనుగు పైన !
క్షమించాలి .తమాషాకి వ్రాసానంతె.
మంచి పదునైన సమస్యని సూచించినందుకు శ్రీ శ్యామ సుందర్ గారికి ధన్యవాదాలు. కాలాభావం వల్ల గబగబా పూరించాను. అంతతృప్తిగాలేదు.
రిప్లయితొలగించండిరామ పట్టాభిషేక పూ ర్వసమయమున
రాము డనియె భ రతుఁగని “రాజు నీవె!”,
భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె
భక్తి సేవా ఫలములందు బంటు రీతి!
నరసింహ మూర్తి గారి అల్ప జ్ఞానమనే జ్ఞానముతో చేసిన పూరణ, చంద్రశేఖర్ గారి అసంతృప్తి అనే తృప్తిగా చేసిన పూరణ అద్భుతంగా ఉన్నాయి. రాజేశ్వరిగారి బహమా విశేషాలు బావున్నాయి.అజ్ఞాతగారి పూరణ అమోఘం.
రిప్లయితొలగించండిఇప్పుడే భోజనం చేసి తీరికగా పూరణలన్నీ చదువుతున్నాను. మిత్రులు డా.మూర్తి గారు నా భరతుని భక్తి concept కూడా కొట్టేశారు. ఏదో మిస్సన్నగారి దగ్గర మిస్ కొట్టి 'భక్తి' పదం పెడదామంటే, గన్నవరపు వారు సన్నగా నా పదం కొట్టేశారు. సింహ శార్దూలాలనించి తప్పించుకోవటం కష్టమే(నవ్వుతూ)!
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారికి సుస్వాగతము. చంద్రశేఖర్ గారి పూరణ అద్భుతంగా ఉంది. నా పద్యము మరల చదివితే పాదరక్షలను పాదుకలు చేస్తే బాగుంటుందని పించింది.
రిప్లయితొలగించండిఅతుల భక్తిని లక్ష్మణు డలరు చుండ
భరతుఁ డెదిరించి రాముని భాగమడిగె
పాదుకలను గ్రహించెను వాదులాట
మాని పూజలు జేసెను వాని భక్తి
మనోహరమైన పూరణలతో బ్లాగును అలంకరిస్తూ, మీ మీ విశ్లేషణలను, చతురోక్తులను అందిస్తూ అలరిస్తున్న కవిమిత్రులందరికీ ధన్యవాదాలు. వైవిధ్యమైన పూరణ ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇంకా ఏ భావమూ తట్టలేదు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలను చదివి ఆనందించాను.
రాజేశ్వరి గారి బహామాస్ పర్యటనా విశేషాలు సంతోషాన్ని కలిగించాయి. వారి పద్యంలో చివరి పాదంలో "ఎదనిండ సమస్యలు" అన్నప్పుడు గణదోషం ఉంది. దానిని "ఎదలో సమస్యలు" అంటే సరిపోతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభరతుడు శ్రీ రాముని తో ....
రిప్లయితొలగించండి'అన్న వదినెల వదలక నహరహమ్ము
సేవ జేయుచు నుందును చెంత ' ననుచు
పరగ లక్ష్మణు కిచ్చిన భాగ్యమందు
భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
అంతకు ముందున్న మీ వ్యాఖ్య తొలగించినట్లుగా ఉంది. ఇది దానికి సవరణ పద్యమా? లేక క్రొత్తదా?