7, డిసెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 163

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కృష్ణుఁ జంప నెంచి క్రీడి వెడలె.

11 కామెంట్‌లు:

 1. భీష్మ తీక్షణoపు భీకర పోరును,
  నోపలేక శౌరి నోర్మివీడె!
  వీరుడుండ రాదు విజయమ్ము,ననిజెప్పె
  కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!!

  రిప్లయితొలగించండి
 2. ఈరోజు మధ్యాహ్నం నా పూరణ బ్లాగులో ఉంచినట్లు బాగా గుర్తు. కాని ఇప్పుడు కనపట్లేదు. పునరుక్తి అయితే దయచేసి అన్యథా భావించకండి.

  కొమరు మరణ కర్త క్రూరుని సైంధవు
  మట్టు పెట్టె దంచు యొట్టు పెట్టి
  కనుల నిప్పు రాల కణకణ తోడ్కొని
  కృష్ణుఁ, జంప నెంచి క్రీడి వెడలె.

  రిప్లయితొలగించండి
 3. చిన్న తప్పుని సరిదిద్దాను. క్షమించండి.

  క్షీర మేల నొసగె చేడియ పూతన
  కర్ణు నెవరు గూల్చె, కైక చెప్ప
  రాము డేమి చేసె రమణి లక్ష్మణులతో
  కృష్ణుఁ జంప నెంచి, క్రీడి, వెడలె !

  రిప్లయితొలగించండి
 4. మంద పీతాంబర్ గారూ,
  మంచి సందర్భాన్ని ఎన్నుకొని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
  కాని "వీరు డుండరాదు విజయమ్ము నని జెప్పి కృష్ణు" అన్న వాక్యం అర్థం కావడం లేదు.
  "ఆయుధమ్ము పట్ట నంటి వనుచు నాపి కృష్ణు" అంటే ఎలా ఉంటుంది?

  మిస్సన్న గారూ,
  మధాహ్నం మీ పూరణ బ్లాగుకు కాని, నా జిమెయిల్ కు కాని చేరలేదు. ఎలాగూ వ్యాఖ్యల మాడరేషన్ తొలగించాను కనుక మీ వ్యాఖ్యలు నేరుగా, వెంటనే బ్లాగులో కనిపించాలి. మరి మీ వ్యాఖ్య ఎలా తప్పిపోయిందో?
  మంచి సందర్భాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
  రెండవ పాదంలో "పెట్టె దంచు" అనడం కంటె "పెట్టెద నని" అంటే బాగుంటుంది కదా?

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. నా పూరణ .......
  సంతసమ్మున రథసారథిగాఁ జేసి
  కృష్ణుఁ; జంప నెంచి క్రీడి వెడలె
  కౌరవ బలములను; కాని యందలి బంధు
  జనులఁ గాంచి వారిఁ జంప ననెను.

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గారు ,నమస్కారం.

  "భీష్ముని వంటి వీరుడు యుద్దభుమిలో నుండగా మనకు విజయము రాదు" అది దుర్లభము అని అర్జనునుకి కృష్ణుడు జెప్పినట్లు "భావన చేసి పూరణ చేసాను.మీ సవరణ కూడా చక్కగా సరిపోయింది.

  రిప్లయితొలగించండి
 7. పట్టి వ్యూహ మందు పసివాని జంపిరి
  కాగ సైన్ధవుండె కారణమ్ము
  మట్టి జేతు ననుచు మదిలోన నెరనమ్మి
  కృష్ణుఁ; జంప నెంచి క్రీడి వెడలె.

  రిప్లయితొలగించండి
 8. ఆ.వె. ధర్మ పథము వీడి దయలేక నభిమన్యు
  చావుకు కతమైన సైంధవుడిని
  సమర మందు పూని సాయ మడిగి
  కృష్ణు;జంప నెంచి క్రీడి వెడలె.

  రిప్లయితొలగించండి
 9. జనార్దన రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి