2, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 159

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సరస యతుల పొందు సౌఖ్య మిడును.
దీనిని పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. ప్రాస కొరకు నే ప్రయాసమ్ము పడరాదు!!!
    గణములు సమకూర్ప వణుకరాదు!!!!
    రాగ భావ యుక్త రమ్య సత్కవితలో
    సరస యతుల పొందు సౌఖ్యమిడును!!!!

    రిప్లయితొలగించండి
  2. విమలమతుడు గాడె విజయుండు గాంచగా
    సకల శుభము లిడును శంకరుండు
    గగనసీమ కెగసె గాధేయుని ఖ్యాతి
    సరస యతుల పొందు సౌఖ్య మిడును !


    కకపాల కేదార కటక ముద్రిత పాణి గుఱుచ లాతాముతో గూర్చి పట్టి !
    యూనిఫారం వర్ణన పెద్దన సుందరంగా చేసారు !

    రిప్లయితొలగించండి
  3. గాధి సుతుడు పలికె కౌగిట మేన్కతో
    ఇంద్ర లోక మేల ఇందు వదన
    భువిని స్వర్గ ముండ పోవద్దు వీడి య-
    ప్సరస! యతుల పొందు సౌఖ్యమిడును!

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారూ, అదరగొట్టారు. సమస్యకీలకం పట్టి పూరించినందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఎక్కువ వ్రాద్దమంటే మీరు అజ్ఞాత 'రాణి'యా లేక అజ్ఞాత 'రాజు' యా అని సందేహం. నేను వ్రాసేటప్పుడు క్రియా రూపాల్లో లింగభేదం వస్తే తప్పు గదా! ఏది ఏమైనా బృహన్నల లాగా పద విన్యాసం బ్రహ్మాండంగా చేశారు(నవ్వుతూ)...

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారు ఏమీ తక్కువ తినలేదు. అప్సరస ని దింపి 'సరస' యతిని బుట్టలోకి లాక్కున్నారు.

    రిప్లయితొలగించండి
  6. విజ్ఞానార్జన లక్ష్యము,
    అజ్ఞాన తమిస్ర భావ నాథఃకరణ
    మ్మే జ్ఞేయమైన " వాడను " !!!
    అజ్ఞాతను - నా నమస్సులందరికివియే!!!!

    చంద్ర శేఖర్ గారి అనుమాన నివృత్తి జరిగిందనుకుంటూ..........

    మిస్సన్న గారికి ధన్యవాదాలు.......!!!!

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత గారు దుష్కర ప్రాస "జ్ఞ" వేసి మరీ ఢంకా మీద దెబ్బకొట్టి చెప్పారు. ఇక అజ్ఞాత నామ ధేయము బదులు జ్ఞాత నామధేయము తెలియాలి. ఇప్పటికి ఇంతచాలనుకొంటాను(నవ్వుతూ). ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. నాడు నుడివె “యతివి టుడు గాక పోవునే
    యతివ బిలువ యంచు”, నిన్న మొన్న
    నదియు చూపె నిత్య ఆనంద సామిగా
    సరస యతుల పొందు సౌఖ్య మిడును!
    మనవి: అదివరకు మనం పూరించిన సమస్యని QUOTES లో ఇచ్చాను.

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ నాకు మిత్ర లాభం అది. మీ పద్య సరసం చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారూ,
    కవిత్వంలో సరస యతి భేదాన్ని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.
    నా పూరణకూడ చందస్సులోని సరసయతులను గురించే.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    "గాధేయుని ఖ్యాతి" అన్నప్పుడు "ని" గురువు కాదు. దానివల్ల గణదోషం వస్తున్నది. "గాధేయుని యశమ్ము" అంటే సరిపోతుంది.

    మిస్సన్న గారూ,
    ఎవ్వరూ ఊహించని విధంగా సమస్యను పూరించి ఆశ్చర్య పరిచారు. ధన్యవాదాలు.
    అజ్ఞాత గారి గురించి మీరు చెప్పిన దానితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

    చంద్రశేఖర్ గారూ,
    మీరిచ్చిన సమస్యకు స్పందన చూసారు కదా. సంతోషం!
    ఇక మీ పూరణలో మొదటి రెండు పాదాలలో యతిదోషాలున్నాయి. మొదటి పాదంలో ప్రాసాక్షరానికి ముందు గురువుంది. ప్రాసయతి స్థానంలో లఘువుంది. "నాడు నుడివె"కు బదులు "నుడివె నాడు" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  11. నా పూరణ .....
    అత్త్వమునకుఁ జెల్లు యతిమైత్రి యహలతో
    చఛజఝలకుఁ జెల్లు శషసలకును
    నణలకు యతి చెల్లు నయ సరస యతిగా
    సరస యతుల పొందు సౌఖ్య మిడును.
    ( యతిభేదాలలో సరసయతి ఒకటి. ఇది మూడు విధాలు.
    1. అ-య-హ.
    2. చ-ఛ-జ-ఝ-శ-ష-స.
    3. న-ణ )

    రిప్లయితొలగించండి
  12. మాష్టారు గారు, ధన్యవాదాలు. యతి నాకు సరసంగా సౌఖ్యమివ్వలేదీ పద్యంలో. అప్సరసని చూపించి మిస్సన్నగారు లాగేసుకొన్నారు.

    రిప్లయితొలగించండి
  13. మాష్టారు గారూ, ఈ పద్యం చూడండి. మీ పద్యం చూడగానే సరస యతులను బంధించి తేటగీతిలో,

    చంద్రశేఖర నినుగొల్వ సాగి లబడ
    జాగు చేయను నేను, విషయముల గని
    షడ్రిపుల జయింతునిక నీ చల్లనిగుడి
    శరణు, గాచుమయ్యనను నిజముగ శర్వ!

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ, నమస్కారములు. కొన్ని పొరబాట్లు చెయ్యడం వలన కొన్ని సందేహాలు కూడా నివృత్తి అవుతున్నాయి. మీకు ధన్యవాదములు. అజ్ఞాత గారి పూరణలో "రాగ భావ యుక్త సత్కవిత 'అందంగా సాగింది. మేనక భువిలో ఉండివుంటే మిస్సన్నగారి పూరణకి ముగ్ధురాలై ఉండేది. మీ పూరణతొ చందస్సు పాఠాలు మొదలయ్యాయనుకొంటాను. మీ పూరణలు చాలా బాగుంటున్నాయి. మిత్రులందఱికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. చంద్రశేఖర్ గారూ,
    సరసయతి లక్షణానికి లక్ష్యంగా మీ పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. సార మేమి లేని సంసార జగతిలో
    రెండె మనకు భళిర ! నిండు గాను
    గ్రంథ పఠన మొకటి కనగను మరియును
    సరస యతుల పొందు సౌఖ్య మిడును.
    పొందు = చెలిమి.

    రిప్లయితొలగించండి