పలువురు సామాన్యు లనట ఖలురగు దుండగులు చంప ఖష్పము తోడన్ సలిపిన భారత చర్యలు చలిమలలోఁ జిచ్చు రేగెఁ జల్లార్చుటకే.
పలువురు భారతీయులను పాశవి కమ్ముగ తీవ్ర వాదులౌ ఖలురట గావు పెట్టిరని ఖష్పము భారత ప్రాభ వత్వ మే సలిపిన యట్టిచర్య మనజాతి మనస్సుకు శాంతి గూర్చేనే చలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్.
కందం
రిప్లయితొలగించండికలతలు రేపెడు మంటలు
చలిమల క్రిందఁ జెలరేగ జలమదె పారన్
దులచన శంకరు భ్రుకుటిన్
చలిమలలో చిచ్చురేగెఁ జల్లార్చుటకే!
చంపకమాల
కలతలు రేపెడున్ సరళి క్రమ్మగ జ్వాలలు కొండ క్రిందుగన్
దులచన నీరు పారుటకు త్రుళ్లిన శంకరు త్ర్యంబకంబునన్
జ్వలితము మంచునే కరుగ సాయము జేసి హితమ్ము గూర్చఁగన్
జలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్
కులములపై యుత్తరమున
రిప్లయితొలగించండిచలిమలలోఁ జిచ్చు రేగెఁ ; జల్లార్చుటకే
పొలయు యెనికల సమయమున
యిలపయి నింక నిటువంటి వేర్పాడ కుండన్
రిప్లయితొలగించండిపలువురు సామాన్యు లనట
ఖలురగు దుండగులు చంప ఖష్పము తోడన్
సలిపిన భారత చర్యలు
చలిమలలోఁ జిచ్చు రేగెఁ జల్లార్చుటకే.
పలువురు భారతీయులను పాశవి కమ్ముగ తీవ్ర వాదులౌ
ఖలురట గావు పెట్టిరని ఖష్పము భారత ప్రాభ వత్వ మే
సలిపిన యట్టిచర్య మనజాతి మనస్సుకు శాంతి గూర్చేనే
చలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్.