తగు అగ్నుల అనవచ్చునా? శుభ అగ్నుల అని విడదీసి రాయవచ్చా లేదా శుభాగ్నులు అనే అనాలా? అలాగే నవ అగ్నుల నేను ఇచ్చిన ప్రాంప్టు చాలా సాధారణం "ఈ సమస్య ను పూరించు '
అయితే జెమిని, GPT, Claude లాంటి Applicationలలో కాదు ఛందంను వాటికి అనుసంధానం చేయించి చంధస్సు నియమాలు చెబుతూ కొన్ని టెక్నిక్కు లు కూడా చెబుతూ తయారు చేసిన ఏజెంటు ఇక సాధారణ ప్రాంప్టు కాస్తా తవకూ తాను పలు మార్లు సరిదిద్దు కొంటూ రెండో పాదంలో యతి కుదర్చలేక పోయి ఆగిపోయింది.
ఉ: యత్నము జేయ చిత్రమున నామెయె దర్శక పాత్ర నొందుచున్ "నూత్న నటీమణుల్ గలరు, నొచ్చను వారల నెన్నొకొమ్ము నీ పత్నిగ బాత్ర నీయ" నని పల్కె గదా! యిది యేమి? యామెయున్ బత్నియె ! పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్ (ఒక సినీ నటి దర్శకత్వం వహిస్తోంది. వీళ్లలో నీ భార్యగా ఎవరు సరిపోతారో చూసుకో అని భర్తకి చెప్పింది. ఇదేమి భార్య? అని ఒకరికి ఆశ్చర్యం.)
వ్రతమునాచరించుచునింట భక్తి తోడ వేగ పసుపు కుంకుమగొన ప్రేమగ ద్విజ *పత్ని యతివలను బిలిచి పతికొసంగె* సంచితెమ్మని,ఫలములు జాజి పూలు
యత్నము చేయ చాలసమయమ్మును, పుట్టెను సంతు వారి కిన్ రత్నము వంటి పిల్ల కట రాధిక యంచు ను పేరు పెట్టె నా పత్ని యె పిల్చి కాంతల ను: భర్తకు నిచ్చెను సంతసమ్మునన్ నూత్నపు కాంతితోవెలుగునోములపంటను తాను ప్రేమతో
పత్నిని బిలిచి , స్త్రీలను
రిప్లయితొలగించండిరత్నములుగ దీర్చెదనని రజ్జుగ బలుకన్
యత్నము ఫలించు ననుకొని
పత్ని యతివలఁ బిలిచి తన పతి కొసంగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
రిప్లయితొలగించండినృత్యమును జయ గలిగెడి నెలత లందు
నేర్పు గల యారటిల గడు నోర్పు తోడ
నెంచు కొనమంచు తెలుపుచు నింగము గల
పత్ని యతివలను బిలిచి పతి కొసంగె.
నూత్న గృహ ప్రవేశము వినూత్నముగా తల పెట్ట నెంచి స్త్రీ
రత్నపు నృత్యమున్ బడితరమ్మును చేయ దలంచు వాడి దౌ
యత్నము గాంచి యుక్తమగు నారటి నెంపిక కోసమై యటన్
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్.
నియమ మందున శివదీక్ష నివ్వటిల్ల
రిప్లయితొలగించండినంతిమంబున శ్రీశైల మరుగునపుడు
భర్తకై మంగళారతిన్ బాడుకొనుచు
పత్ని యతివలను బిలచి పతికొసంగె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅయ్యర్ వాళ్ హుకుమ్ హై హమారి
రిప్లయితొలగించండిసబ్ కో మన్ పసంద్ దిల్ పసంద్ భోజన్ రెడీ కర్నా
ఫటాఫట్ :)
ఆమెయొ జిలేబి ! పనిబెట్టు నందరికిని
పత్ని!.... యతివలనుఁ బిలిచి పతి కొసంగె
కత్తి పీటయు కూరలు కాయలున్ను
తరిగి వంట జేయంగను తనుపుదీర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియత్నము విజయమునొసగె నని పొగడి వి
రిప్లయితొలగించండినూత్నమౌ రీతి నాద వినోదిని యగు
పత్ని యతివలనుఁ బిలిచి పతి కొసంగె
రత్న హారతి కడు మంగళ కరమనుచు
యత్నము తెచ్చిపెట్టె విజయంబని భర్తను మెచ్చుకొన్నదై
రత్న విభూషితంబగు విలాస విలోకిత మందిరంబుకున్
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
నూత్న వినోద సంగత మనోహర రీతినిఁ స్వాగతంబునే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిరత్నపు దీపముల్ వెలుఁగ రాత్రుల నింటను చీకటుల్ పడన్
రిప్లయితొలగించండియత్నము సేసి భర్త నవ యగ్నుల దెమ్మని చెప్పె నంతటన్
రత్నపు కాంతులన్ గొనుచు రాజిల నింటిని జేయ నెంచుచున్
పత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
మనవి:
ఇది నా సొంత రచన కాదు ఛందోబద్దమైన యంత్ర సృష్టి. కాకుంటే అసలు ఆలోచనలు నావి
మీ (ఎ. ఐ) పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నవ + అగ్నులు = నవాగ్నులు' అవుతుంది. యడాగమం రాదు.
మీరు ఇచ్చిన ప్రాంమ్ట్ ఏమిటి?
తొలగించండి
తొలగించండితగు అగ్నుల అనవచ్చునా?
శుభ అగ్నుల అని విడదీసి రాయవచ్చా లేదా శుభాగ్నులు అనే అనాలా? అలాగే నవ అగ్నుల
నేను ఇచ్చిన ప్రాంప్టు చాలా సాధారణం
"ఈ సమస్య ను పూరించు '
అయితే జెమిని, GPT, Claude లాంటి Applicationలలో కాదు ఛందంను వాటికి అనుసంధానం చేయించి చంధస్సు నియమాలు చెబుతూ కొన్ని టెక్నిక్కు లు కూడా చెబుతూ తయారు చేసిన ఏజెంటు ఇక సాధారణ ప్రాంప్టు కాస్తా తవకూ తాను పలు మార్లు సరిదిద్దు కొంటూ రెండో పాదంలో యతి కుదర్చలేక పోయి ఆగిపోయింది.
నవ యగ్నుల అనేది నా పరిష్కారం.
విజయ మందియు వచ్చిన వీరుడనుచు
రిప్లయితొలగించండిముదము నందియు దెలుపుచు పొరుగు వారి
పత్ని యతివల ను బిలిచి పతి కొ సo గె
ఘన వి జేతకు హారతి కౌతు కమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరత్నము లాంటి వల్లభుడు లక్షణ మైనది చక్కనైనదౌ
రిప్లయితొలగించండియత్నము నందునన్ ధనము నర్జన చేసి స్వదేశమందునన్
నూత్నగృహంబు తీర్చగ వినూతన రీతిగ చూప దానినే
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రత్నము వంటి" అనండి.
తే.గీ:సైనికుని బెండ్లి యాడియు శాంత రీతి
రిప్లయితొలగించండిదేశభక్తితో తనదైన దిగులు మ్రింగి
పత్ని యతివలనుఁ బిలిచి పతి కొసంగె
హారతుల యుద్ధభూమికి నరుగు వేళ
ఉ: యత్నము జేయ చిత్రమున నామెయె దర్శక పాత్ర నొందుచున్
రిప్లయితొలగించండి"నూత్న నటీమణుల్ గలరు, నొచ్చను వారల నెన్నొకొమ్ము నీ
పత్నిగ బాత్ర నీయ" నని పల్కె గదా! యిది యేమి? యామెయున్
బత్నియె ! పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
(ఒక సినీ నటి దర్శకత్వం వహిస్తోంది. వీళ్లలో నీ భార్యగా ఎవరు సరిపోతారో చూసుకో అని భర్తకి చెప్పింది. ఇదేమి భార్య? అని ఒకరికి ఆశ్చర్యం.)
ఉ॥ యత్నముఁ జేసి వర్తకము నందున వ్రాసి గణించ లెక్కలన్
తొలగించండిబత్నికిఁ దెల్పఁ గూర్చమని భామలనున్ బరికించి యోగ్యులన్
యత్నము నొప్ప బాధ్యతగ నంగనలన్ గని కార్య దక్షులన్
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
(వారి బిజెనెస్ కు అకౌంటింగ్ లేడీస్ కావాలని భార్య అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి ఇచ్చిందన్నట్టుగా వ్రాసానండి)
ఆత్మ వగవక నింతయు నాలకించి
రిప్లయితొలగించండిరాజు నాజ్ఞను బట్టపు రాణి యంగ
నా మణి వెసఁ గౌసల్య తన సవతులను
బత్ని యతివలను బిలిచి పతి కొసంగె
నూత్నము చంద్ర కాంతము వినూత్న విశేషము సూర్య కాంతమున్
రత్నము నిన్పకాంతమును రమ్యతరమ్మును గాంచి యంగనా
రత్నము లంచు నెంచి యనురాగము రేఁగ నెడంద నత్తఱిం
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివ్రతమునాచరించుచునింట భక్తి తోడ
వేగ పసుపు కుంకుమగొన ప్రేమగ ద్విజ
*పత్ని యతివలను బిలిచి పతికొసంగె*
సంచితెమ్మని,ఫలములు జాజి పూలు
యత్నము చేయ చాలసమయమ్మును, పుట్టెను సంతు వారి కిన్
రత్నము వంటి పిల్ల కట రాధిక యంచు ను పేరు పెట్టె నా
పత్ని యె పిల్చి కాంతల ను: భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
నూత్నపు కాంతితోవెలుగునోములపంటను తాను ప్రేమతో
ఉ: నూత్న విధానమందున వినోదము పంచగ నృత్య శైలిలో
రిప్లయితొలగించండిపత్నిని కోర సాయమును, పత్రికలన్ ప్రకటించి, శ్రద్ధతో
యత్నము జేసి నచ్చిన మృగాక్షుల తా నియమించి నేర్పుతో
పత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వ్రతము నాచరించు కొనుచు భక్తితోడ
వాయనమ్ముల నిచ్చెను వ్రతము చివర
పత్ని యతివలను బిలిచి; పతికొసంగె
నక్షతలను నాశీస్సుల నందజేయ.