అగ్నిపర్వతమున నాశ్చర్యమునుగొల్పువహ్ని పుట్టెను; హిమవన్నగమునగర్గి నీరు వరద గంభీరముగ మారిప్రక్క పట్టణంబు బరగముంచె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విశ్వసించ లేని విషయమడిగినంత పిల్లవాడు నుడివె వింత గాను ,ఏమి చెప్పె ? దాని నెరిగించుమన , నది"వహ్ని పుట్టెను హిమవన్నగమున
ఆటవెలదిదక్షయజ్ఞమందు దాక్షాయణి రగిలిగుండమందు దూకి కూలి నంతవీడి శూలి కొప్పు వీరభద్రుడు పుట్టవహ్ని పుట్టెను హిమవన్నగమున!
ఉత్పలమాల ఆహ్నములందు వేడికిక నంతము లేదను రీతి వర్షపున్ జిహ్నమె లేదులేదనఁగ చింతరగుల్చగ నేసి ఫ్రిడ్జి మ ధ్యాహ్నము,రాత్రులన్జెలఁగ నార్తికి, పర్యవసానమన్నటుల్ వహ్నిని మంచు పుట్టె! హిమవన్నగమందున రేగె జ్వాలలున్!(ఏసీ మరియు ఫ్రిడ్జులవల్ల వహ్నిని మంచుపుట్టెనని, వాటి వాడకమెక్కువై హీట్ వేవ్ వల్ల హిమాలయాల్లో సైతము జ్వాలలు రేగినవను భావము.)
విరి శరమ్ము వేయ వెడవింటిబలుదంట చిడుముడిపడి శివుడు చిచ్చు కన్ను నాగ్రహమున తెరిచె నా వేళలో గాంచగా వహ్ని పుట్టెను హిమవన్నగమున.జాహ్నవి యాలకించు మిది శత్రువు లంపగ తీవ్ర వాదులే జాహ్నవి పర్వులెత్తు మన శాంతిని గోరు ధరిత్రి జొచ్చి మ ధ్యాహ్నమె హిందు జాతిపయి దాడిని సేయగ కాశ్మిరమ్ములో వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్.
పూలబాణహతికి పురహరుడుగ్రుడైవహ్ని పుట్టెను హిమవన్నగమునభస్మమైన మరునిపై కృప హేమమైపుట్టె శివుని మదిని కట్టకడకునిహ్నవమేల మన్మథుడు నిక్కముగా సుమబాణమేయఁ సాయాహ్నపు వేళ నీలగళు డాతని భస్మమొనర్చె నుగ్రుడైచిహ్నము వార్భటమ్మయిన జీవునిపై కృప ముందువెన్కలైవహ్నిని మంచు పుట్టె, హిమవన్నగమందున రేగె జ్వాలలున్[హేమము = మంచు; నిహ్నవము = గోపనము;సాయాహ్నము = సాయంకాలముచిహ్నము = ధ్వజము]శివుని కంటిమంటలతో హిమవన్నగమందున జ్వాలలు రేగుట,చివరకాతని మదిలో కృపాతుషారముదయించుట రెండును సంభవించినవి ముందు వెన్కగా అనే భావనతో........
కుసుమ శరము దగుల కుపితు డైన శివుని కంటి నుండి వెడలు మంట వలన వహ్ని పుట్టెను హిమ వన్నగ మున గద మరుడు గాలి పోయి మసిగ మారె
ఆ.వె: భారతమునకు హిమపర్వతమ్ములె కోటయనెడు నమ్మకమ్మె యడలు రీతిసమరశంఖ మూదె చైనా కదా! యుద్ధవహ్ని పుట్టెను హిమవన్నగమున”
జాహ్నవి గంటివా భువిని శాంతియె డీలగుచుండె నాశపుంజిహ్నముగా కనంబడె విచిత్రము లెన్నియొ భూతలంబునందాహ్నమునందు పాదుకొనె నంధము మబ్బులు కమ్మినట్లుగన్వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్
ఆ॥ మదనుని శరము తన యెదనుఁ దాకఁగఁ గోపమందు శివుఁని కంట నగ్ని వెలయుసమయమునుఁ దలఁచుచు సర్వులు పలికిరివహ్ని పుట్టెను హిమవన్నగమునఉ॥ ఈ హ్నిని ప్రాసగా నొసఁగ నేమని వ్రాయుదుఁ దోఁచె నింతియే! వహ్ని రసాయనమ్ములను వండఁగ మార్చు ఘనీభవించఁగన్ వహ్నియె పుట్టెనట్లు హిమవన్నగమందుఁ ద్రినేత్రుఁడల్గఁగన్వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్Thermosetting polymers అధిక ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తాయండి. మంచు కూడ నీరు ఘనీభవించిన వస్తుందనే సామ్యముతోమరొక పూరణ అండి(ఆహ్నము జిహ్నము సుబ్బారావు పూరణనుండి కైకొని అర్థము గ్రహించిన తరువాత)ఉ॥ ఆహ్నము సాగి భారతము నంతట నేసియఁ జేరి తాకఁగన్వహ్నిని మంచు పుట్టె హిమవన్నగ మేర్పడ, ధ్యాన భంగమున్జిహ్నమటంచు నీశుఁడటు శీఘ్రము మారుని కాల్చ జ్వాలలన్ వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్(భారతము భారత దేశము, అంటార్కిటికా ప్రాంతము నుండి పదుల లక్షలకొలది సం॥ ప్రయాణించి ఏసియ ను తాకినపుడు హిమాలయములేర్పడిన స్థితి అండి)
ఆర్యా! ఆంధ్ర భారతి నిఘంటువులో “హ్నము” వ్రాసి Match లో Suffix ఎన్ని వెదకండి. హ్న తోఁ గూడిన పదములు వచ్చును. అట్లే కావలసిన వన్నియును.
మీనకేతనుండు మానక చెలరేఁగ దోష మెన్న కెడఁద, రోష మూని మూరి విప్పి నంత ముక్కంటి తన కన్నువహ్ని పుట్టెను హిమవన్నగమున జిహ్నపు మాట విన్నఁ గడు చిత్రము కన్పడ కుండు నేమొ సాయాహ్నము తోడఁ బట్టపగ లక్కట వింతగ దేనిఁ దెల్పు నీ చిహ్నము ముజ్జగమ్ములను జెచ్చెర నా ప్రళయమ్ము క్రమ్మునో వహ్నిని మంచు పుట్టె హిమవన్నగ మందున రేఁగె జ్వాలలున్
అగ్నిపర్వతమున నాశ్చర్యమునుగొల్పు
రిప్లయితొలగించండివహ్ని పుట్టెను; హిమవన్నగమున
గర్గి నీరు వరద గంభీరముగ మారి
ప్రక్క పట్టణంబు బరగముంచె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిశ్వసించ లేని విషయమడిగినంత
రిప్లయితొలగించండిపిల్లవాడు నుడివె వింత గాను ,
ఏమి చెప్పె ? దాని నెరిగించుమన , నది
"వహ్ని పుట్టెను హిమవన్నగమున
ఆటవెలది
రిప్లయితొలగించండిదక్షయజ్ఞమందు దాక్షాయణి రగిలి
గుండమందు దూకి కూలి నంత
వీడి శూలి కొప్పు వీరభద్రుడు పుట్ట
వహ్ని పుట్టెను హిమవన్నగమున!
ఉత్పలమాల
తొలగించండిఆహ్నములందు వేడికిక నంతము లేదను రీతి వర్షపున్
జిహ్నమె లేదులేదనఁగ చింతరగుల్చగ నేసి ఫ్రిడ్జి మ
ధ్యాహ్నము,రాత్రులన్జెలఁగ నార్తికి, పర్యవసానమన్నటుల్
వహ్నిని మంచు పుట్టె! హిమవన్నగమందున రేగె జ్వాలలున్!
(ఏసీ మరియు ఫ్రిడ్జులవల్ల వహ్నిని మంచుపుట్టెనని, వాటి వాడకమెక్కువై హీట్ వేవ్ వల్ల హిమాలయాల్లో సైతము జ్వాలలు రేగినవను భావము.)
రిప్లయితొలగించండివిరి శరమ్ము వేయ వెడవింటిబలుదంట
చిడుముడిపడి శివుడు చిచ్చు కన్ను
నాగ్రహమున తెరిచె నా వేళలో గాంచగా
వహ్ని పుట్టెను హిమవన్నగమున.
జాహ్నవి యాలకించు మిది శత్రువు లంపగ తీవ్ర వాదులే
జాహ్నవి పర్వులెత్తు మన శాంతిని గోరు ధరిత్రి జొచ్చి మ
ధ్యాహ్నమె హిందు జాతిపయి దాడిని సేయగ కాశ్మిరమ్ములో
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్.
పూలబాణహతికి పురహరుడుగ్రుడై
రిప్లయితొలగించండివహ్ని పుట్టెను హిమవన్నగమున
భస్మమైన మరునిపై కృప హేమమై
పుట్టె శివుని మదిని కట్టకడకు
నిహ్నవమేల మన్మథుడు నిక్కముగా సుమబాణమేయఁ సా
యాహ్నపు వేళ నీలగళు డాతని భస్మమొనర్చె నుగ్రుడై
చిహ్నము వార్భటమ్మయిన జీవునిపై కృప ముందువెన్కలై
వహ్నిని మంచు పుట్టె, హిమవన్నగమందున రేగె జ్వాలలున్
[హేమము = మంచు; నిహ్నవము = గోపనము;
సాయాహ్నము = సాయంకాలముచిహ్నము = ధ్వజము]
శివుని కంటిమంటలతో హిమవన్నగమందున జ్వాలలు రేగుట,
చివరకాతని మదిలో కృపాతుషారముదయించుట రెండును
సంభవించినవి ముందు వెన్కగా అనే భావనతో........
కుసుమ శరము దగుల కుపితు డైన శివుని
రిప్లయితొలగించండికంటి నుండి వెడలు మంట వలన
వహ్ని పుట్టెను హిమ వన్నగ మున గద
మరుడు గాలి పోయి మసిగ మారె
ఆ.వె: భారతమునకు హిమపర్వతమ్ములె కోట
రిప్లయితొలగించండియనెడు నమ్మకమ్మె యడలు రీతి
సమరశంఖ మూదె చైనా కదా! యుద్ధ
వహ్ని పుట్టెను హిమవన్నగమున”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాహ్నవి గంటివా భువిని శాంతియె డీలగుచుండె నాశపుం
రిప్లయితొలగించండిజిహ్నముగా కనంబడె విచిత్రము లెన్నియొ భూతలంబునం
దాహ్నమునందు పాదుకొనె నంధము మబ్బులు కమ్మినట్లుగన్
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్
ఆ॥ మదనుని శరము తన యెదనుఁ దాకఁగఁ గోప
రిప్లయితొలగించండిమందు శివుఁని కంట నగ్ని వెలయు
సమయమునుఁ దలఁచుచు సర్వులు పలికిరి
వహ్ని పుట్టెను హిమవన్నగమున
ఉ॥ ఈ హ్నిని ప్రాసగా నొసఁగ నేమని వ్రాయుదుఁ దోఁచె నింతియే!
వహ్ని రసాయనమ్ములను వండఁగ మార్చు ఘనీభవించఁగన్
వహ్నియె పుట్టెనట్లు హిమవన్నగమందుఁ ద్రినేత్రుఁడల్గఁగన్
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్
Thermosetting polymers అధిక ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తాయండి. మంచు కూడ నీరు ఘనీభవించిన వస్తుందనే సామ్యముతో
మరొక పూరణ అండి
(ఆహ్నము జిహ్నము సుబ్బారావు పూరణనుండి కైకొని అర్థము గ్రహించిన తరువాత)
ఉ॥ ఆహ్నము సాగి భారతము నంతట నేసియఁ జేరి తాకఁగన్
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగ మేర్పడ, ధ్యాన భంగమున్
జిహ్నమటంచు నీశుఁడటు శీఘ్రము మారుని కాల్చ జ్వాలలన్
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగమందున రేగె జ్వాలలున్
(భారతము భారత దేశము, అంటార్కిటికా ప్రాంతము నుండి పదుల లక్షలకొలది సం॥ ప్రయాణించి ఏసియ ను తాకినపుడు హిమాలయములేర్పడిన స్థితి అండి)
ఆర్యా! ఆంధ్ర భారతి నిఘంటువులో “హ్నము” వ్రాసి Match లో Suffix ఎన్ని వెదకండి. హ్న తోఁ గూడిన పదములు వచ్చును. అట్లే కావలసిన వన్నియును.
తొలగించండిమీనకేతనుండు మానక చెలరేఁగ
రిప్లయితొలగించండిదోష మెన్న కెడఁద, రోష మూని
మూరి విప్పి నంత ముక్కంటి తన కన్ను
వహ్ని పుట్టెను హిమవన్నగమున
జిహ్నపు మాట విన్నఁ గడు చిత్రము కన్పడ కుండు నేమొ సా
యాహ్నము తోడఁ బట్టపగ లక్కట వింతగ దేనిఁ దెల్పు నీ
చిహ్నము ముజ్జగమ్ములను జెచ్చెర నా ప్రళయమ్ము క్రమ్మునో
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగ మందున రేఁగె జ్వాలలున్