12, సెప్టెంబర్ 2026, శనివారం

సమస్య - 5588

 13-9-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్”

(లేదా...)

“ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో..)

2 కామెంట్‌లు:

  1. అదిరి పడకు సహజముగనె
    ముదిమినిఁ గనుమూతలు వడె ; భూతాత్మునకున్
    ముదిమి నెలకొపదు గావున
    జదువుల పడతి దరిజేరి సరసములాడున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    పదఁపడి బ్రళయము పొడమగ
    సదమలమగు సృష్టి నెల్ల చాలించు గతిన్
    కదనము ముగిసిన గతి, నా
    ముదిమినిఁ గనుమూతలు వడె భూతాత్మునకున్.

    చంపకమాల
    పొదలిన కల్పకాలమును బూర్తిగ ముంచి లయంబు జేయఁగన్,
    పదఁపడి నిత్య కృత్యమగు బాధ్యత సృష్టిని నుజ్జగించి, తా
    నిది సమయంబు విశ్రమము నించుకఁ బొందఁగ నంచు నెంచుచున్,
    ముదిమి వయస్సులో కనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్.

    రిప్లయితొలగించండి