కం:విధవ నన నేల ! భాగీ రథి వీవుగ! పెండ్లి జూడ రమ్మా! అక్కా! వ్యథ నిడు పదమే నేడును విధవా ? నిన్గొల్వ నొద వభీష్టములెల్లన్” (విధవ అనే పదం నేడు కూడా వ్యథ పెట్టే పదమా? నువ్వు భాగీరథివి. పెండ్లికి రా అని తమ్ముడు అక్కలి పిలిచాడు.)
మ.వి:విధవన్ నాయకు రాలిగా బడసియున్ ద్వేషమ్ము లో లోపలన్ వ్యథలన్ వెట్టగ నేత యిట్లనియె " నీ దైపోయె రాజ్యమ్ము, నా యధికారమ్మును నిల్ప గోర నిక నీ యంఘ్రిన్ సదా బట్టెదన్ విధవా ! నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్”
(వితంతువు నాయకురా లైంది. ఆమె పట్ల ఈ నాయకుడికి లోలోపల ద్వేషమే ఉంది కానీ "రాజ్యం నీదై పోయింది కాబట్టి నీ కాళ్లు పట్టుకుంటే నా పదవి నిలుస్తుంది అని బాధ పడినట్లు. )
రిప్లయితొలగించండిఅధి జిహ్వమె భూషణమై
విధువును తలపైన దాల్చు విశ్వేశ్వరుడా
విధుడని పిలిచె మహాదే
వి ధవా నిన్గొల్వ నొద వభీష్టములెల్లన్.
అధిదేవుండవు చేతనుండవయినన్ హంసుండ వీవే కదా
వ్యధలన్ బాపెడి వాడవంచు కడు విశ్వాసమ్ము తో నిత్యమున్
మధురంబొప్పగ నీదు నామమును సమ్మానించి కీర్తించి, యు
ర్వి ధవా నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్.
ఉదయమున నేను లేచిన
రిప్లయితొలగించండిమొదలుగ గన్నుల నుమోడ్చి ముదముగ నిన్నే
మదినితలంచెద శ్రీదే
వి ధవా ! నిన్గొల్వ నొద వభీష్టములెల్లన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిధులే ప్రధానమను స
రిప్లయితొలగించండిత్పథమే మాది రహితోడ భగవానుని స
న్నిధిఁ సలుపు సేవయే సం
విధ వానిన్గొల్వ నొద వభీష్టములెల్లన్
విధులే మాకనురక్తమంచుఁ దమితో వెంకన్ననే గొల్చు స
త్పథమే మాదని విశ్వసించి నిరతంబా స్వామి శుశ్రూష పె
న్నిధిగా నెంచుచు నున్న మాకు సతమున్ నిస్వార్థ సంసేవ సం
విధ వానిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్
[సంవిధ = జీవనాధారము]
మ॥ విధియే దూరముఁ జేయ భర్తనటు నిర్వేదమ్ము నేపారఁగన్
రిప్లయితొలగించండివిధమున్ గాంచుచు నాశ్రయమ్ముఁ దను స్థాపించంగ సేవార్థమై
నిధియై యొప్పుచుఁ బేదసాదలకిలన్ నెమ్మిన్ గనన్ బల్కిరే
విధవా నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱిడిన్
విధవలు కాకపోయినా ఇలాంటి వారున్నారండి జిల్లెళ్ళమూడి అమ్మ మదర్ థెరేసా మాతా అమృతానందమయి ఇలాగ విధవకన్వయం అంతేనండి.
కం:విధవ నన నేల ! భాగీ
రిప్లయితొలగించండిరథి వీవుగ! పెండ్లి జూడ రమ్మా! అక్కా!
వ్యథ నిడు పదమే నేడును
విధవా ? నిన్గొల్వ నొద వభీష్టములెల్లన్”
(విధవ అనే పదం నేడు కూడా వ్యథ పెట్టే పదమా? నువ్వు భాగీరథివి. పెండ్లికి రా అని తమ్ముడు అక్కలి పిలిచాడు.)
మ.వి:విధవన్ నాయకు రాలిగా బడసియున్ ద్వేషమ్ము లో లోపలన్
రిప్లయితొలగించండివ్యథలన్ వెట్టగ నేత యిట్లనియె " నీ దైపోయె రాజ్యమ్ము, నా
యధికారమ్మును నిల్ప గోర నిక నీ యంఘ్రిన్ సదా బట్టెదన్
విధవా ! నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్”
(వితంతువు నాయకురా లైంది. ఆమె పట్ల ఈ నాయకుడికి లోలోపల ద్వేషమే ఉంది కానీ "రాజ్యం నీదై పోయింది కాబట్టి నీ కాళ్లు పట్టుకుంటే నా పదవి నిలుస్తుంది అని బాధ పడినట్లు. )
బుధు లెవ్వరు మెచ్చనవి వి
రిప్లయితొలగించండివిధాంక్షలను నొచ్చు చుండె విశ్వం బెల్లన్
స ధన వ రాగ్రావని భా
వి ధవా నిన్గొల్వ నొద వభీష్టము లెల్లన్
బుధ వర్గార్చిత పాద పద్మ యుగ! శంభూ! శంకరా! భక్త లో
క ధవా! సాంబశివా! త్రినేత్ర! విషభృత్కంఠా! లసద్భక్తి నే
విధ మర్చించినఁ దృప్తి సెందెదవు పృథ్విన్ శాంభవీ పుణ్య దే
వి ధవా! నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అధికమగు దీక్ష తోడను
విధిగా పూజింత్రు నిన్ను విశ్వపతి సతిన్
సుధలు చిందు నుమాదే
వి, ధవా!నిన్గొల్వ నొద వభీష్టములెల్లన్.