16-9-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ"
(లేదా)
“చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే”
(నారుమంచి అనంతకృష్ణ గారికి, ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)
ఉత్పలమాల అంబువు చుక్కయున్ బరుల కందఁగ మానసమొప్పఁబోదు వారంబులసాకుఁ జెప్పుచును రాల్చడు పైసయు పేదవారికిన్ జంబపు మాటలొల్కుచును జార్చునె లోభియె? గడ్డ నెయ్యిదౌచెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే!
తేటగీతికరపుటెంగిలి రాల్చడు కాకికైనపైస పేదకిడఁగనైన వారమెంచురీతి లోభిదిటుల! గడ్డనేతిఁగలుగబొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ!
కంబ రచించినట్టిదగు కావ్యమునే పఠియించుచుండగాచెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదేతుంబుర తెల్పుమంచు నొక తొయ్యలి ప్రశ్నము వైచినంతటన్జెంబున నీరులే దనుచు చిన్నదొకర్తె జవాబు చెప్పెలే
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడచిక్కుముడిని విప్పమనుచుఁ జిన్నదడుగచుక్కయిన నుదకములేదు చూడమనుచుటక్కున జవాబు దయసేసెనొక్కడచట
బిచ్ఛమెత్తగ వచ్చిన పిచ్చదయిన ధనమునంతయు దానిలో దాచియుంచి చిరమయిన కారణంబున చిన్న దైన బొక్కవడెఁ , జెంబు గారదు చుక్కకూడ
గడ్డ కట్టిన ఖజపము గలిగి నట్టి పాత్ర యది చంద్రముఖి పొర పాటు వలన నేల పడి పోయె నా వెండి నెయ్యి పాత్ర బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ.అంబను గొల్వ స్వచ్చమగు హౌమ్యము కావలె నంచు శ్రద్ధ తో నంబ నిశావసానమున హౌమ్యము గాచి ద్రవమ్ము నంతటన్ చెంబున పోసి యుంచ నది శీతక మందు ఘనీభ వించుచున్ చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే.
తే.గీ:ఘృతము జెంబున నుంచితే మతియె లేకచిల్లి చెంబది యంచు నే చింతిలంగపిల్ల యిట్లనె "నే యెల్ల పేరుకొనెనుబొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ"
ఉ:సంబర మందునన్ బెరుగు జక్కగ వేయగ గొంటి "హెచ్చు నీరంబును గల్పితే?" యన బిరమ్మున నా యమ యా పెరుంగునే చెంబున బోసి యెంతయును జెప్పెను నమ్మక మెంతొ కల్గగాచెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే”(పెరుగు కొంటూ "నీళ్లు బాగా కలిపావా?" అని అడిగితే ఆమె నమ్మకం కలగటానికి చిల్లి చెంబులో పోసి చూపించింది.ఒక్క చుక్క కూడా కార లేదు.)
ఉ॥ అంబకు మ్రొక్కి సర్వులకు నాదర మొప్ప నమస్కరించుచున్కంబళిఁ గప్పి చూపఁ గనికట్టునుఁ ద్రిప్పుచు మంత్రదండమున్డంబము లింద్రజాలికుఁడు టక్కున పల్కుచు నీరు నింపఁగన్జెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే!(సామాన్యంగా ఇంద్రజాలికులు చూపే విద్య)ఉ॥ అంబకు మ్రొక్కి సర్వులకు నాదర మొప్ప
అంబ మహత్వ మం చనకు మయ్య మహత్వము కాదు నిక్క మెల్లం బరికింపఁగా నెదఁ గరమ్మును నచ్చెరు వొంద నేలయా యంబువు లందు నున్నఁ గద యత్తఱిఁ గారుట కింత యేనియుం జెంబుకుఁ జిల్లు వడ్డ దఁట చిత్రముగా నొక చుక్క కారదే పంక్తిఁ గూర్చుండ నెల్లరు యుక్త రీతిఁ గాంచె నొక్కఁడు తనచెంబు నుంచ నచట రోఁత సెలరేఁగ నెదలోన మూఁత కింత బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ
అంబరమునందు బసరించె నంబుదములుసంబరములను జరిపిరి సకల జనులువిధిబలీయము చుక్కైన వృష్టి బడదుబొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ
అంబరమంటె సంబరములా దివసమ్మున నెన్నినాళ్ళకోఅంబుధరమ్ము క్రమ్ముకొనె నాకసమందున నాశ రేపుచున్సంబరమెల్ల రూపడఁగె జల్లయినన్ గనరాక నక్కటాచెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.బొక్క వడెఁ జెంబు గారదు చుక్క కూడయనుచు పొడుపు కథను వేయ నన్న యొక్కడది విని జవాబు నిడె చెల్లి "యందులోనరంధ్రము వరకు లేవు జలమ్ము గనుక".
రిప్లయితొలగించండిఉత్పలమాల
అంబువు చుక్కయున్ బరుల కందఁగ మానసమొప్పఁబోదు వా
రంబులసాకుఁ జెప్పుచును రాల్చడు పైసయు పేదవారికిన్
జంబపు మాటలొల్కుచును జార్చునె లోభియె? గడ్డ నెయ్యిదౌ
చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే!
తేటగీతి
తొలగించండికరపుటెంగిలి రాల్చడు కాకికైన
పైస పేదకిడఁగనైన వారమెంచు
రీతి లోభిదిటుల! గడ్డనేతిఁగలుగ
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ!
కంబ రచించినట్టిదగు కావ్యమునే పఠియించుచుండగా
రిప్లయితొలగించండిచెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే
తుంబుర తెల్పుమంచు నొక తొయ్యలి ప్రశ్నము వైచినంతటన్
జెంబున నీరులే దనుచు చిన్నదొకర్తె జవాబు చెప్పెలే
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ
తొలగించండిచిక్కుముడిని విప్పమనుచుఁ జిన్నదడుగ
చుక్కయిన నుదకములేదు చూడమనుచు
టక్కున జవాబు దయసేసెనొక్కడచట
బిచ్ఛమెత్తగ వచ్చిన పిచ్చదయిన
రిప్లయితొలగించండిధనమునంతయు దానిలో దాచియుంచి
చిరమయిన కారణంబున చిన్న దైన
బొక్కవడెఁ , జెంబు గారదు చుక్కకూడ
రిప్లయితొలగించండిగడ్డ కట్టిన ఖజపము గలిగి నట్టి
పాత్ర యది చంద్రముఖి పొర పాటు వలన
నేల పడి పోయె నా వెండి నెయ్యి పాత్ర
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ.
అంబను గొల్వ స్వచ్చమగు హౌమ్యము కావలె నంచు శ్రద్ధ తో
నంబ నిశావసానమున హౌమ్యము గాచి ద్రవమ్ము నంతటన్
చెంబున పోసి యుంచ నది శీతక మందు ఘనీభ వించుచున్
చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే.
తే.గీ:ఘృతము జెంబున నుంచితే మతియె లేక
రిప్లయితొలగించండిచిల్లి చెంబది యంచు నే చింతిలంగ
పిల్ల యిట్లనె "నే యెల్ల పేరుకొనెను
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ"
ఉ:సంబర మందునన్ బెరుగు జక్కగ వేయగ గొంటి "హెచ్చు నీ
రిప్లయితొలగించండిరంబును గల్పితే?" యన బిరమ్మున నా యమ యా పెరుంగునే
చెంబున బోసి యెంతయును జెప్పెను నమ్మక మెంతొ కల్గగా
చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే”
(పెరుగు కొంటూ "నీళ్లు బాగా కలిపావా?" అని అడిగితే ఆమె నమ్మకం కలగటానికి చిల్లి చెంబులో పోసి చూపించింది.ఒక్క చుక్క కూడా కార లేదు.)
ఉ॥ అంబకు మ్రొక్కి సర్వులకు నాదర మొప్ప నమస్కరించుచున్
రిప్లయితొలగించండికంబళిఁ గప్పి చూపఁ గనికట్టునుఁ ద్రిప్పుచు మంత్రదండమున్
డంబము లింద్రజాలికుఁడు టక్కున పల్కుచు నీరు నింపఁగన్
జెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే!
(సామాన్యంగా ఇంద్రజాలికులు చూపే విద్య)ఉ॥ అంబకు మ్రొక్కి సర్వులకు నాదర మొప్ప
అంబ మహత్వ మం చనకు మయ్య మహత్వము కాదు నిక్క మె
రిప్లయితొలగించండిల్లం బరికింపఁగా నెదఁ గరమ్మును నచ్చెరు వొంద నేలయా
యంబువు లందు నున్నఁ గద యత్తఱిఁ గారుట కింత యేనియుం
జెంబుకుఁ జిల్లు వడ్డ దఁట చిత్రముగా నొక చుక్క కారదే
పంక్తిఁ గూర్చుండ నెల్లరు యుక్త రీతిఁ
గాంచె నొక్కఁడు తనచెంబు నుంచ నచట
రోఁత సెలరేఁగ నెదలోన మూఁత కింత
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ
అంబరమునందు బసరించె నంబుదములు
రిప్లయితొలగించండిసంబరములను జరిపిరి సకల జనులు
విధిబలీయము చుక్కైన వృష్టి బడదు
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ
అంబరమంటె సంబరములా దివసమ్మున నెన్నినాళ్ళకో
రిప్లయితొలగించండిఅంబుధరమ్ము క్రమ్ముకొనె నాకసమందున నాశ రేపుచున్
సంబరమెల్ల రూపడఁగె జల్లయినన్ గనరాక నక్కటా
చెంబుకుఁ జిల్లు వడ్డదఁట చిత్రముగా నొక చుక్క కారదే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బొక్క వడెఁ జెంబు గారదు చుక్క కూడ
యనుచు పొడుపు కథను వేయ నన్న యొక్క
డది విని జవాబు నిడె చెల్లి "యందులోన
రంధ్రము వరకు లేవు జలమ్ము గనుక".