17-9-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్”
(లేదా...)
“జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”
(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
చిత్తము దలచిన విధముగ నిత్తెము గొలువున పనులను నెరపుట యందున్ సత్తువ జూపుచు నుండెడి జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
విత్తము నెగజల్లి పరి స్రుత్తును ద్రావించి గెలుచు శుంఠలె గద క్ష్మా భృత్తులుగా వెలిగెడి యా జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్.కుత్తుక లుత్తరించగల క్రూర మనస్కులు దుష్ట బుద్ధితో విత్తము బంచి ఎన్నికల వేళ పరిస్రుత తో జనాళి నే మత్తున ముంచి గెల్చి యిల మానవ దేవులు గా వెలుం గెడిన్ జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ.
చిత్తము దోచిన వారలకుత్తమ మైన పదవులని కుమతుల్ సతమున్దొత్తుల కిచ్చుచునుండగజిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్చిత్తము చిత్తమంచు తమచిత్తము గెల్చిన జంబుకాలకేయుత్తమ మైన పట్టమిడు వ్యూహము నేర్చిరి నేత లెల్లరున్దొత్తుల వోలె మారి మరి తొందరగా మది దోచువారలౌజిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ
ఉ:విత్తనముల్ గొనంగ ధర పెచ్చగు సంకర విత్తనమ్ముకేచెత్త కవిత్వమే వెలుగు చెప్పెడు వా డొక ముఖ్యు డైనచోవిత్తము గల్గు నా చవట వేయు చమత్కృతి నవ్వ జేసెడిన్జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”(పనికి రాని వాటికి విలువ యెక్కువ అనటానికి ఇన్ని ఉదాహరణలు. మూడవ పాదం- ఎ రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేజ్ ఫన్నీ. )
చిత్తము దలచిన విధముగ
రిప్లయితొలగించండినిత్తెము గొలువున పనులను నెరపుట యందున్
సత్తువ జూపుచు నుండెడి
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
రిప్లయితొలగించండివిత్తము నెగజల్లి పరి
స్రుత్తును ద్రావించి గెలుచు శుంఠలె గద క్ష్మా
భృత్తులుగా వెలిగెడి యా
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్.
కుత్తుక లుత్తరించగల క్రూర మనస్కులు దుష్ట బుద్ధితో
విత్తము బంచి ఎన్నికల వేళ పరిస్రుత తో జనాళి నే
మత్తున ముంచి గెల్చి యిల మానవ దేవులు గా వెలుం గెడిన్
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ.
చిత్తము దోచిన వారల
రిప్లయితొలగించండికుత్తమ మైన పదవులని కుమతుల్ సతమున్
దొత్తుల కిచ్చుచునుండగ
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
చిత్తము చిత్తమంచు తమచిత్తము గెల్చిన జంబుకాలకే
యుత్తమ మైన పట్టమిడు వ్యూహము నేర్చిరి నేత లెల్లరున్
దొత్తుల వోలె మారి మరి తొందరగా మది దోచువారలౌ
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ
ఉ:విత్తనముల్ గొనంగ ధర పెచ్చగు సంకర విత్తనమ్ముకే
రిప్లయితొలగించండిచెత్త కవిత్వమే వెలుగు చెప్పెడు వా డొక ముఖ్యు డైనచో
విత్తము గల్గు నా చవట వేయు చమత్కృతి నవ్వ జేసెడిన్
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”
(పనికి రాని వాటికి విలువ యెక్కువ అనటానికి ఇన్ని ఉదాహరణలు. మూడవ పాదం- ఎ రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేజ్ ఫన్నీ. )