25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5601

26-9-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వచ్చె లగ్నము వరుఁ దన్నవలయు నిపుడు”

(లేదా...)

“లగ్నం బిప్పుడు ప్రాప్తమయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో నమిలికొండ విజయభాస్కర్ గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. ముదిత జననీ జనకులను మోసగించి
    గతముననె యొక పడతుక గాదిలి యయి
    యుండ , పీటపై కూర్చొని యుండె మరల ,
    వచ్చె లగ్నము వరుఁ దన్నవలయు నిపుడు

    రిప్లయితొలగించండి
  2. -
    భగ్నంబాయె జిలేబి ప్రేమ ప్రియుడే పట్టంగ వేరొక్కరిన్
    లగ్నం బిప్పుడు ప్రాప్తమయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్


    రిప్లయితొలగించండి
  3. కృష్ణుని గురించి యశోదకు చెప్తూ గోపికలు..


    శా.భగ్నంబాయను వెన్న కుండలు దధిన్ ప్రాప్తంబు కానీక ని
    ర్మగ్నుండైయ్యను చోర బుద్ధి గొనుచున్ మా యిండ్లలో వహ్వరే!
    నగ్నంబీనిజమెల్లవారలకు! కంజాక్షీ భవత్సూనుకున్
    లగ్నం బిప్పుడు ప్రాప్తమయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్

    రిప్లయితొలగించండి

  4. పెండ్లి చేసుకున్న సతుల వేశ్య గృహము
    లందు నమ్మువాడిట వరుడంచు నెఱగి
    స్నేహితులతో పలికెన ప్డు చేర గాను
    వచ్చె లగ్నము వరుఁ దన్నవలయు నిపుడు.


    భగ్నంబొక్కటె దిక్కు కన్నియను కాపాడంగ లేకున్నచో
    మగ్నంబౌ గద యామె జీవితము, దుర్మార్గుండెయౌ వానినిన్
    లగ్నంబాడిన, సాక్ష్యముల్ గలవిటన్ రండో స్వకుండ్రిచ్చటన్
    లగ్నం బిప్పుడు ప్రాప్తమయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్.

    రిప్లయితొలగించండి
  5. [ వరుడు మోసకాడైన నిత్య పెళ్ళికొడుకని
    పెండ్లి పందిరిలో తెలిసిన సందర్భము ]

    మంచి లగ్నమనుచు నిశ్చయించి నారు
    వరుడు పెండ్లైన శఠుడని వగచుచుండ
    పెండ్లి కొచ్చిన వారలు పెక్కురనిరి
    వచ్చె లగ్నము వరుఁ దన్న వలయు నిపుడు

    లగ్నారూఢము నెంచి చూచి సరియౌ లగ్నంబు నిష్టించినన్
    భగ్నంబయ్యెఁ దనూజ పెండ్లి వరుడే వంచించి నాడంచు ను
    ద్విగ్నంబైన మనస్సుతో తెలుపగా వేదాంతులే పల్కిరే
    లగ్నం బిప్పుడు ప్రాప్తమయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్

    రిప్లయితొలగించండి
  6. అయినవారమర్చిన వివాహమ్ము కాదు
    ప్రేమకళ్యాణమా కాదు పేర్మిలేదు
    పెచ్చుమీరె వీసాలకై పెళ్లి నేడు
    వచ్చె లగ్నము వరుఁ దన్నవలయు నిపుడు

    రిప్లయితొలగించండి