18-10-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్షీరాబ్ధిసుత మనువాడె శివుని ముదముతో”
(లేదా...)
“క్షీరాంభోధితనూజ శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”
(న.చ. సాహిత్ శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)
నారాయణుని కళత్రము క్షీరాబ్ధిసుత ; మనువాడె శివుని ముదముతోమేరువు దౌహిత్రి గిరిజ ,దేవుల దేవేరుల కథ తెలియగ మేలౌ
కందంగౌరీదేవి వినతితోఁదీరియుఁ గుడిచి గరళము, దివ్య భవమునన్సారించి చూప హరినిన్క్షీరాబ్ధిసుత మనువాడె! శివుని ముదముతోశార్దూలవిక్రీడితము గౌరీదేవి విషమ్ము గ్రోలమనగన్ గల్లోలమున్ బాపఁగన్ధారాళంబుగ గ్రోలి నీలగళుడై, ద్రచ్చన్ సుధన్ బొందగన్బారావార భవానఁ జూప 'హరినిన్' భాగ్యంబుగానొప్పుచున్క్షీరాంభోధితనూజ శంకరునిఁ, 'దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్!'
నారాయణుని కళత్రము
రిప్లయితొలగించండిక్షీరాబ్ధిసుత ; మనువాడె శివుని ముదముతో
మేరువు దౌహిత్రి గిరిజ ,
దేవుల దేవేరుల కథ తెలియగ మేలౌ
కందం
రిప్లయితొలగించండిగౌరీదేవి వినతితోఁ
దీరియుఁ గుడిచి గరళము, దివ్య భవమునన్
సారించి చూప హరినిన్
క్షీరాబ్ధిసుత మనువాడె! శివుని ముదముతో
శార్దూలవిక్రీడితము
గౌరీదేవి విషమ్ము గ్రోలమనగన్ గల్లోలమున్ బాపఁగన్
ధారాళంబుగ గ్రోలి నీలగళుడై, ద్రచ్చన్ సుధన్ బొందగన్
బారావార భవానఁ జూప 'హరినిన్' భాగ్యంబుగానొప్పుచున్
క్షీరాంభోధితనూజ శంకరునిఁ, 'దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్!'