18, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5624

19-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు”

(లేదా...)

“పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా”

(న.చ. సాహిత్ శతావధానంలో హట్టి భానుమతి గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగని
    పుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచి
    మాంస నైవేద్యమందించి మైమఱపున
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!

    మత్తకోకిల
    నైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగా
    సాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై
    రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతో
    పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!

    రిప్లయితొలగించండి
  2. పరమమును తనపయి దయ పరచమనుచు
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ;
    అటులనె పురజనుల కోర్కెలలవరించ
    బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు

    రిప్లయితొలగించండి