2, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5322

3-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”
(లేదా...)
“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”

1, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5321

2-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”
(లేదా...)
“మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”

30, నవంబర్ 2025, ఆదివారం

సమస్య - 5320

1-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును”
(లేదా...)
“కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా”
(ధ్రువకోకిల/తరళ - నభరసజజగ - యతి 12)

29, నవంబర్ 2025, శనివారం

సమస్య - 5319

30-11-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువకంటికిఁ గాటుక గరళమయ్యె”
(లేదా...)
“కాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా”
(ఆకాశవాణి సమస్య)

28, నవంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5318

29-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదిరఁ గొన్నయెడల ముదిమి రాదు”
(లేదా...)
“ప్రీతిన్ నిత్యము మద్యమున్ గొనినచో వృద్ధాప్యమే రాదు పో”

27, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5317

28-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వగృహము లేనట్టివాఁడె భద్రతఁ గాంచున్”
(లేదా...)
“స్వగృహము లేనివాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్”

26, నవంబర్ 2025, బుధవారం

సమస్య - 5316

27-11-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్”
(లేదా...)
“పాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్”

25, నవంబర్ 2025, మంగళవారం

సమస్య - 5315

26-11-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా”
(లేదా...)
“శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”

24, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5314

25-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్”
(లేదా...)
“ఆత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్”

23, నవంబర్ 2025, ఆదివారం

సమస్య - 5313

24-11-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వారములో రెండుగ రవివారములయ్యెన్”
(లేదా...)
“వారములోన వచ్చె రవివారము సూడఁగ రెండుమారులున్”