13, మార్చి 2026, శుక్రవారం

సమస్య - 5407

14-3-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా”

4 కామెంట్‌లు:

  1. మత్తకోకిల
    నీతిఁ దప్పిన నన్న రావణు నీల్గ గూల్చియు మీదటన్
    జోతలందుచు వాని తమ్ముని నొప్పి రాజుగ జేయఁగన్
    రాతమార్చియు నన్న రావణు రాల్చి తమ్మునిఁ గావఁగన్
    భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా!

    రిప్లయితొలగించండి

  2. సీత కోసము రామ భద్రుడు చేరి లంకకు యుద్ధమున్
    నీతి వీడిన రావణా సురు నిండు ప్రాణము తీసినన్
    బ్రీతితోడను రాజ్యమిచ్చె విభీషణుండకు, భానుజున్
    భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా

    రిప్లయితొలగించండి
  3. భ్రాత బాధలు తాళజాలక రక్షకోరిన భ్రాతకై
    నీతిమాలిన రీతి వాలిని నేలకూల్చెను చూడగా;
    భ్రాతకోరగ వానికిచ్చెను పాదుకల్ తనగుర్తుగా
    భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా

    రిప్లయితొలగించండి
  4. మత్తకోకిల:
    సీతనొంటిగ కాననమ్మున జేసి మాయలు పన్ని దు
    ర్నీతుఁడై గొనిపోవలంకకు నీతి జెప్పు విభీషణున్
    పోతరమ్మున లెక్క సేయక పోరు సల్పెను రాముతో
    భ్రాతృహంతకుఁడైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా

    రిప్లయితొలగించండి