10-3-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హీనుఁడే లోకమున గౌరవించఁబడును”(లేదా...)“హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్”(ఆకాశవాణి వారి సమస్య)
తేటగీతిపూర్వభాషిగ రాణించి పొందెయశముధర్మసంరక్షణా దీక్ష దాశరథియెసురుచిర దరహాస యుతుఁడు వెరశి గర్వహీనుఁడే లోకమున గౌరవించఁబడునుఉత్పలమాలమానిత ధర్మవిగ్రహుడు మంజుల భాష సుధీరుఁడంచనన్జానకిమానసాలయుఁడు సారసనేత్రడు రామచంద్రుఁడున్కానలకేగ పట్టమును కాదని తండ్రిని గౌరవింపగన్హీనచరిత్రుఁడే? మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
పుట్టి మరణింతురెందరో పుడమిపయిన ,గుంపునందను నిత్యము గుదురుగ దనజీవనంబు నందెటువంటి చెడ్డ చరిత హీనుఁడే లోకమున గౌరవించఁబడును
తేటగీతి
రిప్లయితొలగించండిపూర్వభాషిగ రాణించి పొందెయశము
ధర్మసంరక్షణా దీక్ష దాశరథియె
సురుచిర దరహాస యుతుఁడు వెరశి గర్వ
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
ఉత్పలమాల
మానిత ధర్మవిగ్రహుడు మంజుల భాష సుధీరుఁడంచనన్
జానకిమానసాలయుఁడు సారసనేత్రడు రామచంద్రుఁడున్
కానలకేగ పట్టమును కాదని తండ్రిని గౌరవింపగన్
హీనచరిత్రుఁడే? మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండిపుట్టి మరణింతురెందరో పుడమిపయిన ,
గుంపునందను నిత్యము గుదురుగ దన
జీవనంబు నందెటువంటి చెడ్డ చరిత
హీనుఁడే లోకమున గౌరవించఁబడును