14, మార్చి 2026, శనివారం

సమస్య - 5408

15-3-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తపమెందుకు దానమేలఁ దగ సుజనులకున్”
(లేదా...)
“తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”

4 కామెంట్‌లు:

  1. కందం
    నిపుణత హరి మాయావిగఁ
    గపటమునన్ దానమడుగ కాదనుము బలీ!
    విపరీతమనఁగ వామన
    తపమెందుకు? దానమేలఁ దగ సుజనులకున్?

    చంపకమాల
    నిపుణతఁ జూపుచున్ హరియె నీ దెసఁ జేరియు దానమెంచఁగన్
    గపటము దాగియుండుననఁ గాదనుమంచును దెల్పె శుక్రుడే,
    యపశృతి, ప్రాణగండమన నాడిన మాటను దప్పలేననన్
    దప మొనరింపరాదు! మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
  2. అపరిమిత భక్తితోడన
    చపలత లేకుండు రీతి సామిని దలచన్ ,
    కపటపు చేష్టలయిన యీ
    తపమెందుకు ? దానమేలఁ ? దగ సుజనులకున్

    రిప్లయితొలగించండి
  3. అపరిమితంపు భక్తి మనముందున నుంచుకొనంగ జాలునే
    చపలతలేని రీతి దన సామిని దల్చుచునుండ నొప్పగున్
    కపటపు చేష్టలందుననె కామితుడౌచు నిరంత రంబుగా
    తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”

    రిప్లయితొలగించండి