16-3-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె”(లేదా...)“గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్”
భీకరమయినటుల బెల్లిదముగ సుడి గాలి వీచెఁ , గొమ్మ గదలదయ్యె ,ఎన్నికల సమయము నెంతయో నమ్మించి చెప్పి నట్టి పనులు జేయరయ్యె
ఆటవెలదిగోకులమ్ము పైన నాక లోక పతియెయలిగి రాళ్లవాన కలుగఁ జేసెగొడుగు జేయ హరియె గోవర్ధనముఁ, గ్రిందగాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె!ఉత్పలమాలఏలిక కృష్ణమూర్తి పలుకే తమకాజ్ఞగ నింద్రపూజలన్దేలికఁ జేయ గోకులము, దిగ్గున రాల్చగ రాళ్ల వర్షమున్వేలుపు ఱేడు, గోట హరి పేరువు నెత్తియుఁ గాచఁ గ్రిందుగన్గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్!
భీకరమయినటుల బెల్లిదముగ సుడి
రిప్లయితొలగించండిగాలి వీచెఁ , గొమ్మ గదలదయ్యె ,
ఎన్నికల సమయము నెంతయో నమ్మించి
చెప్పి నట్టి పనులు జేయరయ్యె
ఆటవెలది
రిప్లయితొలగించండిగోకులమ్ము పైన నాక లోక పతియె
యలిగి రాళ్లవాన కలుగఁ జేసె
గొడుగు జేయ హరియె గోవర్ధనముఁ, గ్రింద
గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె!
ఉత్పలమాల
ఏలిక కృష్ణమూర్తి పలుకే తమకాజ్ఞగ నింద్రపూజలన్
దేలికఁ జేయ గోకులము, దిగ్గున రాల్చగ రాళ్ల వర్షమున్
వేలుపు ఱేడు, గోట హరి పేరువు నెత్తియుఁ గాచఁ గ్రిందుగన్
గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్!