22, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5567

23-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?”

(లేదా...)

“వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పరోక్షంగా నేనిచ్చిన కొసరు సమస్య)

27 కామెంట్‌లు:

  1. అనఘా! యేలయిలా భా
    వనమింత దరిద్రమయ్యొ! వాఙ్నియమ మెరుం
    గని వాడవా వధాని ? క
    వనమ్ము కృత్రిమముగాను ప్రవహించెగదా!





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని ప్రయోగం. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ ఇరువురికి నెనర్లు

      మరీ ఇంత దుష్కర ప్రాస నిచ్చేరేమనుకుని‌ నిదుర మత్తులో వాక్యాన్ని అలా మార్చి కందం గిట్టించేమనుకుని సంతస పడిపోయి
      పబ్లిష్ బటన్‌నొక్కి నిదురపోయి....
      తెల్లారి యెందుకో సందేహం వేసింది ఇచ్చిన కైపద వాక్యం కంద పాదం కాదు కదా అని :)




      తొలగించండి
  2. పద్య మల్లుట లో గొప్ప పటిమ వలయు
    మంచి భావము జొప్పించి మహిత మైన
    ధార గా నాశువల రారు దక్షత యును
    వా జ్ని య మ మెరుంగని వా డవా వధాని?

    రిప్లయితొలగించండి


  3. ప్రాఙ్నగమున బుట్టి రవి విశ్వము కెల్ల
    కాంతి యొసగు ననుట కల్ల కాని రీతి
    వాఙ్నియమమెఱగిన కవి వాసి గాంచు
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?


    వాఙ్నియమమ్మెఱుంగనిదె పండితు డౌనటె ధాత్రి గాంచగా
    వాఙ్నగ మందు బుట్టి రవి భాసుర మానము వెల్గు రీతిగన్
    వాఙ్నియమంబదే కవికి వాసి యశస్సు నొసంగు నందురే
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే?

    రిప్లయితొలగించండి
  4. బ్రతుకుటకయి సంపాదించ ప్రథమమనుచు ,
    పరులభాష తన పరమావధిగ దలచి ,
    పసితనము నుండి తన మాతృభాష యొక్క
    వాఙ్మయము నెఱుంగనివాఁడవా వధాని?”

    రిప్లయితొలగించండి
  5. వాఙ్నియమము మీమాంసకే వలయుగాదె
    వాఙ్నిపుణత చాలు వధాన పండితునకు
    వాఙ్నిపుణత తోడనిటులఁ బల్కదగునె
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?

    వాఙ్నిపుణుండు శక్తిగల వాడవధాన మొనర్చు హాయిగా
    వాఙ్నియమాలతోఁ బలుకు వాక్కులు పద్యము లైన పిమ్మటన్
    వాఙ్నిపుణత్వమున్నదని పండితుడే వచియించెనివ్విధిన్
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    రిప్లయితొలగించండి
  6. వాఙ్నియమం బెఱుంగు మన బాలుఁడభిజ్ఞుడు విద్యలందునన్
    వాఙ్నిధియే వధానమున పండిత మండలి మెచ్చునట్లుగా
    వాఙ్నిపుణత్వమే విరియు పద్యములందుననెట్టి దోసమౌ
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    రిప్లయితొలగించండి
  7. 1.
    వాఙ్నిధి యైన శాస్త్రముల వాసన నేర్చి సమస్త విద్యలన్
    వాఙ్నిపుణత్వ మొప్పఁగ నవారిత తేజము తోడ నిల్చినన్
    వాఙ్నిరతుండు సత్కవిత వైభవ శోభితుఁడై ప్రకాశమై
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    2.
    వాఙ్నిపుణత్వమొప్పఁగ నవావరణంబుల మేధ నిల్చెనే
    వాఙ్నిధి యంత్రమేధ యనువాదము లెల్లను జేయఁగాఁ దగెన్
    వాఙ్నిరతంబు యంత్రమయవాక్కుల శాస్త్రము నేర్చె నేర్పుతో
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    3.
    వాఙ్నియమంబులన్ సతము వాక్కున నేర్పరియై చదింపగన్
    వాఙ్నియమంబులన్ దెలిసి వాగ్విభవంబును చూపి సర్వదా
    వాఙ్నియమంబు నేర్వకయె వాని యెఱుంగక లోకు లిట్లనున్
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    #ఛందం

    దుర్లభ వ్యంజనప్రాసను సాధించడానికి వాఙ్ని పదంతో ప్రతీ పాదం మొదలైయ్యేలా ప్రయత్నం చేయించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆదూరి వారి పూరణను నకలుగానో అనుకరణగానో తీసుకోలేదని విన్నవించుకుంటున్నాను. పూర్తిగా యాదృచ్చికం గా కుదిరాయి.

      తొలగించండి
    2. వాఙ్నియమంబు నేర్చుచు కృతకపుమేధ వధాని యయ్యెనే

      తొలగించండి
    3. ఇవికూడ కృత్రిమమేధ చేసిన పూరణలేనా? బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. బాలభానుని తేజమ్ము పరిఢవిల్లు
    బాల భరతుడా యవధాన భాస్కరుండ!
    విద్యలన్నియు నేర్చిన విదుడవీవు
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ తిఙ్నియమమ్మునన్ గురువు దేశముఁ జొచ్చి సమాదరమ్ముతో
    వాఙ్నిధి యై పఠించినది పద్ధతి యొప్పఁగ నాకళించఁగన్
    శఙ్నిధియౌచు విజ్ఞుఁడుగ సాగుచు దుష్టము నక్రమమ్మునౌ
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుండవధాని యయ్యెనే

    తిక్ వెళ్ళుట శక్ శక్తమగుట దేశము ప్రాంతము

    పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు

    రిప్లయితొలగించండి
  10. కం:ఘనపాండిత్యము నీ యౌ
    వనముననే బొందినావు వాఙ్నియమ మెఱుం
    గనివాఁడవా వధాని? క
    వనధారల గురియు మింక బాండిత్యము తోన్
    (బ్లాగ్ లో జిలేబి గారి కందం లో పూరణ చూసాను.నాకూ ఛందస్సు మార్చి రాయా లనిపించింది. Thanks to Mrs Zilebi)



    రిప్లయితొలగించండి
  11. ఉ:ప్రాజ్ఞగ మందు వెల్గు లిడు భానుని రీతిని సంస్కృతంపు స
    మ్యజ్ఞియమమ్ములన్ దెలిసి మాన్య మనన్ విబుధాళి వారిదౌ
    హృజ్ఞవనీతముల్ కరుగ నెంతటి ప్రజ్ఞను జూపె మిత్రమా!
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే?

    రిప్లయితొలగించండి
  12. ప్రాఙ్నగమెక్కి సూర్యుఁడు ప్రభల్ వెదజల్లఁగఁ దెల్లవాఱె స
    మ్యఙ్నవభావబంధురహృదంతసీమల నిండె మోదమున్
    దిఙ్నగధీరుఁడై దినపతిన్ మది నమ్ముచు దుష్టభావనా
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    రిప్లయితొలగించండి
  13. సత్కవీంద్ర సంచయ మింక సకల విబుధ
    సత్తములు నిలువంగ నసత్య మకట
    సుంత వచియింప రాదయ్య యింత యేని
    వాఙ్నియమ మెఱుంగని వాఁ డవా వధాని?


    దిఙ్నిచయాంతరాళమున ధీవరు లెల్లరు సన్నుతింపఁ దా
    దృఙ్నర పుంగవార్భకుఁడు పృథ్విని నెందును లేఁడు లేఁడనన్
    వాఙ్నిధి యందు దిట్ట యయి ప్రస్తుత పృచ్ఛక సన్మనశ్చర
    ద్వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    కోవిదుల మెప్పుఁ గాంచియు గొప్పగాను
    బాలభాస్కర బిరుదు బడసి నీవు
    వచ్చిరాని మాటలనల్లి పల్కితంటె!
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా? వధాని!

    ఉత్పలమాల
    ప్రాజ్ఞుతుఁడౌచుఁ బల్కితివి రంజిల పృచ్ఛకులెల్ల ముగ్ధులై
    దృజ్ఞిబిడీకృతంబదియె దీక్షను వాగ్విభవంబుఁ దెల్పగన్
    వాజ్ఞిధి వయ్యునమ్రతను వచ్చియు రాని పదంబులంటివే!
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే?

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పట్టు సడలని పాండిత్య ప్రతిభ కలిగి
    వాక్పటిమ తోడ సభలోన వరలుచుండి
    కోవిదుల మెప్పు పొందుచు గొప్ప గాను
    వాజ్ఞ్నయమ మెఱుంగని వాడవా వధాని?

    రిప్లయితొలగించండి