22, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5567

23-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?”

(లేదా...)

“వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పరోక్షంగా నేనిచ్చిన కొసరు సమస్య)

5 కామెంట్‌లు:

  1. అనఘా! యేలయిలా భా
    వనమింత దరిద్రమయ్యొ! వాఙ్నియమ మెరుం
    గని వాడవా వధాని ? క
    వనమ్ము కృత్రిమముగాను ప్రవహించెగదా!





    రిప్లయితొలగించండి
  2. పద్య మల్లుట లో గొప్ప పటిమ వలయు
    మంచి భావము జొప్పించి మహిత మైన
    ధార గా నాశువల రారు దక్షత యును
    వా జ్ని య మ మెరుంగని వా డవా వధాని?

    రిప్లయితొలగించండి


  3. ప్రాఙ్నగమున బుట్టి రవి విశ్వము కెల్ల
    కాంతి యొసగు ననుట కల్ల కాని రీతి
    వాఙ్నియమమెఱగిన కవి వాసి గాంచు
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?


    వాఙ్నియమమ్మెఱుంగనిదె పండితు డౌనటె ధాత్రి గాంచగా
    వాఙ్నగ మందు బుట్టి రవి భాసుర మానము వెల్గు రీతిగన్
    వాఙ్నియమంబదే కవికి వాసి యశస్సు నొసంగు నందురే
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే?

    రిప్లయితొలగించండి
  4. బ్రతుకుటకయి సంపాదించ ప్రథమమనుచు ,
    పరులభాష తన పరమావధిగ దలచి ,
    పసితనము నుండి తన మాతృభాష యొక్క
    వాఙ్మయము నెఱుంగనివాఁడవా వధాని?”

    రిప్లయితొలగించండి
  5. వాఙ్నియమము మీమాంసకే వలయుగాదె
    వాఙ్నిపుణత చాలు వధాన పండితునకు
    వాఙ్నిపుణత తోడనిటులఁ బల్కదగునె
    వాఙ్నియమ మెఱుంగనివాఁడవా వధాని?

    వాఙ్నిపుణుండు శక్తిగల వాడవధాన మొనర్చు హాయిగా
    వాఙ్నియమాలతోఁ బలుకు వాక్కులు పద్యము లైన పిమ్మటన్
    వాఙ్నిపుణత్వమున్నదని పండితుడే వచియించెనివ్విధిన్
    వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే

    రిప్లయితొలగించండి