25-8-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము”
(లేదా...)
“పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్”
(ఫ్లోరిడా, అమెరికాలో వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)
విఘ్నరాజు బొజ్జ పెద్దదిగ నెరుగు తీపి వస్తువులను దినగ బొఱ్ఱపెరుగుచున్నదనుచు వెక్కిరించెద వేల ?పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
విఘ్నములను బాపి విద్యల నొసగెడి వాడటంచు కొలుతు భక్తి తోడ శూలి సుతుల లోన చూడ నగ్రజుడగు పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము.పట్టు పంచెలు కట్టుకుందురు భస్మ రేఖలు ఫాలమున్ బెట్టుకుంచును భక్తి తోడను ప్రీతిగా నిట శంకరున్ బట్టి యంచును కొల్చు చుందురు వక్ర తుండుడు వాడె యా పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్.
రిప్లయితొలగించండివిఘ్నరాజు బొజ్జ పెద్దదిగ నెరుగు
తీపి వస్తువులను దినగ బొఱ్ఱ
పెరుగుచున్నదనుచు వెక్కిరించెద వేల ?
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
రిప్లయితొలగించండివిఘ్నములను బాపి విద్యల నొసగెడి
వాడటంచు కొలుతు భక్తి తోడ
శూలి సుతుల లోన చూడ నగ్రజుడగు
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము.
పట్టు పంచెలు కట్టుకుందురు భస్మ రేఖలు ఫాలమున్
బెట్టుకుంచును భక్తి తోడను ప్రీతిగా నిట శంకరున్
బట్టి యంచును కొల్చు చుందురు వక్ర తుండుడు వాడె యా
పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్.