25-8-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము”
(లేదా...)
“పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్”
(ఫ్లోరిడా, అమెరికాలో వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)
విఘ్నరాజు బొజ్జ పెద్దదిగ నెరుగు తీపి వస్తువులను దినగ బొఱ్ఱపెరుగుచున్నదనుచు వెక్కిరించెద వేల ?పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
విఘ్నములను బాపి విద్యల నొసగెడి వాడటంచు కొలుతు భక్తి తోడ శూలి సుతుల లోన చూడ నగ్రజుడగు పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము.పట్టు పంచెలు కట్టుకుందురు భస్మ రేఖలు ఫాలమున్ బెట్టుకుంచును భక్తి తోడను ప్రీతిగా నిట శంకరున్ బట్టి యంచును కొల్చు చుందురు వక్ర తుండుడు వాడె యా పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్.
ఆటవెలదితుందిలుండునౌచుఁ బొంది పరీక్షనుతల్లితండ్రు లొప్పఁ దానె నెగ్గియగ్గణాధిపత్యమందె గజముఖుండు! పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము! మత్తకోకిలచుట్టె నాతడుఁ దల్లిదండ్రులఁ జూపినట్టి పరీక్షకేయట్టె నెగ్గియు తుందిలుండుగ నాశిషంపు ఫలంబుగన్దిట్టయౌచు గణాధిపుండుగ తీరె గజాననుండహో! పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్!
పొట్టనింపనెంచి బొజ్జవేల్పునుగొల్చిచట్ట సభను జొచ్చి చకచకమనిగుట్టుగా భుజించి కోట్లతో పెంచినపొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ముపొట్టనిండ భుజించి నాడట బొజ్జదేవర మెండుగాఁబొట్ట గల్గిన వక్రతుండుడు బూజితుండని గొల్వరేగుట్టు గామరి బొక్కునేతను కుంభకోణపు ముఖ్యుడైపొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్
రిప్లయితొలగించండివిఘ్నరాజు బొజ్జ పెద్దదిగ నెరుగు
తీపి వస్తువులను దినగ బొఱ్ఱ
పెరుగుచున్నదనుచు వెక్కిరించెద వేల ?
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
రిప్లయితొలగించండివిఘ్నములను బాపి విద్యల నొసగెడి
వాడటంచు కొలుతు భక్తి తోడ
శూలి సుతుల లోన చూడ నగ్రజుడగు
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము.
పట్టు పంచెలు కట్టుకుందురు భస్మ రేఖలు ఫాలమున్
బెట్టుకుంచును భక్తి తోడను ప్రీతిగా నిట శంకరున్
బట్టి యంచును కొల్చు చుందురు వక్ర తుండుడు వాడె యా
పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్.
ఆటవెలది
రిప్లయితొలగించండితుందిలుండునౌచుఁ బొంది పరీక్షను
తల్లితండ్రు లొప్పఁ దానె నెగ్గి
యగ్గణాధిపత్యమందె గజముఖుండు!
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము!
మత్తకోకిల
చుట్టె నాతడుఁ దల్లిదండ్రులఁ జూపినట్టి పరీక్షకే
యట్టె నెగ్గియు తుందిలుండుగ నాశిషంపు ఫలంబుగన్
దిట్టయౌచు గణాధిపుండుగ తీరె గజాననుండహో!
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్!
పొట్టనింపనెంచి బొజ్జవేల్పునుగొల్చి
రిప్లయితొలగించండిచట్ట సభను జొచ్చి చకచకమని
గుట్టుగా భుజించి కోట్లతో పెంచిన
పొట్ట యున్నవాఁడె బుధుఁడు సుమ్ము
పొట్టనిండ భుజించి నాడట బొజ్జదేవర మెండుగాఁ
బొట్ట గల్గిన వక్రతుండుడు బూజితుండని గొల్వరే
గుట్టు గామరి బొక్కునేతను కుంభకోణపు ముఖ్యుడై
పొట్ట గల్గినవాని నందురు భూమిపైన బుధుండుగన్