25, ఆగస్టు 2026, మంగళవారం

సమస్య - 5570

26-8-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు”

(లేదా...)

“విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్”

(ఫ్లోరిడా, అమెరికాలో వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

6 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సోదరులగు పాండవులకు శోకమిడుచు
    సఖునిగా నొంది కర్ణుని సాయమెంచి
    రాజరాజౌచు కర్ణుని రాజుఁజేసె!
    విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు!


    చంపకమాల
    ఋషినుత పాండుసోదరుల రిక్తపు చేతులనుంచి మీరి పౌ
    రుషమున స్వార్థచిత్తమున రోయుచు కర్ణుని యంగరాజుగన్
    ధిషణ విహీనుడై మసలి తీర్చెను లోకులు నిందనిట్లనన్
    విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్!

    రిప్లయితొలగించండి
  2. విషమునుమించుస్వార్ధమదివింతగయెన్నికవేళలందునీ
    విషయమువిన్నవించెదరువేగిరమేముసమస్యమూలమున్
    శషబిషలేకతేల్తుమనిసారెలుచీరలుపేర్మినీయరే
    *విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్”*

    రిప్లయితొలగించండి

  3. విహగముల జంపి జీవించు వేటగాడు
    మారుచున్ రచియించె రామాయణమ్మ
    టంచు తెలిపె నంతేవాసి కాతడిటుల
    విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు.


    ఝషమున సంచ రించుచు ఖజాకములన్ గడతీర్చు బోయ యే
    యిషువును వేయ జిహ్వరద మీలిగి నంతట శోక మందునన్
    ఋషిగను మారె, వాల్మికి చరిత్ర వచించుచు నొజ్జ యిట్లనెన్
    విషమునుఁ ద్రాగి సర్పమది వింతగ క్షీరమొసంగెఁ బ్రీతితోన్.

    రిప్లయితొలగించండి
  4. తపనముకు వేడి కలియ శీతలమగు గది ,
    తలనుగల గరళమునకు , త్రాగి నట్టి
    విషము కలియగ మారుచు పేయమయ్యె ,
    విషముఁ ద్రాగి క్షీరమొసఁగె భేకభుక్కు

    రిప్లయితొలగించండి