10, సెప్టెంబర్ 2026, గురువారం

సమస్య - 5586

11-9-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ”

(లేదా...)

“యతి ధర్మమ్మును వీడి  యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్”

(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

13 కామెంట్‌లు:

  1. చతురాస్యుడు వరమిడ, యసు
    ర తారక వధకు మతోడ లంగమొనర్చన్
    రతి నాధుని శరము దగుల
    యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ

    రిప్లయితొలగించండి

  2. మత మనుచు నహింసను భూ
    పతులిట పాటింప తగదు వాసిగ నా దు
    ర్మతులను శిక్షించుట లో
    యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ.


    మత ధర్మంబని హింస కూడదన దుర్మార్గం బదే హెచ్చు భూ
    పతులౌ తామిది వీడి రాజ్యమున పాపాత్ముండ్ర శిక్షింప వి
    ట్పతి శంకింపక నిష్ఠురత్వ మదియే పారమ్య మంచున్ భువిన్
    యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్.

    రిప్లయితొలగించండి
  3. యతులే వ్యాపారులయిన
    యతి ధర్మము మార్పునొంది యశము నొసగదా
    ప్రతిపాదింపని విషయము
    యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ

    యతులే నూతన మార్గ మెంచినపుడే వ్యాపారమే ముఖ్యమై
    యతి ధర్మమ్మును దెల్పకుండుటయె నవ్యంబైన నిర్దేశమౌ
    ప్రతిపాదింతురు గాదె విజ్ఞు లిటులన్ ప్రాచీన భావంబులన్
    యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్

    రిప్లయితొలగించండి
  4. -

    ప్రతిమయె లేకయు పార్వతి
    సతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్
    పతిగా బడసెను తనరగ
    యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ”

    రిప్లయితొలగించండి
  5. -
    సతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనం
    బతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగా
    పతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగా
    యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్


    రిప్లయితొలగించండి
  6. కం: అతివాదులు మన వైదిక
    మతమున్ నాశనము జేయ మన్నించుచు నే
    యతినౌదునె? క్షాత్రమునన్
    యతిధర్మచ్యుతియె సవ్యమగు, సత్యంబౌ.


    రిప్లయితొలగించండి
  7. మ॥ స్థితి ధర్మమ్ముల నిర్ణయించు ధర సుశ్రేయంబు సిద్ధించఁగన్
    క్షతియే కల్గదొ యన్య ధర్మముల, సంసారంపు బాధ్యత్వముల్
    తతియై క్రమ్మఁగఁ బోరు బాటనటు సంత్రాణమ్ముఁ నార్జించఁగన్
    యతి ధర్మమును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్

    స్థితి ఆశ్రమ స్థితి గృహస్థు సన్న్యాసి (యతి) ధర్మాన్ని పాటించుట తప్పండి.

    హాస్య పూరణ అండి:

    మ॥ సతితోఁ బోరని పారి పోవుటయు దోషంబే కదయ్యా పరి
    స్థితినిన్ దాల్చుచు బుద్ధిఁ గాంచి యటు విశ్లేషించి విజ్ఞానివై
    బ్రతుకన్ నేర్వగ నొప్పుఁ గృష్ణుఁ గన మార్గంబుల్ దృశించంగనౌ
    యతి ధర్మమ్మును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్

    పాత సినిమాలలో గయ్యాళి భార్యలను వదిలించుకోవడానికి సన్న్యాసం తీసుకోవడం ఆధారంగా నండి

    రిప్లయితొలగించండి
  8. మ.వి: మతి లో శంకను బొందు రామునకు ధర్మ మ్మిట్లు బోధించె న
    య్యతి యౌ కౌశికు "డోయి! స్త్రీవధ యఘ మ్మౌనంచు జితించి యి
    య్యతి క్రూరాత్మను జంప వీడెదవె! యీ యౌదార్యమున్ జూపు నీ
    యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్"


    రిప్లయితొలగించండి
  9. కందం
    మతమున నింద్రియ నిగ్రహ
    మతులితముగ లేనివాన్కి యతి వేషంబే?
    ధృత మోహములను వీడని
    యతి ధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ!

    మత్తేభవిక్రీడితము
    సతతంబున్ రసభావ గర్భితముగా సత్కావ్యముల్ వ్రాయుచో
    కృతులన్ ఛందపు రీతులక్కరన, సత్కీర్తిన్ సదా కోరుచున్
    మతిహీనత్వము తోడ నుండదగునే మర్మాలఁ దానెంచకే
    యతి ధర్మమ్మను వీడి? యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్!

    రిప్లయితొలగించండి
  10. వితత మొనర్పుమ నిత్య మ
    హితములు నిరయమున కేఁగ నెంచినచో జీ
    విత విలయం బాశింప ని
    యతి ధర్మచ్యుతియె సవ్య మగు సత్యంబౌ


    వెతలం దుంచిన స్యీయ పౌరులను నిర్భీతిన్ ధయా హీనుఁడై
    మతి లేకింతయుఁ బాలనమ్మున కిలం బాత్రుండు కాకుండు సం
    తత మత్యంతము దుఃఖ యుక్తము ప్రజా నష్టమ్ముఁ జేకూర్చు న
    య్యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యం బౌట సత్యం బగున్

    [ఆ + అతి ధర్మమ్ము = అయ్యతి ధర్మమ్ము]

    రిప్లయితొలగించండి
  11. అతివలతో సాంగత్యము
    యతిధర్మచ్యుతియె, సవ్యమగు సత్యంబౌ
    నతి చనువు జూపకెన్నఁడు
    నతివల దల్లులుగ జూచి యారాధించన్

    రిప్లయితొలగించండి
  12. యతిరాజాతఁడు రాజ్యపాలనమునం దత్యంత శ్రద్ధాళుఁడై
    నుతియింపన్ జనపాళి శ్రేయమున కున్మూలమ్ముగా మార్పులన్
    వితతంబౌ విధి జేకొనన్ జనులు తృప్తిన్ బల్కిరీ తీరుగన్
    యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్

    రిప్లయితొలగించండి
  13. నేటి మత్తేభపూరణముల యూట్యూబు
    సంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయము

    https://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG

    రిప్లయితొలగించండి