11-9-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ”
(లేదా...)
“యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్”
(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)
చతురాస్యుడు వరమిడ, యసు ర తారక వధకు మతోడ లంగమొనర్చన్ రతి నాధుని శరము దగులయతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ
మత మనుచు నహింసను భూ పతులిట పాటింప తగదు వాసిగ నా దు ర్మతులను శిక్షించుట లో యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ.మత ధర్మంబని హింస కూడదన దుర్మార్గం బదే హెచ్చు భూ పతులౌ తామిది వీడి రాజ్యమున పాపాత్ముండ్ర శిక్షింప వి ట్పతి శంకింపక నిష్ఠురత్వ మదియే పారమ్య మంచున్ భువిన్ యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్.
యతులే వ్యాపారులయినయతి ధర్మము మార్పునొంది యశము నొసగదాప్రతిపాదింపని విషయముయతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌయతులే నూతన మార్గ మెంచినపుడే వ్యాపారమే ముఖ్యమైయతి ధర్మమ్మును దెల్పకుండుటయె నవ్యంబైన నిర్దేశమౌప్రతిపాదింతురు గాదె విజ్ఞు లిటులన్ ప్రాచీన భావంబులన్యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
-ప్రతిమయె లేకయు పార్వతిసతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్పతిగా బడసెను తనరగయతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ”
-సతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనంబతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగాపతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగాయతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
కం: అతివాదులు మన వైదిక మతమున్ నాశనము జేయ మన్నించుచు నేయతినౌదునె? క్షాత్రమునన్యతిధర్మచ్యుతియె సవ్యమగు, సత్యంబౌ.
మ॥ స్థితి ధర్మమ్ముల నిర్ణయించు ధర సుశ్రేయంబు సిద్ధించఁగన్క్షతియే కల్గదొ యన్య ధర్మముల, సంసారంపు బాధ్యత్వముల్తతియై క్రమ్మఁగఁ బోరు బాటనటు సంత్రాణమ్ముఁ నార్జించఁగన్యతి ధర్మమును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్స్థితి ఆశ్రమ స్థితి గృహస్థు సన్న్యాసి (యతి) ధర్మాన్ని పాటించుట తప్పండి.హాస్య పూరణ అండి:మ॥ సతితోఁ బోరని పారి పోవుటయు దోషంబే కదయ్యా పరిస్థితినిన్ దాల్చుచు బుద్ధిఁ గాంచి యటు విశ్లేషించి విజ్ఞానివై బ్రతుకన్ నేర్వగ నొప్పుఁ గృష్ణుఁ గన మార్గంబుల్ దృశించంగనౌయతి ధర్మమ్మును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్పాత సినిమాలలో గయ్యాళి భార్యలను వదిలించుకోవడానికి సన్న్యాసం తీసుకోవడం ఆధారంగా నండి
మ.వి: మతి లో శంకను బొందు రామునకు ధర్మ మ్మిట్లు బోధించె నయ్యతి యౌ కౌశికు "డోయి! స్త్రీవధ యఘ మ్మౌనంచు జితించి యియ్యతి క్రూరాత్మను జంప వీడెదవె! యీ యౌదార్యమున్ జూపు నీయతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్"
కందంమతమున నింద్రియ నిగ్రహమతులితముగ లేనివాన్కి యతి వేషంబే?ధృత మోహములను వీడనియతి ధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ!మత్తేభవిక్రీడితముసతతంబున్ రసభావ గర్భితముగా సత్కావ్యముల్ వ్రాయుచోకృతులన్ ఛందపు రీతులక్కరన, సత్కీర్తిన్ సదా కోరుచున్మతిహీనత్వము తోడ నుండదగునే మర్మాలఁ దానెంచకేయతి ధర్మమ్మను వీడి? యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్!
వితత మొనర్పుమ నిత్య మహితములు నిరయమున కేఁగ నెంచినచో జీవిత విలయం బాశింప నియతి ధర్మచ్యుతియె సవ్య మగు సత్యంబౌ వెతలం దుంచిన స్యీయ పౌరులను నిర్భీతిన్ ధయా హీనుఁడై మతి లేకింతయుఁ బాలనమ్మున కిలం బాత్రుండు కాకుండు సంతత మత్యంతము దుఃఖ యుక్తము ప్రజా నష్టమ్ముఁ జేకూర్చు నయ్యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యం బౌట సత్యం బగున్ [ఆ + అతి ధర్మమ్ము = అయ్యతి ధర్మమ్ము]
అతివలతో సాంగత్యముయతిధర్మచ్యుతియె, సవ్యమగు సత్యంబౌనతి చనువు జూపకెన్నఁడునతివల దల్లులుగ జూచి యారాధించన్
యతిరాజాతఁడు రాజ్యపాలనమునం దత్యంత శ్రద్ధాళుఁడైనుతియింపన్ జనపాళి శ్రేయమున కున్మూలమ్ముగా మార్పులన్వితతంబౌ విధి జేకొనన్ జనులు తృప్తిన్ బల్కిరీ తీరుగన్యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
నేటి మత్తేభపూరణముల యూట్యూబు సంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయము https://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG
చతురాస్యుడు వరమిడ, యసు
రిప్లయితొలగించండిర తారక వధకు మతోడ లంగమొనర్చన్
రతి నాధుని శరము దగుల
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ
రిప్లయితొలగించండిమత మనుచు నహింసను భూ
పతులిట పాటింప తగదు వాసిగ నా దు
ర్మతులను శిక్షించుట లో
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ.
మత ధర్మంబని హింస కూడదన దుర్మార్గం బదే హెచ్చు భూ
పతులౌ తామిది వీడి రాజ్యమున పాపాత్ముండ్ర శిక్షింప వి
ట్పతి శంకింపక నిష్ఠురత్వ మదియే పారమ్య మంచున్ భువిన్
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్.
యతులే వ్యాపారులయిన
రిప్లయితొలగించండియతి ధర్మము మార్పునొంది యశము నొసగదా
ప్రతిపాదింపని విషయము
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ
యతులే నూతన మార్గ మెంచినపుడే వ్యాపారమే ముఖ్యమై
యతి ధర్మమ్మును దెల్పకుండుటయె నవ్యంబైన నిర్దేశమౌ
ప్రతిపాదింతురు గాదె విజ్ఞు లిటులన్ ప్రాచీన భావంబులన్
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
-
రిప్లయితొలగించండిప్రతిమయె లేకయు పార్వతి
సతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్
పతిగా బడసెను తనరగ
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ”
-
రిప్లయితొలగించండిసతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనం
బతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగా
పతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగా
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
కం: అతివాదులు మన వైదిక
రిప్లయితొలగించండిమతమున్ నాశనము జేయ మన్నించుచు నే
యతినౌదునె? క్షాత్రమునన్
యతిధర్మచ్యుతియె సవ్యమగు, సత్యంబౌ.
మ॥ స్థితి ధర్మమ్ముల నిర్ణయించు ధర సుశ్రేయంబు సిద్ధించఁగన్
రిప్లయితొలగించండిక్షతియే కల్గదొ యన్య ధర్మముల, సంసారంపు బాధ్యత్వముల్
తతియై క్రమ్మఁగఁ బోరు బాటనటు సంత్రాణమ్ముఁ నార్జించఁగన్
యతి ధర్మమును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
స్థితి ఆశ్రమ స్థితి గృహస్థు సన్న్యాసి (యతి) ధర్మాన్ని పాటించుట తప్పండి.
హాస్య పూరణ అండి:
మ॥ సతితోఁ బోరని పారి పోవుటయు దోషంబే కదయ్యా పరి
స్థితినిన్ దాల్చుచు బుద్ధిఁ గాంచి యటు విశ్లేషించి విజ్ఞానివై
బ్రతుకన్ నేర్వగ నొప్పుఁ గృష్ణుఁ గన మార్గంబుల్ దృశించంగనౌ
యతి ధర్మమ్మును వీడియుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
పాత సినిమాలలో గయ్యాళి భార్యలను వదిలించుకోవడానికి సన్న్యాసం తీసుకోవడం ఆధారంగా నండి
మ.వి: మతి లో శంకను బొందు రామునకు ధర్మ మ్మిట్లు బోధించె న
రిప్లయితొలగించండియ్యతి యౌ కౌశికు "డోయి! స్త్రీవధ యఘ మ్మౌనంచు జితించి యి
య్యతి క్రూరాత్మను జంప వీడెదవె! యీ యౌదార్యమున్ జూపు నీ
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్"
కందం
రిప్లయితొలగించండిమతమున నింద్రియ నిగ్రహ
మతులితముగ లేనివాన్కి యతి వేషంబే?
ధృత మోహములను వీడని
యతి ధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ!
మత్తేభవిక్రీడితము
సతతంబున్ రసభావ గర్భితముగా సత్కావ్యముల్ వ్రాయుచో
కృతులన్ ఛందపు రీతులక్కరన, సత్కీర్తిన్ సదా కోరుచున్
మతిహీనత్వము తోడ నుండదగునే మర్మాలఁ దానెంచకే
యతి ధర్మమ్మను వీడి? యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్!
వితత మొనర్పుమ నిత్య మ
రిప్లయితొలగించండిహితములు నిరయమున కేఁగ నెంచినచో జీ
విత విలయం బాశింప ని
యతి ధర్మచ్యుతియె సవ్య మగు సత్యంబౌ
వెతలం దుంచిన స్యీయ పౌరులను నిర్భీతిన్ ధయా హీనుఁడై
మతి లేకింతయుఁ బాలనమ్మున కిలం బాత్రుండు కాకుండు సం
తత మత్యంతము దుఃఖ యుక్తము ప్రజా నష్టమ్ముఁ జేకూర్చు న
య్యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యం బౌట సత్యం బగున్
[ఆ + అతి ధర్మమ్ము = అయ్యతి ధర్మమ్ము]
అతివలతో సాంగత్యము
రిప్లయితొలగించండియతిధర్మచ్యుతియె, సవ్యమగు సత్యంబౌ
నతి చనువు జూపకెన్నఁడు
నతివల దల్లులుగ జూచి యారాధించన్
యతిరాజాతఁడు రాజ్యపాలనమునం దత్యంత శ్రద్ధాళుఁడై
రిప్లయితొలగించండినుతియింపన్ జనపాళి శ్రేయమున కున్మూలమ్ముగా మార్పులన్
వితతంబౌ విధి జేకొనన్ జనులు తృప్తిన్ బల్కిరీ తీరుగన్
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్
నేటి మత్తేభపూరణముల యూట్యూబు
రిప్లయితొలగించండిసంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయము
https://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG