12-9-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
(లేదా...)
“హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్”
(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)
మాంసాహారులు ప్రాణులహింసించుచు నుండ్రి మిగుల హీనాత్మకులైసంశయములేదు నిజముగహింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
- నిన్నటి మత్తేభపూరణముల యూట్యూబుసంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయముhttps://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG
-కంసుని సంహారమ్మున్ ధ్వంసము సేయంగ కౌరవాదుల మదమున్సంశయమేమియు లేదయొ!హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్!జిలేబీయము
కంసుడు క్రీడల పోటీ సంసత్తున నుండ , వృష్ణి చంపుట గాంచన్ శంసనము జేసిరిట్టుల"హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
సంసరణము తరి యాస్తుల ధ్వంస మమాయకుల పైన వలదనె గాంధీ హింసను, మరియును పలికె న హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్.సంసారమ్మది సాగరమ్మని కదా సాపాటు కై కొందరీ హింసావృత్తిని సాగుచుందురిల మీరీ రీతినిన్ బల్కగా హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌ,? నెవ్విధిన్ హంసాత్మా యది మానినన్ దొరుకు నాహారంబు వాచింపుమా.
హింసాద్వేషములే విధ్వంసపు హేతువులని విశదంబై జనులేహింసను విడనాడినపు డ హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్కంసారాతి విశేష గీత విదుడై గాంధీ మహాత్ముండహోహింసామార్గము వీడుడన్న పిలుపే హేరాళమై నప్డు విధ్వంసంబున్ సహియింప వద్దనె గదా తాజెప్పు సత్యవ్రతాహింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్
కంసుని క్రౌర్యములకు విధ్వంసములకు చరమగీతి పాడగ వానిన్హింసించె బాలకృష్ణుఁడుహింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
హింసావాద మనర్ధకారకము గర్హింపందగున్ లేనిచోధ్వంసంబుం బొనరించు లోకమున సర్వంబున్ సమూలంబుగాహింసింపందగు నుగ్రవాదమును సంక్షేపించగా నత్తరిన్హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?
కందంధ్వంసమొనరించి ధర్మముసంసారము నాటినుండి సాగించ నఘాల్కంసారి యొనర్చు మనెడుహింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్శార్దూలవిక్రీడితముసంసారమ్మది భూమిపై గొనియు దుస్సాంగత్యమేపారఁగన్ ధ్వంసమ్మెంచియు పాండునందనులపై దాయాది వైరమ్మునన్హింసామార్గమునెంచ ధర్మమునె రక్షింపంగ కంసారిదౌహింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?
శా॥ కంసున్ వోలెను స్త్రీలకారడియె కల్గంగన్ జరించంగనున్ధ్యంసంబొందగ దేశసంపదలు సంధానించఁగన్ దుష్టులై సంసారమ్ములఁ గూల్చు వారలను రోషంబొంది శిక్షించఁగన్ హింసాభావమె యుత్తమోత్తమమనన్ హేయోక్తి యౌనెవ్విధిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందపద్య పూరణకం॥ హింసనుఁ బ్రేచిడి వారలధ్వంసమొనర్చుట ముదమను వారల హృదిలోసంసక్త దుష్టత తొలఁగ హింసాభావము శ్రేష్ఠమే యన నొప్పున్సంసక్త చేరినది
కం. కంసాదులు కడతేరిరి హింసోద్యోగమున హితులనేచినవారైపుంసత్వము శాంతముననె హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్(హింసాభావంబు: హింస + అభావంబు = అహింస)
ధ్వంసం బొక పరి మేలగుఁ గంసారి వధింపఁ గనమె కార్యమె యీ మీమాంస కన దుష్ట శిక్షకు హింసా భావంబు శ్రేష్ఠమే యన నొప్పున్ ధ్వంసం బైనఁ గలట్టి చుట్టఱికముల్ భద్రంబు సేకూరునే సంసారార్ణవ మందు నక్ర నిభ దుష్ట స్వాంతు లుద్వేగులై హింసా కృత్యము లెన్ని చేసినను నోర్పే మంత్ర మీక్షింపఁగా హిం సాభావమె యుత్త మోత్తమ మనన్ హేయోక్తి యౌ నెవ్విధిన్ [ హింసా + అభావము = హిం సాభావము, హింస లేమి]
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ధ్వంసము చేయుచు నాస్తులుహింసను వీడుడనె గాంధి హేయంబనుచున్హింసను మదితలచ వల దహింసా భావమ్మె శ్రేష్ఠమే యన నొప్పున్.
మాంసాహారులు ప్రాణుల
రిప్లయితొలగించండిహింసించుచు నుండ్రి మిగుల హీనాత్మకులై
సంశయములేదు నిజముగ
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
మాంసాహారులు ప్రాణుల
రిప్లయితొలగించండిహింసించుచు నుండ్రి మిగుల హీనాత్మకులై
సంశయములేదు నిజముగ
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
-
రిప్లయితొలగించండినిన్నటి మత్తేభపూరణముల యూట్యూబు
సంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయము
https://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG
-
రిప్లయితొలగించండికంసుని సంహారమ్మున్
ధ్వంసము సేయంగ కౌరవాదుల మదమున్
సంశయమేమియు లేదయొ!
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్!
జిలేబీయము
కంసుడు క్రీడల పోటీ
రిప్లయితొలగించండిసంసత్తున నుండ , వృష్ణి చంపుట గాంచన్
శంసనము జేసిరిట్టుల
"హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”
రిప్లయితొలగించండిసంసరణము తరి యాస్తుల
ధ్వంస మమాయకుల పైన వలదనె గాంధీ
హింసను, మరియును పలికె న
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్.
సంసారమ్మది సాగరమ్మని కదా సాపాటు కై కొందరీ
హింసావృత్తిని సాగుచుందురిల మీరీ రీతినిన్ బల్కగా
హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌ,? నెవ్విధిన్
హంసాత్మా యది మానినన్ దొరుకు నాహారంబు వాచింపుమా.
హింసాద్వేషములే వి
రిప్లయితొలగించండిధ్వంసపు హేతువులని విశదంబై జనులే
హింసను విడనాడినపు డ
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
కంసారాతి విశేష గీత విదుడై గాంధీ మహాత్ముండహో
హింసామార్గము వీడుడన్న పిలుపే హేరాళమై నప్డు వి
ధ్వంసంబున్ సహియింప వద్దనె గదా తాజెప్పు సత్యవ్రతా
హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్
కంసుని క్రౌర్యములకు వి
రిప్లయితొలగించండిధ్వంసములకు చరమగీతి పాడగ వానిన్
హింసించె బాలకృష్ణుఁడు
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
హింసావాద మనర్ధకారకము గర్హింపందగున్ లేనిచో
రిప్లయితొలగించండిధ్వంసంబుం బొనరించు లోకమున సర్వంబున్ సమూలంబుగా
హింసింపందగు నుగ్రవాదమును సంక్షేపించగా నత్తరిన్
హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?
కందం
రిప్లయితొలగించండిధ్వంసమొనరించి ధర్మము
సంసారము నాటినుండి సాగించ నఘాల్
కంసారి యొనర్చు మనెడు
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
శార్దూలవిక్రీడితము
సంసారమ్మది భూమిపై గొనియు దుస్సాంగత్యమేపారఁగన్
ధ్వంసమ్మెంచియు పాండునందనులపై దాయాది వైరమ్మునన్
హింసామార్గమునెంచ ధర్మమునె రక్షింపంగ కంసారిదౌ
హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?
శా॥ కంసున్ వోలెను స్త్రీలకారడియె కల్గంగన్ జరించంగనున్
రిప్లయితొలగించండిధ్యంసంబొందగ దేశసంపదలు సంధానించఁగన్ దుష్టులై
సంసారమ్ములఁ గూల్చు వారలను రోషంబొంది శిక్షించఁగన్
హింసాభావమె యుత్తమోత్తమమనన్ హేయోక్తి యౌనెవ్విధిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందపద్య పూరణ
తొలగించండికం॥ హింసనుఁ బ్రేచిడి వారల
ధ్వంసమొనర్చుట ముదమను వారల హృదిలో
సంసక్త దుష్టత తొలఁగ
హింసాభావము శ్రేష్ఠమే యన నొప్పున్
సంసక్త చేరినది
కం. కంసాదులు కడతేరిరి
తొలగించండిహింసోద్యోగమున హితులనేచినవారై
పుంసత్వము శాంతముననె
హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
(హింసాభావంబు: హింస + అభావంబు = అహింస)
ధ్వంసం బొక పరి మేలగుఁ
రిప్లయితొలగించండిగంసారి వధింపఁ గనమె కార్యమె యీ మీ
మాంస కన దుష్ట శిక్షకు
హింసా భావంబు శ్రేష్ఠమే యన నొప్పున్
ధ్వంసం బైనఁ గలట్టి చుట్టఱికముల్ భద్రంబు సేకూరునే
సంసారార్ణవ మందు నక్ర నిభ దుష్ట స్వాంతు లుద్వేగులై
హింసా కృత్యము లెన్ని చేసినను నోర్పే మంత్ర మీక్షింపఁగా
హిం సాభావమె యుత్త మోత్తమ మనన్ హేయోక్తి యౌ నెవ్విధిన్
[ హింసా + అభావము = హిం సాభావము, హింస లేమి]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ధ్వంసము చేయుచు నాస్తులు
హింసను వీడుడనె గాంధి హేయంబనుచున్
హింసను మదితలచ వల ద
హింసా భావమ్మె శ్రేష్ఠమే యన నొప్పున్.