11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5587

12-9-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”

(లేదా...)

“హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్”

(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

  1. మాంసాహారులు ప్రాణుల
    హింసించుచు నుండ్రి మిగుల హీనాత్మకులై
    సంశయములేదు నిజముగ
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”

    రిప్లయితొలగించండి
  2. మాంసాహారులు ప్రాణుల
    హింసించుచు నుండ్రి మిగుల హీనాత్మకులై
    సంశయములేదు నిజముగ
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”

    రిప్లయితొలగించండి
  3. -
    నిన్నటి మత్తేభపూరణముల యూట్యూబు
    సంగీతరూపకము స్వరకల్పన - జిలేబీయము

    https://youtu.be/nKmoZRD2DAI?si=pPkeSDjBYPbEP7AG



    రిప్లయితొలగించండి
  4. -
    కంసుని సంహారమ్మున్
    ధ్వంసము సేయంగ కౌరవాదుల మదమున్
    సంశయమేమియు లేదయొ!
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్!


    జిలేబీయము


    రిప్లయితొలగించండి
  5. కంసుడు క్రీడల పోటీ
    సంసత్తున నుండ , వృష్ణి చంపుట గాంచన్
    శంసనము జేసిరిట్టుల
    "హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్”

    రిప్లయితొలగించండి

  6. సంసరణము తరి యాస్తుల
    ధ్వంస మమాయకుల పైన వలదనె గాంధీ
    హింసను, మరియును పలికె న
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్.


    సంసారమ్మది సాగరమ్మని కదా సాపాటు కై కొందరీ
    హింసావృత్తిని సాగుచుందురిల మీరీ రీతినిన్ బల్కగా
    హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌ,? నెవ్విధిన్
    హంసాత్మా యది మానినన్ దొరుకు నాహారంబు వాచింపుమా.

    రిప్లయితొలగించండి
  7. హింసాద్వేషములే వి
    ధ్వంసపు హేతువులని విశదంబై జనులే
    హింసను విడనాడినపు డ
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్

    కంసారాతి విశేష గీత విదుడై గాంధీ మహాత్ముండహో
    హింసామార్గము వీడుడన్న పిలుపే హేరాళమై నప్డు వి
    ధ్వంసంబున్ సహియింప వద్దనె గదా తాజెప్పు సత్యవ్రతా
    హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  8. కంసుని క్రౌర్యములకు వి
    ధ్వంసములకు చరమగీతి పాడగ వానిన్
    హింసించె బాలకృష్ణుఁడు
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్

    రిప్లయితొలగించండి
  9. హింసావాద మనర్ధకారకము గర్హింపందగున్ లేనిచో
    ధ్వంసంబుం బొనరించు లోకమున సర్వంబున్ సమూలంబుగా
    హింసింపందగు నుగ్రవాదమును సంక్షేపించగా నత్తరిన్
    హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
  10. కందం
    ధ్వంసమొనరించి ధర్మము
    సంసారము నాటినుండి సాగించ నఘాల్
    కంసారి యొనర్చు మనెడు
    హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్

    శార్దూలవిక్రీడితము
    సంసారమ్మది భూమిపై గొనియు దుస్సాంగత్యమేపారఁగన్
    ధ్వంసమ్మెంచియు పాండునందనులపై దాయాది వైరమ్మునన్
    హింసామార్గమునెంచ ధర్మమునె రక్షింపంగ కంసారిదౌ
    హింసాభావమె యుత్తమోత్తమ మనన్ హేయోక్తి యౌనెవ్విధిన్?

    రిప్లయితొలగించండి
  11. శా॥ కంసున్ వోలెను స్త్రీలకారడియె కల్గంగన్ జరించంగనున్
    ధ్యంసంబొందగ దేశసంపదలు సంధానించఁగన్ దుష్టులై
    సంసారమ్ములఁ గూల్చు వారలను రోషంబొంది శిక్షించఁగన్
    హింసాభావమె యుత్తమోత్తమమనన్ హేయోక్తి యౌనెవ్విధిన్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. కందపద్య పూరణ

      కం॥ హింసనుఁ బ్రేచిడి వారల
      ధ్వంసమొనర్చుట ముదమను వారల హృదిలో
      సంసక్త దుష్టత తొలఁగ
      హింసాభావము శ్రేష్ఠమే యన నొప్పున్

      సంసక్త చేరినది

      తొలగించండి
    2. కం. కంసాదులు కడతేరిరి
      హింసోద్యోగమున హితులనేచినవారై
      పుంసత్వము శాంతముననె
      హింసాభావంబు శ్రేష్ఠమే యన నొప్పున్

      (హింసాభావంబు: హింస + అభావంబు = అహింస)

      తొలగించండి
  13. ధ్వంసం బొక పరి మేలగుఁ
    గంసారి వధింపఁ గనమె కార్యమె యీ మీ
    మాంస కన దుష్ట శిక్షకు
    హింసా భావంబు శ్రేష్ఠమే యన నొప్పున్


    ధ్వంసం బైనఁ గలట్టి చుట్టఱికముల్ భద్రంబు సేకూరునే
    సంసారార్ణవ మందు నక్ర నిభ దుష్ట స్వాంతు లుద్వేగులై
    హింసా కృత్యము లెన్ని చేసినను నోర్పే మంత్ర మీక్షింపఁగా
    హిం సాభావమె యుత్త మోత్తమ మనన్ హేయోక్తి యౌ నెవ్విధిన్

    [ హింసా + అభావము = హిం సాభావము, హింస లేమి]

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ధ్వంసము చేయుచు నాస్తులు
    హింసను వీడుడనె గాంధి హేయంబనుచున్
    హింసను మదితలచ వల ద
    హింసా భావమ్మె శ్రేష్ఠమే యన నొప్పున్.

    రిప్లయితొలగించండి