15-9-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ”
(లేదా...)
“లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!”
(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)
కందంతేలికగు గడ్డిపోచనుబాలుడు సైతమ్ము త్రుంచు, బంధించుఁ గరిన్మేలుగ త్రాడై నాలుగు! నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ! మత్తేభవిక్రీడితముఅఘముల్ సేయగ గడ్డిపోచపయి తానందన్ సునాయాసమైలఘువై తోచును గాని, నాల్గు కలువన్ రాణించెడున్ ద్రాడుగన్మఘవద్దంతిని సైతమున్ నిలుపదే! మర్మంబు నాలించుమా! లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
విఘటించున్ గతి యిచ్చవచ్చినటులన్ వీక్షింపకన్ ఛందమున్లఘువుల్ గుర్వులఁ గూర్చి పద్దియములన్ వ్రాయంగ, నేరీతిగాలఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!లఘుసూత్రంబులనైన నేర్వగను మేలౌ వ్రాయ పద్యమ్ములన్
నాలుగు లఘువుల గలుపగవీలుగ రెండగు గురువులు వివరింపంగాయేలాగున ననుకొంటివినాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ?
నాలుక యదుపును దప్పిన వీలుగ లఘువగు చరపులు పెట్టుచు నుండన్ ఆలి పలుకులను కాదననాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ”
ఏలనొ యైదు లఘువులట స్ఖాలిత్యమ్మచట కాదె కనుమని చెప్పెన్ బాలుడు 'జలనిధిలో ' యన నాలుగు లఘువులు గురువగు, నయముగ సుకవీ.రఘు రాముండను పండితుం డొకడటన్ బ్రార్థింపగా చెప్పితిన్ లఘువంచన్నను హ్రస్వ రూపమని శైలాటమ్మునే గాంచ నెం త ఘనం బైనను గడ్డి పోచలవియే తాడౌచు బంధింప వే లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!.
కాలము దొరల్చ నీవేబాలల బడిని నెలకొల్ప భావించినచోచాలును శిష్యగణంబుననాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీదుఘటంబైనది కాని కార్యమయినన్ దుస్సాధ్యమౌ నెట్లనన్రఘువంశాకుర మైన వానికయినన్ రాజ్యాధికారంబహోవిఘటించెన్ గద ప్రాప్తమంచు గురువే పేర్కొన్న వేళన్ భళా!లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ![లఘువు = చేవలేనిది; గురువు = శిక్షకుడు]చేవలేని నలుగురి అల్పుల్ని చేర్చుకొంటే ఏవరైనా గురువౌతారు అని భావం
కందం
రిప్లయితొలగించండితేలికగు గడ్డిపోచను
బాలుడు సైతమ్ము త్రుంచు, బంధించుఁ గరిన్
మేలుగ త్రాడై నాలుగు!
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ!
మత్తేభవిక్రీడితము
అఘముల్ సేయగ గడ్డిపోచపయి తానందన్ సునాయాసమై
లఘువై తోచును గాని, నాల్గు కలువన్ రాణించెడున్ ద్రాడుగన్
మఘవద్దంతిని సైతమున్ నిలుపదే! మర్మంబు నాలించుమా!
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
విఘటించున్ గతి యిచ్చవచ్చినటులన్ వీక్షింపకన్ ఛందమున్
రిప్లయితొలగించండిలఘువుల్ గుర్వులఁ గూర్చి పద్దియములన్ వ్రాయంగ, నేరీతిగా
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
లఘుసూత్రంబులనైన నేర్వగను మేలౌ వ్రాయ పద్యమ్ములన్
నాలుగు లఘువుల గలుపగ
రిప్లయితొలగించండివీలుగ రెండగు గురువులు వివరింపంగా
యేలాగున ననుకొంటివి
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ?
నాలుక యదుపును దప్పిన
రిప్లయితొలగించండివీలుగ లఘువగు చరపులు పెట్టుచు నుండన్
ఆలి పలుకులను కాదన
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ”
రిప్లయితొలగించండిఏలనొ యైదు లఘువులట
స్ఖాలిత్యమ్మచట కాదె కనుమని చెప్పెన్
బాలుడు 'జలనిధిలో ' యన
నాలుగు లఘువులు గురువగు, నయముగ సుకవీ.
రఘు రాముండను పండితుం డొకడటన్ బ్రార్థింపగా చెప్పితిన్
లఘువంచన్నను హ్రస్వ రూపమని శైలాటమ్మునే గాంచ నెం
త ఘనం బైనను గడ్డి పోచలవియే తాడౌచు బంధింప వే
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!.
కాలము దొరల్చ నీవే
రిప్లయితొలగించండిబాలల బడిని నెలకొల్ప భావించినచో
చాలును శిష్యగణంబున
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ
దుఘటంబైనది కాని కార్యమయినన్ దుస్సాధ్యమౌ నెట్లనన్
రఘువంశాకుర మైన వానికయినన్ రాజ్యాధికారంబహో
విఘటించెన్ గద ప్రాప్తమంచు గురువే పేర్కొన్న వేళన్ భళా!
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
[లఘువు = చేవలేనిది; గురువు = శిక్షకుడు]
చేవలేని నలుగురి అల్పుల్ని చేర్చుకొంటే ఏవరైనా గురువౌతారు అని భావం