కం:తేలిక నా కాశు వనుచు గా లిడితివి కందమందు"కరివరదా!" యం చీ లీల నాగ నాశువె? నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ” (నాకు ఆశువు చాలా తేలిక అని కవి గారు "కరివరదా" అని ఆగిపోయాడు.ఇట్లా చెపితే ఆశువు అయ్యిందా? నాలుగు లఘువులు, గురువు తప్ప ఏమీ కాదని శ్రోత ఆక్షేపించాడు.)
మ॥ లఘువుల్ నాలుగు లేక రెండు గురువుల్ రాజిల్లుఁ గందమ్మునన్ విఘటించంగను గూర్చి పల్కెనొకొ భావించంగఁ బద్యమ్ములే అఘమల్ చేసెడి జ్ఞాన హీనుఁడగు నాహా తప్పునీ రీతిగన్ లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ
(4 లఘువులు కాని 8,16 గణములు మినహా 2 రెండు గురువులు కాని 6,14 గణములు మినహా కంద పద్యానికి అనువండి. అలా కాకుండా 4 లఘువులు ఒక గురువనుకుంటే పద్యము చెడిపోతుంది)
(ఇది సామాన్యంగా జరిగేదేనండి. ముఖ్యంగా కళాశాలలో కొంత సిలబస్ విద్యార్థులకు సెమినార్ల క్రింద ఇస్తారు. మరీ పెద్ద తరగతులలో గురువు చూచాయగా చెప్పి లైబ్రరీ కెళ్ళి చదువుకోమంటారు)
కందం
రిప్లయితొలగించండితేలికగు గడ్డిపోచను
బాలుడు సైతమ్ము త్రుంచు, బంధించుఁ గరిన్
మేలుగ త్రాడై నాలుగు!
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ!
మత్తేభవిక్రీడితము
అఘముల్ సేయగ గడ్డిపోచపయి తానందన్ సునాయాసమై
లఘువై తోచును గాని, నాల్గు కలువన్ రాణించెడున్ ద్రాడుగన్
మఘవద్దంతిని సైతమున్ నిలుపదే! మర్మంబు నాలించుమా!
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
విఘటించున్ గతి యిచ్చవచ్చినటులన్ వీక్షింపకన్ ఛందమున్
రిప్లయితొలగించండిలఘువుల్ గుర్వులఁ గూర్చి పద్దియములన్ వ్రాయంగ, నేరీతిగా
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
లఘుసూత్రంబులనైన నేర్వగను మేలౌ వ్రాయ పద్యమ్ములన్
వీక్షింపకే ఛందమున్
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాలుక యదుపును దప్పిన
రిప్లయితొలగించండివీలుగ లఘువగు చరపులు పెట్టుచు నుండన్
ఆలి పలుకులను కాదన
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ”
రిప్లయితొలగించండిఏలనొ యైదు లఘువులట
స్ఖాలిత్యమ్మచట కాదె కనుమని చెప్పెన్
బాలుడు 'జలనిధిలో ' యన
నాలుగు లఘువులు గురువగు, నయముగ సుకవీ.
రఘు రాముండను పండితుం డొకడటన్ బ్రార్థింపగా చెప్పితిన్
లఘువంచన్నను హ్రస్వ రూపమని శైలాటమ్మునే గాంచ నెం
త ఘనం బైనను గడ్డి పోచలవియే తాడౌచు బంధింప వే
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!.
కాలము దొరల్చ నీవే
రిప్లయితొలగించండిబాలల బడిని నెలకొల్ప భావించినచో
చాలును శిష్యగణంబున
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ
దుఘటంబైనది కాని కార్యమయినన్ దుస్సాధ్యమౌ నెట్లనన్
రఘువంశాకుర మైన వానికయినన్ రాజ్యాధికారంబహో
విఘటించెన్ గద ప్రాప్తమంచు గురువే పేర్కొన్న వేళన్ భళా!
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!
[లఘువు = చేవలేనిది; గురువు = శిక్షకుడు]
చేవలేని నలుగురి అల్పుల్ని చేర్చుకొంటే ఏవరైనా గురువౌతారు అని భావం
కం:తేలిక నా కాశు వనుచు
రిప్లయితొలగించండిగా లిడితివి కందమందు"కరివరదా!" యం
చీ లీల నాగ నాశువె?
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ”
(నాకు ఆశువు చాలా తేలిక అని కవి గారు "కరివరదా" అని ఆగిపోయాడు.ఇట్లా చెపితే ఆశువు అయ్యిందా? నాలుగు లఘువులు, గురువు తప్ప ఏమీ కాదని శ్రోత ఆక్షేపించాడు.)
మ.వి:అఘముల్ జేయకు ! ప్రేమ జూపుటయె నీ కానందమౌ! బుద్ధిలో
రిప్లయితొలగించండిలఘుతన్ వీడుము, గుర్వులం చెవరి మ్రోలన్ జేర కవ్వారి బో
ధ ఘనమ్మే!ఘన మంచు వారలకు చెంతన్ మూర్ఖులై,మ్రొక్కుచున్
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ!”
(ఈ గురువు లంతా గొప్ప అనుకోకు.నలుగురు మూర్ఖు లైన లఘువులు అనగా అల్పులు పక్కన చేరే సరికి వారు గురువు లౌతున్నారు అని.)
మ॥ లఘువుల్ నాలుగు లేక రెండు గురువుల్ రాజిల్లుఁ గందమ్మునన్
రిప్లయితొలగించండివిఘటించంగను గూర్చి పల్కెనొకొ భావించంగఁ బద్యమ్ములే
అఘమల్ చేసెడి జ్ఞాన హీనుఁడగు నాహా తప్పునీ రీతిగన్
లఘువుల్ నాలుగు చేరగా గురువగున్ లక్షింపఁగా సత్కవీ
(4 లఘువులు కాని 8,16 గణములు మినహా 2 రెండు గురువులు కాని 6,14 గణములు మినహా కంద పద్యానికి అనువండి. అలా కాకుండా 4 లఘువులు ఒక గురువనుకుంటే పద్యము చెడిపోతుంది)
కం॥ శాలను గురువులు లేకయె
తొలగించండిమేలగు ఛాత్రులకొసఁగఁగ మేటిగఁ గరపన్
దాలిమినిఁ బఠించి కనఁగ
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ!
లఘువులు శిష్యులు. శాల పాఠశాల
(ఇది సామాన్యంగా జరిగేదేనండి. ముఖ్యంగా కళాశాలలో కొంత సిలబస్ విద్యార్థులకు సెమినార్ల క్రింద ఇస్తారు. మరీ పెద్ద తరగతులలో గురువు చూచాయగా చెప్పి లైబ్రరీ కెళ్ళి చదువుకోమంటారు)
నాలుగు లఘువుల గలుపగ
రిప్లయితొలగించండివీలుగ రెండగు గురువులు వివరింపంగా
నేలాగున ననుకొంటివి
నాలుగు లఘువులు గురువగు నయముగ సుకవీ?
కాలానుగుణమె యున్నది
రిప్లయితొలగించండిమేలుగఁ బద్యార్థ మెల్ల మించి చెలంగెం
జా లంచును నర సేసిన
నాలుగు లఘువులు గురు వగు నయముగ సుకవీ
విఘటించెం గద నీ ప్రయత్నములహో వీక్షింప నిచ్చోట విం
త ఘనుండంచు నుతింతు రెల్లరు నసత్యం బయ్యె నా ఖ్యాతియే
యఘటింపంగ నటన్ గణమ్ములను నేకైకమ్ము పూరింపఁగా
లఘువే కావలెఁ బద్య పాదమును నిర్లక్ష్యమ్ము నందక్కటా
లఘువుల్ నాలుగు చేరఁగా గురు వగున్ లక్షింపఁగా సత్కవీ!
[గురు వగు = బరు వగును]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
చాలును 'నల'ముకు గణములు
నాలుగు లఘువులు; గురువగు నయముగ
సుకవీ
వీలుగ దీర్ఘాక్షరములు
నాలుగు కలిసిన 'గల మగణము'లగు సుకవీ!