19-10-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు”
(లేదా...)
“పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా”
(న.చ. సాహిత్ శతావధానంలో హట్టి భానుమతి గారి సమస్య)
తేటగీతి మూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగనిపుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచిమాంస నైవేద్యమందించి మైమఱపునపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!మత్తకోకిలనైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగాసాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతోపూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పరమమును తనపయి దయ పరచమనుచు పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ; అటులనె పురజనుల కోర్కెలలవరించ బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!గరిక నర్పించి శ్రద్ధతో గజముఖుండాసన్నుతింతును సతతము సాకుమయ్యకినుక పూనకు నాయెడ కేలుమోడ్తు
సింధు జలమది చేపలుచ్ఛిష్ట మనుచు తగదు పూజకన్న నిక మాధవిని గోరి పుష్పకీటములవియేను ముట్ట నట్టి పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.వాజమయ్యది చేప లెంగిలి వాడకూడ దటంచు నీ పూజనీయులు పల్కినంతట పుష్ప కీటము తేనెపై మోజుతోడను వ్రాలనట్టివి మూర్ఖుడా కడు పూతమౌ పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా.
రాజ గృహమందు పండుగ రమ్యమనగభృత్యులెల్లరు పూలకై వేగిరపడిమోజుగా గొని వచ్చిరా రాజు కడకుపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవురాజరాజు నివాసమందున రమ్యమైనది పండుగేసాజ మేమరి భృత్యులందరు సత్వరంబున సాగిరేమోజు తీరగ రాజ్యమందలి పూవులన్నియుఁ దెచ్చిరేపూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
తేటగీతి
రిప్లయితొలగించండిమూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగని
పుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచి
మాంస నైవేద్యమందించి మైమఱపున
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!
మత్తకోకిల
నైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగా
సాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై
రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతో
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమమును తనపయి దయ పరచమనుచు
రిప్లయితొలగించండిపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ;
అటులనె పురజనుల కోర్కెలలవరించ
బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు
రిప్లయితొలగించండిపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!
గరిక నర్పించి శ్రద్ధతో గజముఖుండా
సన్నుతింతును సతతము సాకుమయ్య
కినుక పూనకు నాయెడ కేలుమోడ్తు
రిప్లయితొలగించండిసింధు జలమది చేపలుచ్ఛిష్ట మనుచు
తగదు పూజకన్న నిక మాధవిని గోరి
పుష్పకీటములవియేను ముట్ట నట్టి
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.
వాజమయ్యది చేప లెంగిలి వాడకూడ దటంచు నీ
పూజనీయులు పల్కినంతట పుష్ప కీటము తేనెపై
మోజుతోడను వ్రాలనట్టివి మూర్ఖుడా కడు పూతమౌ
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజ గృహమందు పండుగ రమ్యమనగ
తొలగించండిభృత్యులెల్లరు పూలకై వేగిరపడి
మోజుగా గొని వచ్చిరా రాజు కడకు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు
రాజరాజు నివాసమందున రమ్యమైనది పండుగే
సాజ మేమరి భృత్యులందరు సత్వరంబున సాగిరే
మోజు తీరగ రాజ్యమందలి పూవులన్నియుఁ దెచ్చిరే
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా