21-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్”
(లేదా...)
“ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్”
(న.చ. సాహిత్ శతావధానంలో బీరం నాగేశ్వర రావు గారి సమస్య)
బర్మా దేశము నందున నర్మటుడయి వచ్ఛినట్టి నటకుడు నాకున్కర్మానుసార మమరినధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
కందముమర్మజ్ఞుడు శ్రీరాముడుశర్మంబిడు సకల జనుల సాకును భూమిన్ దుర్మార్గుడు రావణుఁడాధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?శార్దూలవిక్రీడితముమర్మజ్ఞుండగు రామచంద్రుఁడు భువిన్ మాన్యుండుగా నిల్వగన్శర్మంబున్ బ్రజలంద నేలికగఁ దా సాకెన్ గదా దైవమై!దుర్మార్గుండగు రావణున్ దునిమె విద్రోహమ్ములన్ జేయగన్,ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే? తానొప్పుఁ బాలింపఁగన్!
శార్దూలము:ధర్మాధర్మ మెఱింగి పాలితుఁడు శ్రద్ధావంతుఁడై నిచ్చలున్మర్మంబేమియు లేక యేలవలె సన్మార్గమ్మునన్ లోకులన్ధర్మమ్మున్ విడనాడి డుండుకునిగా తానున్న నేరీతిగాధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్?
బర్మా దేశము నందున
రిప్లయితొలగించండినర్మటుడయి వచ్ఛినట్టి నటకుడు నాకున్
కర్మానుసార మమరిన
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
కందము
రిప్లయితొలగించండిమర్మజ్ఞుడు శ్రీరాముడు
శర్మంబిడు సకల జనుల సాకును భూమిన్
దుర్మార్గుడు రావణుఁడా
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
శార్దూలవిక్రీడితము
మర్మజ్ఞుండగు రామచంద్రుఁడు భువిన్ మాన్యుండుగా నిల్వగన్
శర్మంబున్ బ్రజలంద నేలికగఁ దా సాకెన్ గదా దైవమై!
దుర్మార్గుండగు రావణున్ దునిమె విద్రోహమ్ములన్ జేయగన్,
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే? తానొప్పుఁ బాలింపఁగన్!
శార్దూలము:
రిప్లయితొలగించండిధర్మాధర్మ మెఱింగి పాలితుఁడు శ్రద్ధావంతుఁడై నిచ్చలున్
మర్మంబేమియు లేక యేలవలె సన్మార్గమ్మునన్ లోకులన్
ధర్మమ్మున్ విడనాడి డుండుకునిగా తానున్న నేరీతిగా
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్?