23-11-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్”
(లేదా...)
“కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ”
(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)
సవినయముగ గురుసన్నిధివివరించిన నీతి ధర్మ విషయములెల్లన్చెవియొగ్గి వినియు మారియుఅవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్”
కందంస్తవనీయుండగు వేమనభువి వేశ్యాలోలుఁడైనపో నీతికి నాట వెలదులఁ బంచ గతమున నవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్మత్తేభవిక్రీడితము అలరారెన్ స్తవనీయ యోగియగుచున్ వేశ్యానురాగంబునన్,వెలసెన్ వేమన నీతి నాటవెలదిన్ వేనోళ్ళు కీర్తింపఁగన్,గలవిట్లెన్నియొ స్ఫూర్తినింపు చరితల్, గర్వించు వాల్మీకికిన్,గల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ.
కందం:శివపాడులో నివాసముశవభసితమ్మౌను మేని చర్చనము, సదాశివుఁ డాతఁడు బేసి కనులుఅవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్శివపాడు=శ్మశానము; చర్చనము=మైపూతచంపకమాల:సలిలము నారగించును శ్మశానమునన్ వసియించునెప్డు హాహలమును కంఠమందు, జటలందున గంగనుదాల్చు, భస్మమున్కలిలముపైన చర్చనముగా ధరియించును, బేసి కన్నులేకల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ(కలిలము=శరీరము)
-గవతము పైడియు నొక్కటెసవతు సవతు నన్నియున్ను శర్వుని గొనబేచవిచూడగ వేదాంతంబవలక్షణసహితుడయ్యు నారాధ్యుడగున్
*(శిశు పాలుని అంతర్మథనము గా........)*నివసనముల గిలుబాడె, శి శువనుచు స్తన్య మిడు వేళ సుదతిని గూల్చెన్ నవనీతము లంకించెడి యవలక్షణసహితుఁడయ్యు , నారాధ్యుఁడగున్.ఎలమిని జూపి స్తన్యమిడె డింతిని యంతము జేసె గాదె, త క్కలి గొనె మంథజమ్మవద గాకుల గూడుచు, స్నానమాడెడు గ్మలుల పినద్దముల్ సడిపె మన్ని గొనెన్ గద మేన మామ నే కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను, పూజనీయుఁడౌ.
దివిజులు మెచ్చె డి రీతిగనవతకు నాందీ పలుకుచు నై జ ము నందు న్ భువిలో మంచి గ మెలిగెడు నవ లక్షణ సహితు డ య్యు నారాధ్యు డ గున్
నవకవుల వ్రాత లన్నిటిసవరించ దలచుచు వారు నమకూర్చెడిన్కవితలన దప్పు దెలిపేయవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్
రిప్లయితొలగించండిసవినయముగ గురుసన్నిధి
వివరించిన నీతి ధర్మ విషయములెల్లన్
చెవియొగ్గి వినియు మారియు
అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్”
కందం
రిప్లయితొలగించండిస్తవనీయుండగు వేమన
భువి వేశ్యాలోలుఁడైనపో నీతికి నా
ట వెలదులఁ బంచ గతమున
నవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్
మత్తేభవిక్రీడితము
అలరారెన్ స్తవనీయ యోగియగుచున్ వేశ్యానురాగంబునన్,
వెలసెన్ వేమన నీతి నాటవెలదిన్ వేనోళ్ళు కీర్తింపఁగన్,
గలవిట్లెన్నియొ స్ఫూర్తినింపు చరితల్, గర్వించు వాల్మీకికిన్,
గల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ.
కందం:
రిప్లయితొలగించండిశివపాడులో నివాసము
శవభసితమ్మౌను మేని చర్చనము, సదా
శివుఁ డాతఁడు బేసి కనులు
అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్
శివపాడు=శ్మశానము; చర్చనము=మైపూత
చంపకమాల:
సలిలము నారగించును శ్మశానమునన్ వసియించునెప్డు హా
హలమును కంఠమందు, జటలందున గంగనుదాల్చు, భస్మమున్
కలిలముపైన చర్చనముగా ధరియించును, బేసి కన్నులే
కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ
(కలిలము=శరీరము)
-
రిప్లయితొలగించండిగవతము పైడియు నొక్కటె
సవతు సవతు నన్నియున్ను శర్వుని గొనబే
చవిచూడగ వేదాంతం
బవలక్షణసహితుడయ్యు నారాధ్యుడగున్
రిప్లయితొలగించండి*(శిశు పాలుని అంతర్మథనము గా........)*
నివసనముల గిలుబాడె, శి
శువనుచు స్తన్య మిడు వేళ సుదతిని గూల్చెన్
నవనీతము లంకించెడి
యవలక్షణసహితుఁడయ్యు , నారాధ్యుఁడగున్.
ఎలమిని జూపి స్తన్యమిడె డింతిని యంతము జేసె గాదె, త
క్కలి గొనె మంథజమ్మవద గాకుల గూడుచు, స్నానమాడెడు
గ్మలుల పినద్దముల్ సడిపె మన్ని గొనెన్ గద మేన మామ నే
కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను, పూజనీయుఁడౌ.
దివిజులు మెచ్చె డి రీతిగ
రిప్లయితొలగించండినవతకు నాందీ పలుకుచు నై జ ము నందు న్
భువిలో మంచి గ మెలిగెడు
నవ లక్షణ సహితు డ య్యు నారాధ్యు డ గున్
నవకవుల వ్రాత లన్నిటి
రిప్లయితొలగించండిసవరించ దలచుచు వారు నమకూర్చెడిన్
కవితలన దప్పు దెలిపే
యవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్