22, నవంబర్ 2026, ఆదివారం

సమస్య - 5659

23-11-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్”

(లేదా...)

“కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ”

(నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

7 కామెంట్‌లు:



  1. సవినయముగ గురుసన్నిధి
    వివరించిన నీతి ధర్మ విషయములెల్లన్
    చెవియొగ్గి వినియు మారియు
    అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్”

    రిప్లయితొలగించండి
  2. కందం
    స్తవనీయుండగు వేమన
    భువి వేశ్యాలోలుఁడైనపో నీతికి నా
    ట వెలదులఁ బంచ గతమున
    నవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్

    మత్తేభవిక్రీడితము
    అలరారెన్ స్తవనీయ యోగియగుచున్ వేశ్యానురాగంబునన్,
    వెలసెన్ వేమన నీతి నాటవెలదిన్ వేనోళ్ళు కీర్తింపఁగన్,
    గలవిట్లెన్నియొ స్ఫూర్తినింపు చరితల్, గర్వించు వాల్మీకికిన్,
    గల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ.

    రిప్లయితొలగించండి
  3. కందం:
    శివపాడులో నివాసము
    శవభసితమ్మౌను మేని చర్చనము, సదా
    శివుఁ డాతఁడు బేసి కనులు
    అవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్

    శివపాడు=శ్మశానము; చర్చనము=మైపూత

    చంపకమాల:
    సలిలము నారగించును శ్మశానమునన్ వసియించునెప్డు హా
    హలమును కంఠమందు, జటలందున గంగనుదాల్చు, భస్మమున్
    కలిలముపైన చర్చనముగా ధరియించును, బేసి కన్నులే
    కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను పూజనీయుఁడౌ
    (కలిలము=శరీరము)

    రిప్లయితొలగించండి
  4. -
    గవతము పైడియు నొక్కటె
    సవతు సవతు నన్నియున్ను శర్వుని గొనబే
    చవిచూడగ వేదాంతం
    బవలక్షణసహితుడయ్యు నారాధ్యుడగున్



    రిప్లయితొలగించండి

  5. *(శిశు పాలుని అంతర్మథనము గా........)*

    నివసనముల గిలుబాడె, శి
    శువనుచు స్తన్య మిడు వేళ సుదతిని గూల్చెన్
    నవనీతము లంకించెడి
    యవలక్షణసహితుఁడయ్యు , నారాధ్యుఁడగున్.



    ఎలమిని జూపి స్తన్యమిడె డింతిని యంతము జేసె గాదె, త
    క్కలి గొనె మంథజమ్మవద గాకుల గూడుచు, స్నానమాడెడు
    గ్మలుల పినద్దముల్ సడిపె మన్ని గొనెన్ గద మేన మామ నే
    కల వవలక్షణమ్ము లధికమ్ముగ నైనను, పూజనీయుఁడౌ.

    రిప్లయితొలగించండి
  6. దివిజులు మెచ్చె డి రీతిగ
    నవతకు నాందీ పలుకుచు నై జ ము నందు న్
    భువిలో మంచి గ మెలిగెడు
    నవ లక్షణ సహితు డ య్యు నారాధ్యు డ గున్

    రిప్లయితొలగించండి
  7. నవకవుల వ్రాత లన్నిటి
    సవరించ దలచుచు వారు నమకూర్చెడిన్
    కవితలన దప్పు దెలిపే
    యవలక్షణసహితుఁడయ్యు నారాధ్యుఁడగున్

    రిప్లయితొలగించండి