27, నవంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5664

28-11-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్”

(లేదా...)

“రోటనుఁ గట్టె రాఘవుని ద్రోవది మిక్కిలి కోపగించుచున్”

9 కామెంట్‌లు:

  1. నోట నొక కల్ల యనదగు
    మాట బలుకుమని చిలిపిగ మాత యడుగగా
    బోటు సుతుడు పలికె నిటుల
    'రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్

    రిప్లయితొలగించండి
  2. కందం:
    గాటపు మయికమునందున
    మాటలు తడబడగ మందమతి యిట్టులనెన్
    నోటను చూపఁగ వెన్నను
    రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    నీటుగ శ్రుతకర్మునకొక
    పూటన్ దాశరథి వేషమునిడఁ, బడచులన్
    దాటక, శూర్ఫణఖలనన్,
    రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్

    ఉత్పలమాల
    నీటుగ ద్రౌపదీలలన నెమ్మదిగా శ్రుతకర్ముఁ దీర్చఁగా
    నాటల రామమూర్తి వలె నాడుచు పాడుచు తోడి బాలికన్
    దాటక,చుప్పనాతులని తప్పుడు మాటలనిందలాడగన్
    రోటనుఁ గట్టె రాఘవుని ద్రోవది మిక్కిలి కోపగించుచున్

    (శ్రుతకర్ముడు, ఉపపాండవులలో అర్జునుని కుమారుడు)

    రిప్లయితొలగించండి
  4. మాటలు తడబడు చుండగ
    నీటుగ బ్రాందీ ని ద్రావి నిలబడ లేకన్
    ఘాటుగ పలికె నొక o డి ల
    రోటను రాఘవుని గ ట్టె ద్రోవది యలుక న్

    రిప్లయితొలగించండి

  5. పేటకు మిత్రులతో ము
    మ్మోటు జనుచు చొక్కునీరు మోదంబని తా
    నేటమెగ బోసి వాగెను
    రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్.


    బోటి యశోద పుత్రుడుగు ముద్దుల కృష్ణుని చేసె నేమిటో?
    పాటల గంధి జానకి వివాహము నాడె నెవండ నంటి నే
    తూటరి ద్రోణు నందనుని ద్రుంచుమటంచును గోరె నెవ్వరో
    రోటనుఁ గట్టె, రాఘవుని, ద్రోవది మిక్కిలి కోపగించుచున్.

    రిప్లయితొలగించండి
  6. నాటకమందభిరుచితో
    నాటకమున్ వైచి చూపినారా బుడుతల్
    నాటక మందున నగపడె
    రోటను రాఘవునిఁ గట్టె ద్రోవది యలుకన్

    నాటకమాడు బాలలకు నచ్చికమెక్కడ చూపమంచు నా
    నాటక బృందమొక్కటి సనాతన ధర్మ కథాంశమెంచుచున్
    నాటక మాడి చూపఁ గన నయ్యెను చక్కని హాస్యమందునన్
    రోటనుఁ గట్టె రాఘవుని ద్రోవది మిక్కిలి కోపగించుచున్

    రిప్లయితొలగించండి