28, నవంబర్ 2026, శనివారం

సమస్య - 5665

29-11-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాత్రి వగలు నొకటఁ దోఁచె రమ్యరీతి”

(లేదా...)

“రాతిరియున్ బవల్ భువిని రమ్యతరంబుగఁ దోఁచె నత్తఱిన్”

7 కామెంట్‌లు:

  1. క్రొత్త జంటకు మితిమీరు కోర్కె పుట్ట
    సరస సల్లాప ము ల తోడ సాగు చుండ
    కాల గమనము దెలియక గడుపు వేళ
    రాత్రి వగలు వొకట దో చె రమ్య రీతి

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    చేతనన్ గ్రమ్మి మోహమే, చేతలుడిగి
    విల్లువీడి యని నరుఁడు, విశ్వరూప
    మున రవిశశి నయనముల మురహరిఁగన
    రాత్రి వగలు నొకటఁ దోఁచె రమ్యరీతి!

    ఉత్పలమాల
    చేతనమందు మోహమది చింతను రేపగ విల్లువీడుచున్
    జేతలు శూన్యమౌ నరుని సిద్ధము సేయగఁ జక్రి, గీతలో
    నీతులు, విశ్వరూపమున నేత్రములందున సూర్యచంద్రులై
    రాతిరియున్ బవల్ భువిని రమ్యతరంబుగఁ దోఁచె నత్తఱిన్!

    రిప్లయితొలగించండి
  3. కాలమెంతొ సాగె నతని గలుసు కొనగ
    ముచ్చటలను జెప్పుకొనుట మొదలు పెట్ట
    రాత్రి వగలు నొకటఁ దోఁచె రమ్యరీతి
    తీపి గురుతుల తీరిది తెలియుమయ్య

    రిప్లయితొలగించండి
  4. (తేటగీతి సమస్యాపాదం ఉత్సాహం ఛందస్సులో)

    ఉత్సాహం.
    యాత్రికులకు గిరివలయమునందుశక్తినీయగా
    పాత్రలందుదెచ్చినారు పాకములను పుణ్యస
    త్పాత్రదానమనుచు నిండుపౌర్ణమిదినమందునా
    *రాత్రి పగలునొకటిదోచె* *రమ్యరీతి* గాగిరిన్

    (పౌర్ణమి రాత్రి
    అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తున్న భక్తులకు అన్నదానం చేస్తున్నటువంటి దృశ్యం)

    రిప్లయితొలగించండి

  5. భద్రగిరిపైన శ్రీరామ పరిణయంపు
    వేళ వేవేల దీపాలు వెలుగు చుండ
    నబ్బురపడిన కవియెతా ననియె నిటుల
    రాత్రి వగలు నొకటఁ దోఁచె రమ్యరీతి.


    నాతియె వెంటరాగ యవనారి యభిగ్రహ మందు గాము దు
    ర్జాతి మహీజునిన్ దునిమి సంకటమున్ హరియింప లోకముల్
    కౌతుకమందుచున్ విరివి కజ్జలనే వెలిగించు నత్తఱిన్
    రాతిరియున్ బవల్ భువిని రమ్యతరంబుగఁ దోఁచె నత్తఱిన్.

    రిప్లయితొలగించండి

  6. మనసు రంజిల్లగాఁజేయు మనువు కుదిరి
    పెండ్లి యాడిన వెంటనే ప్రేమయాత్ర
    మొదలు పెట్టిన జంటకు నిదుర రాక
    రాత్రి వగలు నొకటఁ దోఁచె రమ్యరీతి

    చేతము నెమ్మిసేయగల చేడియ నొక్కెడ చూచినంతటన్
    బ్రీతిగ పెండ్లియాడి తన ప్రేయసితో మధుయాత్ర సల్పగా
    జాతర కల్గజేసె కడు సౌఖ్యము భేదము కానరానిదై
    రాతిరియున్ బవల్ భువిని రమ్యతరంబుగఁ దోఁచె నత్తఱిన్

    రిప్లయితొలగించండి