31, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5230

1-9-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సడలె దంతముల్ నమలెఁ బాషాణములను”

(లేదా...)

“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”

(మృణ్మరుల్ = రాళ్ళు, పాషాణాలు)

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో క్రొవ్విడి వెంకట రాజారావు గారి సమస్య)

30, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5229

31-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రమ్ముం గొనఁ గాశికాపురముఁ జేరఁ దగున్”

(లేదా...)

“రమ్ముఁ గ్రోలఁగ వారణాసి పురంబుఁ జేరిరి పండితుల్”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)


29, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5228

30-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మాన్యులు గారందును మరుమాముల వారిన్”

(లేదా...)

“మాన్యుల కారు కారు మరుమాముల సోదరు లిద్దలిద్దరే”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో నా సమస్య. మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్తుతో, మరుమాముల వెంకటరమణ శర్మ గారు 'దర్శనం' పత్రిక ద్వారా అవధాన రంగానికి చేస్తున్న సేవ అనిరత సాధ్యం)


28, ఆగస్టు 2025, గురువారం

సమస్య - 5227

29-8-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె”

(లేదా...)

“లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో చింతా రామకృష్ణారావు గారి సమస్య)

27, ఆగస్టు 2025, బుధవారం

సమస్య - 5226

28-8-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు”

(లేదా...)

“మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా”

26, ఆగస్టు 2025, మంగళవారం

సమస్య - 5225

27-8-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మంచిద హరికథ గణేశ మండపమున”

(లేదా...)

“హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్”

25, ఆగస్టు 2025, సోమవారం

సమస్య - 5224

26-8-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”

(లేదా...)

“వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్”

24, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5223

25-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె”

(లేదా...)

“పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్”

23, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5222

24-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె”

(లేదా...)

“దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే”

22, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5221

23-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ”

(లేదా...)

“పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే”