28, ఆగస్టు 2025, గురువారం

సమస్య - 5227

29-8-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె”

(లేదా...)

“లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో చింతా రామకృష్ణారావు గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    కామ్య ఫలముపై మరియును కాయమనిన
    మదినపేక్షను వీడుటె మర్మమనిన
    పండొకటి కాయొకటి వీడి వచ్చిరనఁగ
    లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె!


    ఉత్పలమాల
    భక్ష్యము భోజ్యముల్ గురుతు వచ్చును నేర్వరు వేదబోధితా
    పేక్ష్యము లేమిటో? నరులపేక్షను కామ్యఫలమ్ము, కాయమన్
    బక్ష్యము లేక వీడుమనఁ బండును కాయను వీడితందురే
    లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్

    రిప్లయితొలగించండి

  2. పరమ శివుని దయయె లేని భక్తుడెవడు
    కాశిన నడుగిడగలేడు కల్లకాదు
    స్వామి యానతి లేకుండ స్వంతదైన
    లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె.



    భక్ష్యము లెల్లవీడి వృషపర్వుని సేవను మున్గు టొక్కటే
    లక్ష్యముగా చరించెడి పురంబున భక్తులు ముక్తి మార్గమే
    లక్ష్యపథమ్ము వీడక శరణ్యుని కొల్చుటలో గనంగ ని
    ర్లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్.

    రిప్లయితొలగించండి
  3. ఆలయపు దేవదేవుని నంటరాని
    లక్ష్య మొప్పరు కాశిలో , సాక్ష్యమిదియె
    శివుని చేతితోతాకుట సేమమనెడి
    నమ్మకమచట తప్పక నడచుచుండు

    రిప్లయితొలగించండి
  4. ఉ.
    భక్ష్యముగా తలంచి జన భాగ్యము మ్రింగిన నీకు లోన హృ
    త్సాక్ష్యము తెల్పు పాపముల సర్వము చూచును నీదు చేష్టలన్
    లక్ష్యముగా సుకార్యముల లాలితమైన విధంబు సల్పు దు
    ర్లక్ష్యము నొప్పరెవ్వరును రాజిత చిద్వర కాశికాపురిన్ !

    రిప్లయితొలగించండి
  5. దైవ దర్శన కాంక్షతో తరలి వచ్చి
    చేరు కొందురు కాశిని శివ శివ యని
    తన్మయత్వాన మునుగుట తప్ప నన్య
    లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె

    లక్ష్యము దైవదర్శనము లక్షల భక్తుల వాంఛితమ్మిదే
    సాక్ష్యము వారి సంఖ్యయని సత్వరమే వచియింప వచ్చుగా
    భక్ష్యము లెన్నియున్న భగవానుని గాంచుట పైన దృష్టి ని
    ర్లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:వానలనకయు,దూరపు భార మనక,
    వద్ది పర్తి వధానమ్ము బాయలేక
    వచ్చి రీ కవుల్,భౌతికభాగ్య మనెడు
    లక్ష్య మొప్పరు, కాశిలో సాక్ష్యమిదియె

    రిప్లయితొలగించండి
  7. సమస్య:
    *లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చి**
    *ద్వర కాశికాపురిన్*

    క.
    హరునకు సురులును పసి బా
    లురె *లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చి*
    *ద్వర కాశికాపురిన్* శం
    కరుని యనుగ్రహముతప్ప గమ్యములేమిన్

    ఇంద్రకంటి సంతోష్ కుమార్

    రిప్లయితొలగించండి
  8. భక్తి పూర్వక యాత్రతో భవుని జేరి
    మ్రొ క్కు లిదుట యె మేలౌ ను మూర్ఖు లగు చు
    నన్య కార్యాలు జేయురా దంద్రు గాదె
    లక్ష్య మొప్పరు కాశి లో సాక్ష్య మిదియ

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. కం:గర్భకవిత్వమ్మున నా
      గర్భశ్రీమంతు లయ్య!ఘనులై యే సం
      దర్భమ్ము నందునన్ కవి
      తార్భటి చింతా కవివర యలరును తమకే!


      తొలగించండి
  10. ఉ:లక్ష్యము జ్ఞానసాధనము,లక్ష్యము శంభుకృపారసమ్ము,ని
    ర్లక్ష్యము సాధుకోటి యెడలన్ బచరింపరు,జీవితమ్మునన్
    లక్ష్యము ముక్తి యే యనుచు,లౌకిక సంపదలే ప్రథాన మన్
    లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్”

    రిప్లయితొలగించండి
  11. సమస్య:
    "లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్”

    ఉ.మా :

    కక్ష్యను ద్రిప్ప భూమి లయకారుడు నీశుడె ముజ్జగంబులన్
    సాక్ష్యము గోరనేల నిక శాశ్వత ముక్తియు నీయు నాతడే
    భక్ష్యములేమి కోరడయ, భస్మపు పూతల, భిక్ష పాత్ర, నే
    "లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్”

    రిప్లయితొలగించండి
  12. మూరి చూపింతు రెల్లరు భూత దయను
    సాటి వారి కష్టమ్ములఁ జక్క దిద్ది
    పంచి యిత్తురు ప్రేమను వంచ కోప
    లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్య మిదియె


    సాక్ష్యము లేల కావలెను శంకరు భక్త జనావనక్రియా
    దాక్ష్యము నుచ్ఛరింపగను దర్శితముల్ గద సర్వ మాన వా
    వేక్ష్యము లౌను జుమ్ము శివ వేశ్మము లెందును బూజలందు ని
    ర్లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    విశ్వనాథుని దర్శించ వేడ్క నేగి
    ముక్తి మార్గము కోరుచు భక్తి తోడ
    శివుని ధ్యానించ సన్నిధి జేరు, వేరు
    లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్యమిదియె.

    రిప్లయితొలగించండి
  14. ఓం శ్రీమాత్రే నమః.

    కం. తరగని కోరికలే కో
    రుర! *లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చి
    ద్వర కాశికాపురిన్*, గా
    వర వారిని లక్ష్యముగని వరలునటులుగాన్.

    అమ్మ దయతో
    చింతా రామకృష్ణారావు.

    రిప్లయితొలగించండి