4-9-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును”
(లేదా...)
“మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)
ఉ.అచ్చపు భీమకన్యనట నర్మిలి వీడి వనంబులోనఁ దాఁ జొచ్చుచు నాగముం గరము శూర గుణంబుల చేతఁ గావగంజెచ్చెర కాటు వేసెనది చిత్రము మార్చెను గుబ్జ వోలె నా మచ్చియు మంచిదే యగును, మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్ !
స్వచ్ఛమైన వెన్నెలనిడు జాబిలికినిసకల లోకాల బ్రోచెడి శంకరునకుమచ్చ కలదందురు జనులు మహిని, కనగమచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును.మెచ్చెడి రీతి వెన్నెలను మేదిని బంచెడి పాథి కుండదే మచ్చ, శిరమ్ము గంగగల మన్మథ సంహరి కంఠ మందునన్ మచ్చను గల్గియుండెనని మాన్యులు చెప్పిరి గాదె కాంచగన్ మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్.
తేటగీతిక్షీరసాగరోద్భవమైన క్ష్వేళముఁగొనినీలకంఠుఁడై యశమొందె కాలుఁడనఁగపూని లోకహితమ్మెంచ పొందినట్టిమచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును! ఉత్పలమాలవెచ్చగఁ బొంగుచున్ గడలి క్ష్వేళము సర్వము నాక్రమింపగానిచ్చఁగొనెన్ గదా శివుఁడు నెంచుచు సేమము! నీలకంఠుఁడైపుచ్చుచు భీతినే యశము పొందెను! లోకహితాన నొందెడున్మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్!
అచ్చఁపు పుట్టుమచ్చయన నందముఁ గూర్చును మచ్చెకంటికిన్మచ్చయె కౌముదీపతికి మవ్వమునిచ్చు వియత్తలమ్మునన్చిచ్చఱకంటి కంఠమున క్ష్వేళము బ్రోచినదెల్ల లోకముల్మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
సొచ్చెమగు నగుమోముపై మచ్చయున్నమచ్చెకంటికినది కాదె మండనమ్ముచందిరునిలోని మచ్చ కన్విందొనర్చుమచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును
ఎంతటి యవగడము దనకెదురయినను వారడుగగ లేదనక యవనరముకయిపేదలకు ధనమిచ్చుట వీడడనెడిమచ్చ మంచిదె , యశమిచ్చు మాన్యులకును
ఉ.
రిప్లయితొలగించండిఅచ్చపు భీమకన్యనట నర్మిలి వీడి వనంబులోనఁ దాఁ
జొచ్చుచు నాగముం గరము శూర గుణంబుల చేతఁ గావగం
జెచ్చెర కాటు వేసెనది చిత్రము మార్చెను గుబ్జ వోలె నా
మచ్చియు మంచిదే యగును, మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్ !
రిప్లయితొలగించండిస్వచ్ఛమైన వెన్నెలనిడు జాబిలికిని
సకల లోకాల బ్రోచెడి శంకరునకు
మచ్చ కలదందురు జనులు మహిని, కనగ
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును.
మెచ్చెడి రీతి వెన్నెలను మేదిని బంచెడి పాథి కుండదే
మచ్చ, శిరమ్ము గంగగల మన్మథ సంహరి కంఠ మందునన్
మచ్చను గల్గియుండెనని మాన్యులు చెప్పిరి గాదె కాంచగన్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్.
తేటగీతి
రిప్లయితొలగించండిక్షీరసాగరోద్భవమైన క్ష్వేళముఁగొని
నీలకంఠుఁడై యశమొందె కాలుఁడనఁగ
పూని లోకహితమ్మెంచ పొందినట్టి
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును!
ఉత్పలమాల
వెచ్చగఁ బొంగుచున్ గడలి క్ష్వేళము సర్వము నాక్రమింపగా
నిచ్చఁగొనెన్ గదా శివుఁడు నెంచుచు సేమము! నీలకంఠుఁడై
పుచ్చుచు భీతినే యశము పొందెను! లోకహితాన నొందెడున్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్!
అచ్చఁపు పుట్టుమచ్చయన నందముఁ గూర్చును మచ్చెకంటికిన్
రిప్లయితొలగించండిమచ్చయె కౌముదీపతికి మవ్వమునిచ్చు వియత్తలమ్మునన్
చిచ్చఱకంటి కంఠమున క్ష్వేళము బ్రోచినదెల్ల లోకముల్
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్
సొచ్చెమగు నగుమోముపై మచ్చయున్న
రిప్లయితొలగించండిమచ్చెకంటికినది కాదె మండనమ్ము
చందిరునిలోని మచ్చ కన్విందొనర్చు
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును
ఎంతటి యవగడము దనకెదురయినను
రిప్లయితొలగించండివారడుగగ లేదనక యవనరముకయి
పేదలకు ధనమిచ్చుట వీడడనెడి
మచ్చ మంచిదె , యశమిచ్చు మాన్యులకును