2, సెప్టెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5232

3-9-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్”

(లేదా...)

“బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)


6 కామెంట్‌లు:

  1. ఉ.
    జిహ్మగభూషణుండు సని చిత్రముగా గొనె బెమ్మ శీర్షమున్
    జిహ్మగవేణిఁ జేరి తను చెన్నగు చేతిని సాచె భిక్షకై
    బ్రహ్మవిచార వర్గములు రాజిల భోజనమిచ్చెనా పర
    బ్రహ్మ, పదార్థముం గని విరాగులె యింద్రియ లోలురైరహో !

    రిప్లయితొలగించండి

  2. అహ్మదు నగరమందున
    రహ్మానును గూడి పక్వ రసముం గొని యా
    మహ్మూదు పలికె నిట్టుల
    బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్.


    బ్రహ్మయె నిత్యమంచునది వాస్తవమంచు తానటన్
    బ్రహ్మము గూర్చి వాసిగ తపమ్మొనరించెడు గాధి పుత్రుడా
    బ్రహ్మనెఱుంగ నెంచు తఱి వచ్చిన మేనక గాథ గాంచగాన్
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో.

    రిప్లయితొలగించండి
  3. కందం
    బ్రహ్మ పదార్థము దేహము
    బ్రహ్మ సృజన పంచభూత పరిపుష్టమనన్
    జిహ్మమొలుకు మగువయనన్
    బ్రహ్మ పదార్థమ్ము! విషయవాసన రేఁపున్!

    ఉత్పలమాల
    బహ్మము పంచభూతముల ప్రాథమికమ్ముగ సృష్టిఁ జేయుచున్
    బ్రహ్మ సృజించినాడనఁగ పంచక నిర్మితమే చరాచరాల్
    జిహ్మయనంగ చూపన నజిహ్మగ మట్లుగ రువ్వు భామయౌ
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో!

    రిప్లయితొలగించండి
  4. అహ్మదునకేల యిప్పుడు 
    బ్రాహ్మణ జవరాలితో వివాహము జరిగెన్ ?
    బ్రహ్మకయిన తెలియనిదా 
    బ్రహ్మ పదార్థమ్ము , విషయవాసన రేఁపున్

    రిప్లయితొలగించండి
  5. బ్రహ్మ సృజించిన మెల్తుక
    బ్రహ్మ పదార్థమననొప్పుఁ బ్రాయమునందున్
    బ్రహ్మసువే శల్యములిడఁ
    బ్రహ్మ పదార్థమ్ము విషయవాసన రేఁపున్

    జిహ్మముపైపరుండు గద జిష్ణువు వార్థిని పద్మనాభుడై
    బ్రహ్మ జనించినాడుగద పంకజ మందున దేవదేవుడై
    బ్రహ్మసువే సరమ్ములిడఁ బాధితులైరి మునీంద్రులెందరో
    బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియలోలురైరహో

    రిప్లయితొలగించండి