1-9-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సడలె దంతముల్ నమలెఁ బాషాణములను”
(లేదా...)
“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
(మృణ్మరుల్ = రాళ్ళు, పాషాణాలు)
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో క్రొవ్విడి వెంకట రాజారావు గారి సమస్య)
తేటగీతి
రిప్లయితొలగించండిభీముఁడుఁజెలఁగి రారాజు పీఁచమడఁచ
నాగ్రహించిన ధృతరాష్ట్రుడమర బొమ్మ
నుక్కు కౌగిట బంధించి తుక్కుఁజేయ
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
ఉత్పలమాల
పంతముఁ బట్టి యూరువుల వ్రయ్యలు జేయఁగ రాజరాజుకున్
బొంతన లేని రాగమున బొమ్మను బట్టియు కౌగిలించుచున్
స్వాంతము నందునన్ రగిలి వాతసుతుండని యాంబికేయుడున్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
ఉ.
రిప్లయితొలగించండిపంతము సేతఁ బ్రజ్ఞల నవారిత శక్తిఁ బ్రదర్శనంబులో
స్వాంతమునందుఁ బూనికను వర్ధిల జేయుచుఁ గీర్తికాంక్షతోఁ
జెంతఁ బ్రదర్శకుండు సని జెచ్చర వింతగఁ గాంచుచుండఁ దా
దంతములూడినన్ నమిలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్ !
సమస్య:
రిప్లయితొలగించండి“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
ఉత్పలమాల:
అంతములేని కోరికల నాకలి మీరును పెండ్లి విందులన్
సుంతయు దంత బాధ నిక సూక్ష్మము కట్టుడు దంతమేర్పడన్
సంతసమంది భక్ష్యముల సంబర మంచు భుజించెనే, స్వయం
“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
పనికి మాలిన మాటలు పలికి నంత
రిప్లయితొలగించండినిన్ను మడియడ వందురు నిజము సుమ్ము
నెవ్విధిని చెప్పగలవోయి నెవ్వనికట
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను.
వింతయదేమి కాంచగను విశ్వమునన్ గన వైద్యశాస్త్రమే
యెంతయొ వృద్ధి జెందెనన నెవ్వరు కాదన లేని సత్యమే
కాంతవయస్సు మీరగను కట్టుడు జంభములన్ భిగింపగా
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్.
2.
పొంతన లేనిమాటలవి మూఢుని వోలె వచింప బోకుమా
దంతములున్న వారలకె దార్ఢ్యపు వస్తువు బాధ పెట్టునే
వింతగ మాటలాడితివి వెఱ్ఱిని కాను కనంగ నెవ్విధిన్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్.
తెలిపిననుకూడ వినకుండ తినిన గతన
రిప్లయితొలగించండిసడలె దంతముల్ ; నమలెఁ బాషాణములను
తియ్యనగు లడ్డులనుకొని తృప్తితీర ,
తెలుసుకొని తినకుండిన తీట తీరె
వెర్రి పలురకంబులుగద వీక్షసేయ
రిప్లయితొలగించండిచిత్రమౌ చరిత నమోదు చేయ నెంచి
వింత పనులను తలపెట్టె వెర్రియొకడు
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
వింతలు వేనవేలుగద విశ్వమునే పరికించి చూడగా
పంతము పట్టి తానట ప్రపంచ చరిత్ర నమోదు చేయగా
సుంతయు జంకులేని హరి చూపె ప్రసారపు మాధ్యమాలకే
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
[హరి = మనుష్యుడు]