23-8-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ”
(లేదా...)
“పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే”
ఒక తండ్రిరోదన:తేటగీతికులము కాని వాని వలచి కోరినంతసాధ్యపడదు మనువనంగ చచ్చిపోయె!పెళ్ళిఁ జేయఁగ లేమంచు విప్పిసుతకుజెప్పినన్ బోనిదే 'పోయెఁ' జెప్పకుండ!ఉత్పలమాలనెమ్మిని పెంచినాము సుత నేర్వగ విద్యకు పంపినామహో!ద్రిమ్మరి నొక్కడిన్ వలచి తెమ్మనె వాడె వరుండు! నాకనెన్!రమ్మనకుండ ద్వారమును రయ్యున మూయుచు వాడితోడనేపొమ్మని యెంత చెప్పినను బోనిదె 'పోయె'ను జెప్పకుండనే!
మరణ కాలమ్ము రాకున్న ధరణియందుజీవులెంత యత్నించిన చావలేరుప్రాణమదిపోవు నాడింక వలదటంచుచెప్పినన్, బోనిదే పోయెఁ జెప్పకుండచెమ్మయెజేరు కన్నులవి ఛీయని వాడి దరిద్రమే గనన్ గెమ్మటలెన్నొజేసెనని గిట్టుటె మార్గమటంచు నెంచు వాడిమ్మహి వీడనెంచెకద యెన్నియొ మారులు ప్రాణమా యికన్ పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే.
రోగిని యెర గుంచ మనుచు రోగహారిపుట్టెడగదముల నొసగి , పోవుననుచుచెప్పినన్ బోనిదే , పోయెఁ జెప్పకుండనేతీ బూరెలను గుడిచి నిదురబోవ
అన్యదేశాన నివసించు నాత్మజుండు రమ్ము రమ్మని పిలిచినఁ సమ్మతింపలేదు లోలనయన సుతులెన్నిమార్లుచెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండరమ్మని వాయుమార్గమున లక్షలు వెచ్చమొనర్చి పుత్రులేపిమ్మట చీటినంపిరట పెద్దవిమానపు యాత్ర చేయగాసమ్మతి నీయకున్నతరి సంతును చూచుటకున్ బ్రయాణమైపొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే
చంద మామను బోలిన చక్క నైన వరుని తో వివాహ ము చేయ వధువు వెడల కుండ నుండగ నామెకు కోర్కె పుట్ట చెప్పి బోనిదే పోయె చెప్ప కుండ
ఒక తండ్రిరోదన:
రిప్లయితొలగించండితేటగీతి
కులము కాని వాని వలచి కోరినంత
సాధ్యపడదు మనువనంగ చచ్చిపోయె!
పెళ్ళిఁ జేయఁగ లేమంచు విప్పిసుతకు
జెప్పినన్ బోనిదే 'పోయెఁ' జెప్పకుండ!
ఉత్పలమాల
నెమ్మిని పెంచినాము సుత నేర్వగ విద్యకు పంపినామహో!
ద్రిమ్మరి నొక్కడిన్ వలచి తెమ్మనె వాడె వరుండు! నాకనెన్!
రమ్మనకుండ ద్వారమును రయ్యున మూయుచు వాడితోడనే
పొమ్మని యెంత చెప్పినను బోనిదె 'పోయె'ను జెప్పకుండనే!
రిప్లయితొలగించండిమరణ కాలమ్ము రాకున్న ధరణియందు
జీవులెంత యత్నించిన చావలేరు
ప్రాణమదిపోవు నాడింక వలదటంచు
చెప్పినన్, బోనిదే పోయెఁ జెప్పకుండ
చెమ్మయెజేరు కన్నులవి ఛీయని వాడి దరిద్రమే గనన్
గెమ్మటలెన్నొజేసెనని గిట్టుటె మార్గమటంచు నెంచు వా
డిమ్మహి వీడనెంచెకద యెన్నియొ మారులు ప్రాణమా యికన్
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే.
రోగిని యెర గుంచ మనుచు రోగహారి
రిప్లయితొలగించండిపుట్టెడగదముల నొసగి , పోవుననుచు
చెప్పినన్ బోనిదే , పోయెఁ జెప్పకుండ
నేతీ బూరెలను గుడిచి నిదురబోవ
అన్యదేశాన నివసించు నాత్మజుండు
రిప్లయితొలగించండిరమ్ము రమ్మని పిలిచినఁ సమ్మతింప
లేదు లోలనయన సుతులెన్నిమార్లు
చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ
రమ్మని వాయుమార్గమున లక్షలు వెచ్చమొనర్చి పుత్రులే
పిమ్మట చీటినంపిరట పెద్దవిమానపు యాత్ర చేయగా
సమ్మతి నీయకున్నతరి సంతును చూచుటకున్ బ్రయాణమై
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే
చంద మామను బోలిన చక్క నైన
రిప్లయితొలగించండివరుని తో వివాహ ము చేయ వధువు వెడల
కుండ నుండగ నామెకు కోర్కె పుట్ట
చెప్పి బోనిదే పోయె చెప్ప కుండ