26-8-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”
(లేదా...)
“వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్”
కందంశీఘ్రమె వనంబు దాటగజిఘ్రుడు పరుగున నడచుచు చేరి, మలుపు నందాఘ్రాణించుచు దూకఁగవ్యాఘ్రంబొక జింకనుఁ గని, పాఱె భయమునన్ఉత్పలమాలవ్యాఘ్రభయంబునన్ జనుఁడు బాటను దప్పక జాగరూకతన్శీఘ్రమె దాట నయ్యడవిఁ జేరుచు సాగెడు వేళ మల్పునన్జిఘ్రుడు భీతితో నిలచి చేష్టలు మాని క్షణంబు, దూకగన్వ్యాఘ్రమొకండు జింకఁ గని, పాఱె భయంబునఁ దా వడంకుచున్
శీఘ్రముగ నడచు చుండగ అంఘ్రికడ నొక శిలినిగని యడుగు తడబడన్ శీఘ్రముగ గెంటుట గనగవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
వ్యాఘ్రాసనమే వ్యాఘ్రమువ్యాఘ్రమనగ పిల్లి యనుచు భావన తోడన్ వ్యాఘ్రేయము గ్రోలి పలికెవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్.వ్యాఘ్రము గాంచినన్ సకల ప్రాణులు భీతిలి పారు గాదుటే శీఘ్రగతిన్ నిజమ్మిదియె శీనుడు మాత్రమె పల్కు నిట్టులన్ వ్యాఘ్రమనన్ బిడాలకమటంచు దలంచి వచించె నివ్విధిన్ వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్.
వ్యాఘ్రమెదురైన తరుణముశీఘ్రమె పరువెత్తునల్ప జీవులు, మెడలోవ్యాఘ్రనఖము గల పురుషవ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్వ్యాఘ్రము క్రూరజంతువని భద్రతకై తపియించు చుందురేశీఘ్రమె పర్వుదీయుదురు క్షేమముగాతమ యిల్లు జేరగావ్యాఘ్రనఖంబు కంఠమున భాసిల భీరుకమందు పూరుషవ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్
కందం
రిప్లయితొలగించండిశీఘ్రమె వనంబు దాటగ
జిఘ్రుడు పరుగున నడచుచు చేరి, మలుపు నం
దాఘ్రాణించుచు దూకఁగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని, పాఱె భయమునన్
ఉత్పలమాల
వ్యాఘ్రభయంబునన్ జనుఁడు బాటను దప్పక జాగరూకతన్
శీఘ్రమె దాట నయ్యడవిఁ జేరుచు సాగెడు వేళ మల్పునన్
జిఘ్రుడు భీతితో నిలచి చేష్టలు మాని క్షణంబు, దూకగన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని, పాఱె భయంబునఁ దా వడంకుచున్
శీఘ్రముగ నడచు చుండగ
రిప్లయితొలగించండిఅంఘ్రికడ నొక శిలినిగని యడుగు తడబడన్
శీఘ్రముగ గెంటుట గనగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
రిప్లయితొలగించండివ్యాఘ్రాసనమే వ్యాఘ్రము
వ్యాఘ్రమనగ పిల్లి యనుచు భావన తోడన్
వ్యాఘ్రేయము గ్రోలి పలికె
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్.
వ్యాఘ్రము గాంచినన్ సకల ప్రాణులు భీతిలి పారు గాదుటే
శీఘ్రగతిన్ నిజమ్మిదియె శీనుడు మాత్రమె పల్కు నిట్టులన్
వ్యాఘ్రమనన్ బిడాలకమటంచు దలంచి వచించె నివ్విధిన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్.
వ్యాఘ్రమెదురైన తరుణము
రిప్లయితొలగించండిశీఘ్రమె పరువెత్తునల్ప జీవులు, మెడలో
వ్యాఘ్రనఖము గల పురుష
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్
వ్యాఘ్రము క్రూరజంతువని భద్రతకై తపియించు చుందురే
శీఘ్రమె పర్వుదీయుదురు క్షేమముగాతమ యిల్లు జేరగా
వ్యాఘ్రనఖంబు కంఠమున భాసిల భీరుకమందు పూరుష
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్