ఉ:బంగరు రంగు తో వెలుగు భవ్యభవంతియె,కాని యున్నదే బంగరు బైలు లో,నటకు వచ్చెను వ్యాఘ్ర మరణ్య మందునన్ మ్రింగుడు లేక, చూడ దగు మిక్కిలి యంద మటంచు నిల్వగా బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్” (బంగారు మేడ ఉండదు.అది బంగారం రంగులో ఉంది కనుక బంగరు మేడ అనే పేరు రావచ్చు.)
ఉ:బంగరు జింక,సీత యను పాఠము జెప్పియు దాని తోడ జె ప్పంగనె యావు,పెద్దపులి పాఠము వానినె యొప్ప జెప్ప గో రంగ తురుష్క బాలకుడు రామకథన్ వినకుంట నిట్లనెన్ బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్” (బంగారు జింక కథ,ఆవు పెద్దపులి కథ రెంటినీ సరిగా చదవక రెంటినీ కలిపి ,స్వంతం కలిపి ఇలా అప్పజెప్పాడు. చదవక పోయినా రాముడి కథ కాస్తో,కూస్తో విన లేదా? అంటే వాడు తురుస్కబాలకుడు కాబట్టి ఇంట్లో కూడా విన లేదు.)
కందం
రిప్లయితొలగించండిఅంగన మెచ్చిన 'వరుఁడ' ని
కొంగున ముడివైచిపంప, కోటీశ్వరుఁడున్
బెంగపడఁగ పీడించఁగ
బంగరు మేడన్ బడఁతుక 'వ్యాఘ్రముఁ' గాంచెన్!
ఉత్పలమాల
అంగన మెచ్చెనంచుఁ గడు హాయిగ సాగును జీవితంబనన్
గొంగున గట్టుచున్ బనుప కోట్లకు సంపద గల్గునింటికిన్
బెంగపడంగ భర్త పరపీడనకామనఁ జూప దుర్గతిన్
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్!
సంగతమగ్రరాజ్యమున సారథినయ్యెనుఁ గామితార్థి ను
రిప్లయితొలగించండిప్పొంగుచు భేదభావముల ముచ్చటలాడుచు రచ్చజే సిఁదా
రంగము సృష్టిజేయగను రాజ్యము వీడిన లేడిబిల్లయై
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కం॥ రంగులు మార్చు జనుల పై
రిప్లయితొలగించండిహంగులఁ గని నమ్మఁ దగునె యాసర కఱువై
క్రుంగఁగ నాశ్రయ మొందిన
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్
ఉ॥ రంగును జూచి బుద్ధులను రావము విన్నను రూపమెంచుటన్
హంగులఁ గాంచి మానసపు హార్దము నెంచుట సాధ్యమే ధరన్
చెంగున చేరదీయుచును జేయరె దుష్టులు నీచకృత్యములన్
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
మానవ వ్యాఘ్రమండి
తొలగించండిసింగపురంబునందు నొకశిల్పికళాత్మకమైన రీతిలో
రిప్లయితొలగించండిబంగరు పూతగల్గిన భవంతినిఁ గట్టెను యా భవంతిపై
సింగము వ్యాఘ్రమున్ మరియు సింధురమున్ హవణించె, జీకటిన్
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
రంగాజీవకుడొక్కడు
రిప్లయితొలగించండిరంగుల చిత్రము లిఖించె రమ్యత తోడన్
సంగతి నెరుగనిదై తన
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్
పొంగులువారు దీమసము పోహణ కల్గిన చిత్రకారుడే
చెంగున దూకుచున్న పులి చిత్రము కుడ్యముపై లిఖించి తాఁ
రంగులు మేళవించి కడు రమ్యముగా నట రూపుదిద్దగా
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
అంగనలందరు గదలిరి
రిప్లయితొలగించండిచంగున , పట్టణపు వింత జవిగొను కొరకై ,
ఇంగమనిడు బొమ్మలుగల
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్
సింగపురమునందునగల
రిప్లయితొలగించండిబంగారు భవంతిఁ జూడ భామిని జనె నా
ప్రాంగణ శిల్పములందున
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్
అంగనకు జూప నాతడు
రిప్లయితొలగించండినింగిని చుంబించుచున్న నికయము నందున్
సింగారించి పతిమ నా
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్ృ
జంగల మందునుండు పలు జన్మిల మూర్తి నలంక రించుచున్
నింగిని ముద్దులాడువిధి నిష్కపు వర్ణము తోడ భిన్నమౌ
రంగుల తోడభాసిలెడు ప్రస్త్యమటంచు నెఱంగి తానటన్
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్.
అంగనలెల్లరున్ తలచిరచ్చటి యిండ్లను
రిప్లయితొలగించండిగాంచ గోరుచున్
చంగున గెంతుచున్ కదలె సాంతము చూచెడి కోర్కనొందుచున్
ఇంగము నిచ్చు చొప్పికల నింపుగ పేర్చిన నందమైనదౌ
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
పొంగిన నుత్సా హంబున
రిప్లయితొలగించండిబంగరు సౌ ధము ను జూడ భామిని వెడల న్
రంగుల తో చిత్రించి న
బంగరు మేడన్ బడ తుక వ్యాఘ్ర ము గాంచె న్
కం:రంగుల కలలన్ బొందుచు
రిప్లయితొలగించండిశృంగారము లొల్కు గృహము,చిర్నగవుల తో
నంగజసము బతి గోరుచు
బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్”
ఉ:బంగరు రంగు తో వెలుగు భవ్యభవంతియె,కాని యున్నదే
రిప్లయితొలగించండిబంగరు బైలు లో,నటకు వచ్చెను వ్యాఘ్ర మరణ్య మందునన్
మ్రింగుడు లేక, చూడ దగు మిక్కిలి యంద మటంచు నిల్వగా
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”
(బంగారు మేడ ఉండదు.అది బంగారం రంగులో ఉంది కనుక బంగరు మేడ అనే పేరు రావచ్చు.)
చెంగున లేడిపిల్ల వలె చిందులు వేయుచు రాకుమార్తె దా
రిప్లయితొలగించండిసంగడికత్తెలన్ గదిసి సంతసమందుచు నాడుచుండగా
రంగుగ కొందరత్తరి విలక్షణ వేషములన్ ధరింపగా
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
ఉ:బంగరు జింక,సీత యను పాఠము జెప్పియు దాని తోడ జె
రిప్లయితొలగించండిప్పంగనె యావు,పెద్దపులి పాఠము వానినె యొప్ప జెప్ప గో
రంగ తురుష్క బాలకుడు రామకథన్ వినకుంట నిట్లనెన్
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”
(బంగారు జింక కథ,ఆవు పెద్దపులి కథ రెంటినీ సరిగా చదవక రెంటినీ కలిపి ,స్వంతం కలిపి ఇలా అప్పజెప్పాడు. చదవక పోయినా రాముడి కథ కాస్తో,కూస్తో విన లేదా? అంటే వాడు తురుస్కబాలకుడు కాబట్టి ఇంట్లో కూడా విన లేదు.)
అంగలు వేయుచుఁ గంపము
రిప్లయితొలగించండినం గడు వడిఁ బాఱుచుండ నైపుణమున సా
రంగము వేటాడ నిలిచి
బంగరు మేడన్బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్
బొంగురు వోవ గొంతు కడుఁ బూరుష పుంగవుఁ డొక్కరుండు స
త్సంగము నందు నడ్డు వడి తా వచియింపఁ దొడంగ నంత వా
గ్భంగము సైపఁ జాలకను భగ్గున మండఁగఁ గోప వహ్నిలో
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రంగులతో చిత్రములను
హంగుగ కుడ్యముల పైన నలదుచు వేయన్
అంగనలు చూడ వచ్చిరి
బంగరు మేడన్ బడతుక వ్యాఘ్రముఁగాంచెన్.