4-4-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”
(లేదా...)
“యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే”
ఖ్యాతినొందిరి హిందువుల్ యజ్ఞములనుయాగములఁ జేసి, తురకలు ఖ్యాతిఁ గనిరినిష్ఠఁ జేసి నమాజును నీమముగనుమతములేవైన పయనించు మార్గమొకటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాధవకమును గ్రోలిన మత్తు తోడప్రియసఖులతోడ నివ్విధి పేలనేలబూటకమ్మది కద తెలుపుమది యెచటయాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి?రోగాలెచ్చుగ వచ్చుచుండెనన పౌరోహిత్యమున్ జేయు వాడాగోత్రాముడు హోమమొక్కటిని జేయన్ సూచనన్ జేయ నాబేగంబప్పుడు చెప్పెనిట్లు వినుమా విశ్వమ్ములో గాంచగాయాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే. (తురకలు యాగాలు చేయడం చూడమని భావం)
తేటగీతిగొప్పకార్యాలు సర్వులు కూడనగునుపలుమతమ్ముల వారలు పాల్గొనంగశిక్షిత రథచోదకులు పరోక్షరీతియాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరిశార్దూలవిక్రీడితముసాగున్ సర్వమతస్తులంకితముగన్ సత్కార్యముల్ సద్గతిన్భాగమ్మై పలువృత్తులందు మనెడున్ వారెల్ల సాగింప నాలాగున్ వాహనచోదకత్వమున వారాగన్ బరోక్షమ్ముగన్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥విరియ మతసామరస్యము విహితమరసియెన్నికలను గెలుపుఁ గని మిన్నఁ గానురాజకీయమందు వరలు మోజు యెగియ యాగములఁ జేసి తురకలు ఖ్యాతి గనిరిశా॥ భోగంబెంచిన రాజకీయమున సమ్మోదంబుతో నొప్పఁగన్యోగంబందుట గొప్ప మార్గమని సంయోగించఁగన్ సర్వులన్మ్రోగించంగను భేరి యెన్నికలకున్ మోతాదుగా నర్మిలిన్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమేఎన్నికల సమయములో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు దర్శించడం సామాన్యమని.కర్నాటకలో ఇబ్రహీం సుతార్ గారు మతసామరస్యానికి పాటుపడుతు హిందూ ధర్మము పైన చక్కని ప్రవచానాలిచ్చేవారండి. శిశునాళ షరీఫా (19వ శతాబ్ది) తత్వపదాలు దాసర భక్తి గీతాలకు తీసిపోవండి.
భేద భావాలు విడనాడి విశ్వ మందు సర్వ హితమును గోరుచు ను ర్వి జనులు సమత మమతలు పాటించి చక్క గాను యాగములు జేసి తురకలు ఖ్యాతి గనిరి
వత్సరమున రంజానను వాసరములనన్యులపయిన ద్వేషము నణచుకొనుచుధన విహీనులయెడ గడు దయగొని పలుత్యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
యజ్ఞఫలముకై జేతురు యాగములనుయాగములఁ సల్పి హింధువుల్ ఖ్యాతిఁ గనిరిచూడ మంత్రాల తంత్రాల తోడ నెచటయాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరియాగంబుల్ బొదలించు వారగుపడున్ యజ్ఞోపవీతంబుతోయాగంబుల్ సలిపేరువేదవిదులే యాగాల నిష్ణాతులైయాగంబుల్ మరి సల్పకుందు రితరుల్ యాగాల సంకల్పనల్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
రాగంబైనది వందెమాతరముగా రక్తంబుఁ జిందించుచున్భోగంబయ్యెనుదేశభక్తియనగా నూతంబు వారందరున్భాగంబందుచు సంగరంబుసలిపెన్ భావించి నొక్కొక్కైరైత్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమేకొరుప్రోలు రాధాకృష్ణరావు
ఆగంతవ్యముగా దలంచి పరమవ్యాజమ్ముగా హైందవుల్భోగాసక్తత వీడి నిశ్చలమతిన్ పూజింత్రు సర్వేశ్వరున్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి, దురకల్ ఖ్యాతిం గనం జూడమేయాగంబట్లు నమాజు సంతతము సేయంగా మహా భక్తులై(*పరము అవ్యాజమ్ముగా)
హిందువులు నమాజునుజేయు టందు గాని యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరియనుట నేగ్రంధముల యందు కనుట, వినుటగాని తరియించ రుజువేది కవివరేణ్య!
ధన్యవాదం గురువు గారు!
తే.గీ:గుడుల గూల్చియు,సంపదల్ కొల్ల గొట్టి,మతములను మార్చి,మానముల్ మంట గలిపియాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”క్రూరులని నేడు కొందరు మారినారు(ఆగములు యడాగమం తో యాగములు)
శా:యాగార్చల్ బొనరించి హిందువులు తత్త్వాపేక్ష జూపింప ,రేయోగమ్మున్ వినకుండ బైబి లొకటే యొప్పందు రీ క్రైస్తవుల్ ,యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడ, మే రోగ మ్మైనను సామ్యవాది యిక నేర్పున్ విప్లవమ్మే భళా! (హిందువులకి గొప్ప తత్త్వం ఉన్నా దాన్ని చూడక యాగాలు,పూజలు చేస్తారు.క్రైస్తవులు యోగాభ్యాసం జోలికి పోక బైబిల్ తప్ప ఇంకోటి లేదంటారు.మహమ్మదీయులు యాగాలు చెయ్యరు.ఇక కమ్యూనిస్టులు ప్రతి దానికీ విప్లవమే మందు అంటారు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఒకరి పైన నొక్కరికి సముచితముగను నిత్య మైత్రి వర్ధిలుచుండ నత్యధికము ధాత్రి లోనఁ దురుష్క సోదరు లనియెడియా గములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి [గమి = గుంపు ]పాగా లింపుగ నూని మూర్ధములపైఁ బాలింప ధర్మమ్ము స్వీయాగారంబులు వీడి కూడికొని యింపారంగ మాత్సర్య సంత్యాగస్వాంతులు నిత్య పంచక మహా దైనందినప్రార్థనా యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.విశ్వ శాంతికి ఋత్విజుల్ పేరు బడసెయాగములఁ జేసి; తురకలు ఖ్యాతిఁ గనిరికోటలను గట్టి రాజ్యముల్ కూలగొట్టివిస్తరించుచు రాజ్యమున్ విస్తృతముగ.
ఖ్యాతినొందిరి హిందువుల్ యజ్ఞములను
రిప్లయితొలగించండియాగములఁ జేసి, తురకలు ఖ్యాతిఁ గనిరి
నిష్ఠఁ జేసి నమాజును నీమముగను
మతములేవైన పయనించు మార్గమొకటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమాధవకమును గ్రోలిన మత్తు తోడ
ప్రియసఖులతోడ నివ్విధి పేలనేల
బూటకమ్మది కద తెలుపుమది యెచట
యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి?
రోగాలెచ్చుగ వచ్చుచుండెనన పౌరోహిత్యమున్ జేయు వా
డాగోత్రాముడు హోమమొక్కటిని జేయన్ సూచనన్ జేయ నా
బేగంబప్పుడు చెప్పెనిట్లు వినుమా విశ్వమ్ములో గాంచగా
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే.
(తురకలు యాగాలు చేయడం చూడమని భావం)
తేటగీతి
రిప్లయితొలగించండిగొప్పకార్యాలు సర్వులు కూడనగును
పలుమతమ్ముల వారలు పాల్గొనంగ
శిక్షిత రథచోదకులు పరోక్షరీతి
యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
శార్దూలవిక్రీడితము
సాగున్ సర్వమతస్తులంకితముగన్ సత్కార్యముల్ సద్గతిన్
భాగమ్మై పలువృత్తులందు మనెడున్ వారెల్ల సాగింప నా
లాగున్ వాహనచోదకత్వమున వారాగన్ బరోక్షమ్ముగన్
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితే॥విరియ మతసామరస్యము విహితమరసి
తొలగించండియెన్నికలను గెలుపుఁ గని మిన్నఁ గాను
రాజకీయమందు వరలు మోజు యెగియ
యాగములఁ జేసి తురకలు ఖ్యాతి గనిరి
శా॥ భోగంబెంచిన రాజకీయమున సమ్మోదంబుతో నొప్పఁగన్
యోగంబందుట గొప్ప మార్గమని సంయోగించఁగన్ సర్వులన్
మ్రోగించంగను భేరి యెన్నికలకున్ మోతాదుగా నర్మిలిన్
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
ఎన్నికల సమయములో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు దర్శించడం సామాన్యమని.
కర్నాటకలో ఇబ్రహీం సుతార్ గారు మతసామరస్యానికి పాటుపడుతు హిందూ ధర్మము పైన చక్కని ప్రవచానాలిచ్చేవారండి.
శిశునాళ షరీఫా (19వ శతాబ్ది) తత్వపదాలు దాసర భక్తి గీతాలకు తీసిపోవండి.
భేద భావాలు విడనాడి విశ్వ మందు
రిప్లయితొలగించండిసర్వ హితమును గోరుచు ను ర్వి జనులు
సమత మమతలు పాటించి చక్క గాను
యాగములు జేసి తురకలు ఖ్యాతి గనిరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివత్సరమున రంజానను వాసరముల
రిప్లయితొలగించండినన్యులపయిన ద్వేషము నణచుకొనుచు
ధన విహీనులయెడ గడు దయగొని పలు
త్యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియజ్ఞఫలముకై జేతురు యాగములను
రిప్లయితొలగించండియాగములఁ సల్పి హింధువుల్ ఖ్యాతిఁ గనిరి
చూడ మంత్రాల తంత్రాల తోడ నెచట
యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
యాగంబుల్ బొదలించు వారగుపడున్ యజ్ఞోపవీతంబుతో
యాగంబుల్ సలిపేరువేదవిదులే యాగాల నిష్ణాతులై
యాగంబుల్ మరి సల్పకుందు రితరుల్ యాగాల సంకల్పనల్
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరాగంబైనది వందెమాతరముగా రక్తంబుఁ జిందించుచున్
రిప్లయితొలగించండిభోగంబయ్యెనుదేశభక్తియనగా నూతంబు వారందరున్
భాగంబందుచు సంగరంబుసలిపెన్ భావించి నొక్కొక్కైరై
త్యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆగంతవ్యముగా దలంచి పరమవ్యాజమ్ముగా హైందవుల్
రిప్లయితొలగించండిభోగాసక్తత వీడి నిశ్చలమతిన్ పూజింత్రు సర్వేశ్వరున్
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి, దురకల్ ఖ్యాతిం గనం జూడమే
యాగంబట్లు నమాజు సంతతము సేయంగా మహా భక్తులై
(*పరము అవ్యాజమ్ముగా)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహిందువులు నమాజునుజేయు టందు గాని
రిప్లయితొలగించండియాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
యనుట నేగ్రంధముల యందు కనుట, వినుట
గాని తరియించ రుజువేది కవివరేణ్య!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండితే.గీ:గుడుల గూల్చియు,సంపదల్ కొల్ల గొట్టి,
రిప్లయితొలగించండిమతములను మార్చి,మానముల్ మంట గలిపి
యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”
క్రూరులని నేడు కొందరు మారినారు
(ఆగములు యడాగమం తో యాగములు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:యాగార్చల్ బొనరించి హిందువులు తత్త్వాపేక్ష జూపింప ,రే
రిప్లయితొలగించండియోగమ్మున్ వినకుండ బైబి లొకటే యొప్పందు రీ క్రైస్తవుల్ ,
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడ, మే
రోగ మ్మైనను సామ్యవాది యిక నేర్పున్ విప్లవమ్మే భళా!
(హిందువులకి గొప్ప తత్త్వం ఉన్నా దాన్ని చూడక యాగాలు,పూజలు చేస్తారు.క్రైస్తవులు యోగాభ్యాసం జోలికి పోక బైబిల్ తప్ప ఇంకోటి లేదంటారు.మహమ్మదీయులు యాగాలు చెయ్యరు.ఇక కమ్యూనిస్టులు ప్రతి దానికీ విప్లవమే మందు అంటారు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిఒకరి పైన నొక్కరికి సముచితముగను
రిప్లయితొలగించండినిత్య మైత్రి వర్ధిలుచుండ నత్యధికము
ధాత్రి లోనఁ దురుష్క సోదరు లనియెడి
యా గములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి
[గమి = గుంపు ]
పాగా లింపుగ నూని మూర్ధములపైఁ బాలింప ధర్మమ్ము స్వీ
యాగారంబులు వీడి కూడికొని యింపారంగ మాత్సర్య సం
త్యాగస్వాంతులు నిత్య పంచక మహా దైనందినప్రార్థనా
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విశ్వ శాంతికి ఋత్విజుల్ పేరు బడసె
యాగములఁ జేసి; తురకలు ఖ్యాతిఁ గనిరి
కోటలను గట్టి రాజ్యముల్ కూలగొట్టి
విస్తరించుచు రాజ్యమున్ విస్తృతముగ.