గురువుగ పీఠమెక్కి మరి గుంపుగ శిష్యుల సేవ లందరే గురువని యెంచిసేవలకు కొందరు పెద్దలు సిద్ధమైనచో మరువక విత్తమింతయని మాన్యులు తెల్పుట గాంచురోజులే గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్
చం:"గురుతుకు రావు మంత్రములు కోరిన యస్త్రము వేయ నాకు న చ్చెరు వగుచుండె" నంచు కడు చింతిలు కర్ణుని తోడ నీచుడౌ నరపతి శల్యు డిట్లనియె నవ్వుచు "వర్ణము దాచిపెట్టి నీ గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్?" (పరశురాముని శాపం వలన కర్ణుడు అస్త్రాలకు సమబంధించిన మంత్రాలని మర్చిపోతే నీచాతినీచు డైన శల్యుడు సానుభూతి లేక పోగా నీ గురువు దగ్గర కులం దాచటం పాపం కాదా? అని నవ్వాడు.)
పరికించి తగిన పగిది నె వరి కైనను నెన్నఁ డైన వంచించి ధను ర్ధరులకు నస్త్ర నిమిత్తము గురు పాదార్చనము సూడఁ గుత్సితము గదా
ధరణి నిపాత పుష్పములు దైవ సమర్చన కెట్టు లర్హముల్ సుర గణ పూజ నార్థము వసుంధరఁ గైకొన రాదు వర్జితా మర పద భక్తి మర్త్య నిజ మత్త కరీంద్ర సమాన సంచర ద్గురుపద పద్మ సేవనము కుత్సిత కర్మము గాక యే మగున్
[గురు పద పద్మ సేవనము = పెద్ద పాదము లందుఁ బడిన పద్మములను దండగాఁ గుట్టుట]
కందం
రిప్లయితొలగించండిమరులు గొలిపి గురుపత్నిని
వరుసలు చంద్రుండు మరచి పడసెనె సుతునిన్
బొరలిన కామాంధతతో
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా!
చంపకమాల
మరుల సుధాకరుండు గురుమానసమందున చిచ్చురేపుచున్
వరుసలు నెంచకుండ గురుపత్నిని బొందియు నందె బుద్ధునిన్
బొరలిన కామవాంఛనొగి ముచ్చట తీరఁగఁ జాటుమాటుగన్
గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్?
మరొక ప్రయత్నము:
తొలగించండికందం
కరుణను పట్టము గట్టగ
నిరతము రారాజు సేవ, నేరములెన్నో
నెఱపుచుఁ గర్ణుఁడు సేసెడుఁ
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా!
(సేసెడుఁ + కురు పాదార్చనము
=సేసెడుఁ గురు పాదార్చనము)
చంపకమాల
కరుణను పట్టమున్ దనకుఁ గట్టియు నంగకు రాజుఁ జేయఁగన్
నిరతము రాజరాజు దరి నిల్చుచు ధర్మ విరుద్ధ కృత్యముల్
నెఱపుచుఁ గర్ణుడున్ మసలి నీమములెన్నియొ మీఱి సేసెడున్
గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్?
(సేసెడున్ + కురుపదపద్మసేవనము
=సేసెడున్ గురుపదపద్మసేవనము)
కం॥ నిరతము గౌరవమొసఁగక
రిప్లయితొలగించండిగురు పౌర్ణిమ దినముననె కూరిమిఁ గనుచున్
మరువక మన్నన సేయఁగ
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా
చం॥ నిరతము పూజనీయుఁడగు నెమ్మిని విద్యల నేర్పి ఛాత్రులన్
గరుణను గాంచు నున్నతుని గౌరవ మొప్పఁగఁ జూడకన్ సదా
మరువక వ్యాస పౌర్ణిమను మన్నన సేయుట పాడి యౌనొకో
గురుపదపద్మ సేవనము గుత్సిత కర్మము గాక యేమగున్
కం॥ నిరతము గౌరవమొసఁగక
తొలగించండిగురు పౌర్ణిమ దినమునందె కూరిమిఁ గనుచున్
మరువక మన్నన సేయఁగ
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా
చం॥ నిరతము పూజనీయుఁడగు నెమ్మిని విద్యల నేర్పి ఛాత్రులన్
గరుణను గాంచు నున్నతుని గౌరవ మొప్పఁగఁ జూడకన్ సదా
మరువక వ్యాస పౌర్ణిమను మన్నన సేయుట పాడి యౌనొకో
గురుపదపద్మ సేవనము గుత్సిత కర్మము గాక యేమగున్
శ్రీ కందిశంకరయ్య గారు కందము రెండవ పాదములో సూచించిన సవరణ తరువాత ధన్యవాదములతో
నిరతము దుష్ట కర్మలను నిక్కము
రిప్లయితొలగించండిస్వార్థ హితంబుచేత పా
మరులను మోసగించుచును మాన్యత
నొందదలంచు గుర్వులన్
తరచుగ నీతి బోధలను దెల్పుచు
దప్పులు జేయు నట్టి యా
గురుపద పద్మసేవనము కుత్సిత
కర్మము గాక యేమగున్
రిప్లయితొలగించండిగురువైన నీలవసనుడు
హరితుండు సుయోధనుడట యభిమానముతో
పరికీర్తించుచు చేసిన
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా.
హరితుడు ధార్తరాష్ట్రుడు హలాయుధు డచ్చటి కేగు దెంచ ట
క్కరితనమందు నమ్రతయు గౌరవమున్ నటియించి నచ్చటన్
గిరిధరసోదరున్ మనము గెల్వగ స్వార్థము తోడ చేసిరే
గురుపదపద్మసేవనము , గుత్సితకర్మము గాక యేమగున్.
గురువన దైవంబిలలో
రిప్లయితొలగించండివరముగ సద్గురునిగొల్వ పరము లభించున్
కొరవడు విశ్వాసముతో
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువన దైవమీభువిని క్షోభములెల్లను బాపి ఛాత్రుకున్
తొలగించండియిరులను పారదోలి వెలయించు మనంబున జ్ఞాన దీప్తులన్
కొరవడి ప్రత్యయమ్ము మది కొందలపాటున స్వార్థబుద్ధితో
గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్
జరిగిన సంవత్సర తుది
రిప్లయితొలగించండిపరిక్ష యందలి జవాబు పత్రము లేల్లన్
పరిశీలనలో దోడ్పడ
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా”
గురుపీఠముపై కూర్చొని
రిప్లయితొలగించండిమరువక విత్తముఁ గ్రహించు మాన్యుల కథలే
పరికింపగ సంఘములో
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా
గురువుగ పీఠమెక్కి మరి గుంపుగ శిష్యుల సేవ లందరే
గురువని యెంచిసేవలకు కొందరు పెద్దలు సిద్ధమైనచో
మరువక విత్తమింతయని మాన్యులు తెల్పుట గాంచురోజులే
గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్
గురువుగ సరియగు పాత్రను
రిప్లయితొలగించండిదిరముగ పోషింప లేని దీ నుని ఛా త్రు ల్
మురిపము లొల్క o గ సలుపు
గురు పాడా ర్చ నము సూడ కుత్సితము గడా
కం:చిరు బురు లాడుచు పతి నా
రిప్లయితొలగించండిదరమున నెన్నడును గనక దౌష్ట్యముతో బ
ల్వు రెరుంగ,మెచ్చగా న
ల్గురు పాదార్చనము సూడఁ గుత్సితము గదా”
గురు బోధలపస లేకను
రిప్లయితొలగించండినరనరమున తలపులేక నరులను గూర్చిన్
పరమును గూర్చియు తెలుపక
గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా
చం:"గురుతుకు రావు మంత్రములు కోరిన యస్త్రము వేయ నాకు న
రిప్లయితొలగించండిచ్చెరు వగుచుండె" నంచు కడు చింతిలు కర్ణుని తోడ నీచుడౌ
నరపతి శల్యు డిట్లనియె నవ్వుచు "వర్ణము దాచిపెట్టి నీ
గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్?"
(పరశురాముని శాపం వలన కర్ణుడు అస్త్రాలకు సమబంధించిన మంత్రాలని మర్చిపోతే నీచాతినీచు డైన శల్యుడు సానుభూతి లేక పోగా నీ గురువు దగ్గర కులం దాచటం పాపం కాదా? అని నవ్వాడు.)
పరికించి తగిన పగిది నె
రిప్లయితొలగించండివరి కైనను నెన్నఁ డైన వంచించి ధను
ర్ధరులకు నస్త్ర నిమిత్తము
గురు పాదార్చనము సూడఁ గుత్సితము గదా
ధరణి నిపాత పుష్పములు దైవ సమర్చన కెట్టు లర్హముల్
సుర గణ పూజ నార్థము వసుంధరఁ గైకొన రాదు వర్జితా
మర పద భక్తి మర్త్య నిజ మత్త కరీంద్ర సమాన సంచర
ద్గురుపద పద్మ సేవనము కుత్సిత కర్మము గాక యే మగున్
[గురు పద పద్మ సేవనము = పెద్ద పాదము లందుఁ బడిన పద్మములను దండగాఁ గుట్టుట]