కం:కూడెను భాగ్యమ్ముల్ పెరి కీడున,దివి సీమ కెంతొ కీడు జరిగె నీ నాడయ్యో! సాయము పెరి కీ డొనరించిన లభించుఁ గీర్తి వసుధపై” (పెరికీడు అనే గ్రామం కృష్ణా జిల్లా లో ఉంది.మన ఊరి పరిస్థితి బానే ఉంది కదా!దివిసీమ ఉప్పెన బాధితులకి సాయం చేస్తే మన ఊరికి మంచి పే రొస్తుం దని గ్రామస్తుడు అన్నట్టు.)
ఉ:వేడుచు యాజమాన్యముల ,వీడుచు కార్మికసంఘమైత్రి నే, యూడిగ మెప్పుడున్ సలుప నోర్పని నేర్పని తోటి వారికిన్ కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును, లోకమందునన్ కూడని యిట్టి పోకడయె కూల్చును శ్రామిక వర్గ భాగ్యమున్. (ఉద్యోగులు యూనియన్ ని పట్టించుకోక మేనేజ్మెంట్ తో స్నేహం గా ఉండి చాకిరీ చేస్తుంటే తరచుగా యూనియన్ల నాయకులు ఇలాంటి భావాలు వ్యక్తం చేస్తారు.వారి దృష్టిలో ఇలా పని చేసే వాళ్లు తోటి శ్రామికులకి కీడు చేసినట్టు.)
నేడెటు జూచిన గనబడు
రిప్లయితొలగించండిపాడైపోయిన భుజించు బండాలములన్
వాడల నమ్మెడు వారికి
కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై
కందం
రిప్లయితొలగించండిపీడించెడు నరకాసురుఁ,
దోడుగ సత్యఁ గొని చక్రి తునమంగ నుతుల్!
గోడాడించు దురితులకుఁ
గీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై!
ఉత్పలమాల
పీడితులెల్లరున్ వెతల వేడగ చక్రిని రక్షఁ జేయగన్
దోడుగ సత్యతో నరకుఁ ద్రుంచగ సన్నుతులందె! లోకులున్
వేడుకఁ జేసి దీపముల వెల్గును గాంచిరి, రాక్షసాళికిన్
గీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రీడలలోన శత్రువును, రేగిన యుద్ధమునందు వైరికిన్
రిప్లయితొలగించండిచేడియ గౌరవమ్మునకుఁ జేటునుఁ జేసెడి నీచ బుద్ధికిన్
కూడునుఁ బెట్టు దేశమనఁ గూరిమి లేని విదేశ భక్తికిన్
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్!!
రిప్లయితొలగించండికేడలగు తీవ్రవాదులు
బాడుగపై వచ్చి శాంతి భద్రత పైనన్
దాడులు చేసెడి ఖలురకు
కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై.
వేడుకలంచు గుంపులుగ వీధులలోజను లెల్ల జేరగా
బాడుగ పైన వచ్చి మన వారల ప్రాణములన్ హరించెడు
క్కీడుల గుర్తెఱంగుచును కేడల డీకొని యట్టి వారికిన్
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్.
రిప్లయితొలగించండిపాడుపనుల నేతలకున్
దోడుగ లభియించుచుంద్రు తొత్తులనేకుల్
నేడిట నమాజమునకున్
గీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై
పాడగు దేశమందుఁ గనవత్తురు నేతలు మిక్కుటంబుగన్
దోడుగ నిల్చియుంద్రు గద తొత్తులు కొందరు వారిచెంతనే
నేడిట నీఛకృత్యములఁ నేతల గొప్పగ చెప్పుచుండగా
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్
తోడుగ పేదల కండగ
రిప్లయితొలగించండినీడగ నిలిచియు సతతము నిర్మల హృది తో
పీడీ త నరకుల కు సదా
కీడొ న రించిన లభించు కీర్తి వసుధ పై
నేడెటు చూచిన పేదల
రిప్లయితొలగించండిపీడించెడు స్వార్థపరులె విస్తారముగా
వీడకనా దుర్మతులకు
కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై
నేడెటు జూచినన్ జనుల నిర్దయ నంకిలిపెట్టు వారలే
రిప్లయితొలగించండిపీడితులైన పేదలకు పెన్నిధులట్టుల నూర్జితమ్ముగా
తోడుగనిల్చి సంతతము దుష్టుల పీఁచమడంచు పూనికన్
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్
కం:కూడెను భాగ్యమ్ముల్ పెరి
రిప్లయితొలగించండికీడున,దివి సీమ కెంతొ కీడు జరిగె నీ
నాడయ్యో! సాయము పెరి
కీ డొనరించిన లభించుఁ గీర్తి వసుధపై”
(పెరికీడు అనే గ్రామం కృష్ణా జిల్లా లో ఉంది.మన ఊరి పరిస్థితి బానే ఉంది కదా!దివిసీమ ఉప్పెన బాధితులకి సాయం చేస్తే మన ఊరికి మంచి పే రొస్తుం దని గ్రామస్తుడు అన్నట్టు.)
ఉ:వేడుచు యాజమాన్యముల ,వీడుచు కార్మికసంఘమైత్రి నే,
రిప్లయితొలగించండియూడిగ మెప్పుడున్ సలుప నోర్పని నేర్పని తోటి వారికిన్
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును, లోకమందునన్
కూడని యిట్టి పోకడయె కూల్చును శ్రామిక వర్గ భాగ్యమున్.
(ఉద్యోగులు యూనియన్ ని పట్టించుకోక మేనేజ్మెంట్ తో స్నేహం గా ఉండి చాకిరీ చేస్తుంటే తరచుగా యూనియన్ల నాయకులు ఇలాంటి భావాలు వ్యక్తం చేస్తారు.వారి దృష్టిలో ఇలా పని చేసే వాళ్లు తోటి శ్రామికులకి
కీడు చేసినట్టు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ;వాడల సజ్జనాళికిని బాధల దెచ్చెడు వారికిన్,సదా
రిప్లయితొలగించండివీడక మద్యపానమును,వేడుక గోరుచు స్త్రీజనాళికిన్
కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్
దోడుగ నేతలుండినను,తోటి కులస్తుల యండ యుండినన్
(కీడు చేసే వారికి ఊరికే కీర్తి లభించదు.వాళ్లకి నాయకుల,కులాల అండ ఉంటే లభిస్తుంది.)
వీడను వాడను లేకను
రిప్లయితొలగించండిచీడగపట్టుచు నెపుడును సిరి పెంచుకొనే
కీడొనరించిన వారికి
కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై
వీడి చలమ్ము నెడఁద మా
రిప్లయితొలగించండిరాడకయే మేలొనర్ప నపకారికిఁ దా
నోడకయే మున్నాతఁడు
కీ డొనరించిన లభించుఁ గీర్తి వసుధపై
పాడిగ నుద్యమించి తగు భద్రము గూర్పఁగ మానవాళికిన్
వేఁడక మున్న యెవ్వరును బెద్దరికమ్మున సుంత యేని కే
ళ్లాడఁగ నీక మానవుల కత్యధికమ్ముగ వచ్చు కీళ్లకుం
గీ డొనరించు వారలకుఁ గీర్తి లభించును లోక మందునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
దాడి యొనర్చుచు మనుజుల
పీడించెడు క్రిములనెల్ల విస్తారముగా
వీడకను సంహరించుచు
కీడొనరించిన లభించు కీర్తి వసుధపై.