కం:అరమూతల కన్నులతో నరవిందుల రచన యైన యా కావ్యమునే అరసెడు నాన్నకు ముఖమను నరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్” (అరవింద యోగి సావిత్రి అనే మహాకావ్యాన్ని వ్రాసా రని తెలిసిందే.నాన్న అర మూతలు పడే కన్నులతో కూడా అర్థరాత్రి ఆ కావ్యాన్ని చదవగా ఆయన ముఖారవిందం ఆనందం తో వికసించింది.అరవింద మహా యోగికి నమస్కారం.)
కందం
రిప్లయితొలగించండిమురిసెను పుట్టిన దినమని
వరపుత్రుఁడు, నింద్రజాల పాటవమదియే
దొరకొన ప్రదర్శనమ్మున
నరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్!
ఉత్పలమాల
తీరిచి వేదికన్ సుతుడు తృప్తిగ జన్మదినోత్సవంబనన్
గూరిచి విందు భోజనము, గోర వినోదము బంధుమిత్రులున్
నేరిచి యింద్రజాలము ననేకులు మెచ్చెడు పాటవమ్మునన్
బేరుకొనంగ నెల్లరరవిందము భాసురమయ్యె రాతిరిన్!
అరయగ దెలతెల వారగ
రిప్లయితొలగించండినరవిందము విచ్చె, రాత్రి యందరుగనన్
మురిసియు రేరాజునుగని
విరిసెను సంపెంగ మిగుల ప్రేమోన్నతితో.
అరుణుని గనుగొని నప్పుడె
రిప్లయితొలగించండివిరపూయుటకలవడినను వింతగ నేడే
పొరపాటు నొందెనేమో,
అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్
కూరిమి బెండ్లికూతునకు గోరిన సంగడికాడు భర్తగా
రిప్లయితొలగించండిచేరువయయ్యె రాత్రమున జేసిరి పెద్దలు పెండ్లి వేడుకల్
సారసనేత్రి మానసము సంధ్య వెలుంగుల నివ్వటిల్లగా
పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్
సరసిజనేత్రికి కోరిన
రిప్లయితొలగించండివరునికి సతిగా వివాహ బంధము గదురన్
విరిసెను మదిలో భానుఁడు
అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్
రిప్లయితొలగించండిఇరుబుట్టువుతోడ విషయ
మెరగిన కృష్ణుండు వడిని యేతెంచ తలో
దరి రుక్మిణి వదనమనెడి
యరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్.
కోరిన వానితో మనువు గోరుచు కోమలి యాయమందునన్
పారుని కంసఘస్మరుని వద్దకు పంపిన యంత వెన్నుడే
భీరీవు జేరరాగ గని వెన్నుడు వచ్చెనదో యటంచటన్
పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ ధరణిని కవిత్వ సంపద
రిప్లయితొలగించండిపరఁగఁగఁ దనయఁగ మనుజులు పద్మ గరువమున్
విరియఁగ సమ్మాన సభల
నరవిందము విచ్చె రాత్రి యందఱు గనన్
ఉ॥ ధారుణి సత్కవిత్వ సుమ ధామములై విరియంగ కావ్యముల్
సారపు మాధురీ మహిమ సర్వుల ముగ్ధులఁ జేసి దీపిలన్
పారఁగఁ గీర్తి వాహినియు పద్మ పురస్కృత మొంద సత్కవుల్
పేరుకొనంగ నెల్లరరవిందము భాసురమయ్యె రాతిరిన్
తరుణికి తాఁ గోరు శుభం
రిప్లయితొలగించండికరుడు వరుండై లభింపగా నవవధువే
మురియగ నామె వదనమై
యరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్
వారిజనేత్రి మర్లుకొని వచ్చెను శ్రేష్ఠుని బెండ్లియాడగా
తీరగు రంగమంటపము దివ్యమనోహర లగ్నమందునన్
గోరిన వాడు కట్టుకొనఁ గోమలి చూపడె నామె చుబ్రమే
పేరు కొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్
పరిణయ వేళను వధువుకు
రిప్లయితొలగించండిమురిపించె డు రీతి జరుగు ముస్తా బు లతో
విరియుచు వికసించు ముఖపు
టర విందము విచ్చె రాత్రి యందరు గన న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఊరక వ్రాయుకావ్యముల నుత్తమ వర్ణన రీతి పల్కరే
రిప్లయితొలగించండిసారసముల్ ప్రభాకరుని చామలు గాన వికాసమొందునా
సూరుని స్పర్శ తాకుతఱి, సూనృతమేమన చెర్వులందునన్
పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్!!
భరతావని నుండి నిశ న
రిప్లయితొలగించండిమెరికా తిరము గొనిపోవ మెరిసెడి ముకుళమ్
ఎరుపు పసుపు వర్ణముగల
అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్
కం:అరమూతల కన్నులతో
రిప్లయితొలగించండినరవిందుల రచన యైన యా కావ్యమునే
అరసెడు నాన్నకు ముఖమను
నరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్”
(అరవింద యోగి సావిత్రి అనే మహాకావ్యాన్ని వ్రాసా రని తెలిసిందే.నాన్న అర మూతలు పడే కన్నులతో కూడా అర్థరాత్రి ఆ కావ్యాన్ని చదవగా ఆయన ముఖారవిందం ఆనందం తో వికసించింది.అరవింద మహా యోగికి నమస్కారం.)
ఉ:తీరని యాత్రతన్ గెలుపు దేనిదొ యంచును దూరదర్శన
రిప్లయితొలగించండిమ్మారయ నట్టు లిట్టు లయి యాత్రత దీర్చుచు భాజపాకె యిం
పారగ గెల్పు దక్కె సరి యయ్యె నటం చభిమాన దీప్తితో
పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్”
(ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే కాసేపు అటూ, కాసేపు ఇటు ఐ చివరికి భాజపా గెలిచింది.భాజపా గుర్తు అరవిందం.అది వికసించింది.)
తరణి కిరణ సదృశములు రు
రిప్లయితొలగించండిచిర విద్యుద్దీప రుచు లశేషప్రభలం
దరుణీరత్నము వక్త్రం
బరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్
వారి నగౌరవించు టది పాడియె చెప్పఁ దలంచు వృత్తమున్
నేరమె చాలు విన్న కత నిక్కము సాంతము వింట వింతయే
యూరక యేల వద్దనుట యుందము శాంతి వహించి పూర్తి కాఁ
బేరుకొనంగ నెల్ల రర విందము భాసుర మయ్యె రాతిరిన్
[అర = సగము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితరునికి నచ్చిన ప్రియుడే
రిప్లయితొలగించండివరుడై వచ్చె,నొక నిశిని , పరిణయ మాడన్
మురిసిన యామెను జూడగ
యరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్”